కొత్త డిస్కవరీ స్పోర్ట్ కోసమై ల్యాండ్ రోవర్ 200+ పైగా ప్రీ-ఆర్డర్లను ఇప్పటికే అందుకుంది
ఆగష్టు 17, 2015 11:15 am raunak ద్వారా ప్రచురించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఇంకా పూర్తిగా ఒక వారం రోజులు కూడా కాలేదు బుకింగ్స్ మొదలయ్యి!
జైపూర్: ల్యాండ్ రోవర్ దాదాపుగా 200+ పైగా ప్రీ-ఆర్డర్లను రాబోయే ఎస్యూవీ అయిన 2015 డిస్కవరీ స్పోర్ట్ కోసమై వారం రోజుల సమయంలో అందుకుంది. ఈ వాహనం దేశంలో వచ్చే నెల 2న విడుదల అవుతుంది. ఇది సీకేడీ అనే (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) అనే దార్రిలో విడుదల అయ్యింది - స్థానిక సమీకరణ దేశం లోని జాగ్వార్-ల్యాండ్-రోవర్ సముదాయం లో చేయబడింది. ఇది మెర్సిడెజ్ బెంజ్ ఎం క్లాస్, బీఎండబ్ల్యూ ఎక్స్3, ఆడీ క్యూ5, వోల్వో ఎక్సీ60 మొదలగు వాటితో ఇది తలపడనుంది. కాని మిగతా వాటిలా కాకుండా, ఇందులో 5+2 సీటింగ్ విధానం ఉంది.
జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా లిమిటెడ్ (జేఎలారైఎల్) కి ప్రెసిడేంట్ అయిన రోహిత్ సూరీ ఏమన్నారంటే," ల్యాండ్ రోవర్ యొక్క అత్యంత బహుముఖ ప్రీమియం ఎస్యూవీ అయిన 'డిస్కవరీ స్పోర్ట్' ఎంతో అద్భుతమైన సపందన ని పొందింది భారతీయ కస్టమర్ల దగ్గర నుండి. మేము వారి స్పందనకి మరియూ మా పై పెట్టుకున్న నమ్మకానికి ఎంతో ఋణపడి ఉంటాము," అని అన్నారు.
దీనికి 2.2-లీటరు గల ఇంజిను 9-స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ తో కూడి ఇవ్వబడింది. ఇది 2,179సీసీ మోటరు కలిగి దాదాపు 150పీఎస్ శక్తి మరియూ 1750ఆర్పీఎం వద్ద 400ఎనెం టార్క్ ని ఇవ్వగలదు. ఇది గంటకి 0 నుండి 100కీ.మీ కేవలం 10.3 సెకన్లలో వెలుతుంది పైగా గరిష్టంగా గంటకి 180 కీ.మీ వేగాన్ని అందుకుంటూంది. దీని ట్యాంక్ కెపాసిటీ 65 లీటర్లు.