• English
  • Login / Register

లంబోర్ఘిని ఊరుస్ SUV ట్విన్ టర్బో V8 ఇంజన్ ను పొందుతుంది

డిసెంబర్ 04, 2015 02:21 pm bala subramaniam ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

చెన్నై:

సంస్థలో మొట్టమొదటిసారిగా, లంబోర్ఘిని రాబోయే SUV లంబోర్ఘిని ఊరుస్ కి 4.0-లీటరు V8 రెండు టర్బో ఇంజన్ ని అందిస్తున్నట్టుగా ప్రకటించింది. మొదటిసారిగా సంస్థ లంబోర్ఘిని కి టర్బోచార్జెడ్ ఇంజిన్లను ఉపయోగిస్తుంది. అంతకు మునుపు ఇది నేచురల్లీ ఇన్స్పిరేటెడ్ V10 మరియు V12 ఇంజిన్లు ఉపయోగించేది. ఈ న్యూస్ ఆటోకార్ తో ఒక ఇంటర్వ్యూలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ మిస్టర్ స్టీఫన్ విన్కేల్మాన్ మరియు R & D అధిపతి మిస్టర్ మారిజియో రెగ్గియని ద్వారా నిర్ధారించబడింది. లాంబోర్ఘిని ఉరూస్ 2017 చివరి భాగంలో లేదా 2018 ప్రారంభంలో విదుదలయితే గనుక ఖచ్చితంగా 2018లో దాని అమ్మకాలు పెరుగుతాయి. ఒక టర్బో-చార్జ్డ్ ఇంజన్ ఉపయోగించడం వలన తక్కువ CO2 ఉద్గారాలు, ఆఫ్ రోడింగ్ అసిస్టెన్స్ కొరకు సమర్ధవంతమైన టార్క్ ని అందిస్తుంది మరియు అధిక పనితీరుకి టాప్ ఎండ్ శక్తి అందించడం వంటి లాభాలు కలుగుతాయి. 4.0-లీటరు V8 ఇంజిన్ ప్రత్యేకంగా లంబోర్ఘిని కోసం తయారుచేయబడింది మరియు VW ఫ్యామిలీ లో ఏ ఇతర బ్రాండ్లు కోసం ఉపయోగించబడదు. ఈ ఇంజిన్ దాని విభాగంలో అత్యంత శక్తివంతమైనది మరియు ఉరూస్ ని దాని విభాగంలో అత్యంత శక్తివంతమైన SUV గా చేస్తుంది.

అధికారులు కూడా ఊరుస్ శ్రేణి భవిష్యత్తులో ఒక ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్ మరియు విలాసవంతమైన-ఫీచర్ ఆధారిత వెర్షన్ తో సాగుతుందని ధ్రువీకరించాయి. సూపర్వేలోస్తో మోడల్ వంటి ప్రత్యేక ఎడిషన్లు కూడా ప్రారంభం తరువాత స్థిరంగా ఉంటాయి. ఉరూస్ వాహనం భద్రతా కారణాల దృష్ట్యా విద్యుత్ సరఫరా నియంత్రించడానికి ఆల్ వీల్ డ్రైవ్ అవతార్ లో వస్తాయి.

ఉరూస్ వాహనం కొత్త ఆడి Q7 పంచుకున్నటువంటి అదే ప్లాట్‌ఫార్మ్ పై ఆధారపడి ఉంటుంది మరియు బెంట్లీ బెంటేగా కూడా అదే ప్లాట్‌ఫార్మ్ పైన త్వరలో రాబోతుంది. ఉరూస్ వాహన ఉత్పత్తి లంబోర్ఘిని యొక్క హెడ్‌క్వాటర్స్ లో శాంట్'అగాటా బోలోగ్నెసి లో జరగనున్నది.

ఇంకా చదవండి

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience