సెప్టెంబర్ 2న ప్రారంభం కానున్న డిస్కవరీ స్పోర్ట్ బుకింగ్స్ ని మొదలుపెట్టిన ల్యాండ్ రోవర్ ఇండియా
డిల్లీ: జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా లిమిటెడ్ (జె ఎల్ ఆర్ ఐ ఎల్) దాని డిస్కవరీ స్పోర్ట్ యొక్క బుకింగ్స్ ని అధికారికంగా తీసుకోవడం మొదలుపెట్టింది. ఈ ఎస్యువి సెప్టెంబర్ 2న, 2015 న భారతదేశంలోనికి రానున్నది.
"కొత్త డిస్కవరీ స్పోర్ట్, శుద్ధీకరణ కొత్త స్థాయిలు, ఇంజనీరింగ్ సమర్థత మరియు కస్టమర్ డిజైన్ విభాగంలో ప్రముఖ పాండిత్యము మరియు ల్యాండ్ రోవర్ యొక్క పాత వాహనాల నుండి తీసుకోబడిన అంశాలతో రూపొందించబడుతున్నది.
డిస్కవరీ స్పోర్ట్ అనే కారు ఫ్రీలాండర్ 2 అనే కారు స్థానంలో వచ్చింది. దీని పొడవు 4,599mm, వెడల్పు 2,173 mm, ఎత్తు 1,724mm మరియు వీల్ బేస్ 2,741mm. ఈ వాహనం 5 + 2 సీటింగ్ ఎంపికను అందించే విభాగంలో మొట్టమొదటి మిడ్ సైజ్ ఎస్యువి.
జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా లిమిటెడ్ యొక్క అధ్యక్షుడు రోహిత్ సూరి ఈ విధంగా అన్నారు. "కొత్త డిస్కవరీ స్పోర్ట్ ప్రీమియం ఎస్యువి ముఖ్యంగా మా వినియోగదారులలో అడ్వెంచర్ తత్వాన్ని మేలుకొలుపుతుంది. ల్యాండ్ రోవర్ యొక్క అసమానమైన నాలుగు చక్రాల డ్రైవ్ టెక్నాలజీతో కుటుంబం మరియు స్నేహితులతో చురుకైన బహిరంగ జీవనశైలి ఆనందించండంలో సహాయపడుతుంది. ఇది అన్వేషించడానికి మరియు కనుగొనడానికి ఒక అన్స్టాపబుల్ స్ఫూర్తితో మరియు అభిరుచి తో రూపొందించబడిన పరిపూర్ణమైన వాహనం. ఈ కొత్త డిస్కవరీ స్పోర్ట్ యొక్క ప్రారంభంతో భారతదేశం లో ల్యాండ్ రోవర్ యొక్క ఉత్పత్తి సమర్పణ విస్తరణ లో మరొక ముఖ్యమైన మైలురాయి గా గుర్తించబడుతుంది" అని పేర్కొన్నారు.
భారతదేశం లో ల్యాండ్ రోవర్ రేంజ్ ప్రస్తుతం ఫ్లాగ్షిప్ రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్, డిస్కవరీ 4, మరియు స్థానికంగా తయారైన రేంజ్ రోవర్ వంటి వాటిని కలిగి ఉంది.