టెస్ట్ నిర్వహిస్తుండగా మరొక్కసారి కనిపించిన Kia Sonet Facelift; 2024 ప్రారంభంలో విడుదలవుతుందని అంచనా

కియా సోనేట్ కోసం tarun ద్వారా ఆగష్టు 23, 2023 03:33 pm ప్రచురించబడింది

  • 286 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

విడుదలైన మూడు సంవత్సరాలు తరువాత సోనేట్ నవీకరణను పొందనుంది, దీన్ని సరికొత్త డిజైన్, నవీకరించిన ఇంటీరియర్‌లు మరియు మరిన్ని ఫీచర్‌లతో అందించనున్నారు

Kia Sonet Facelift

  • సవరించిన ఫ్రంట్ ప్రొఫైల్, కొత్త అలాయ్ వీల్స్, కొత్త టెయిల్ؚలైట్‌లతో నవీకరించిన సోనెట్ మళ్ళీ కెమెరాకు చిక్కింది. 

  • క్యాబిన్ లోపల కూడా తేలికపాటి స్టైలింగ్ అప్ؚగ్రేడ్ؚలను పొందుతుందని అంచనా.

  • టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ మరియు క్లస్టర్ కోసం 10.25-అంగుళాల ఇంటెగ్రేటెడ్ డిస్ప్లేలను పొందవచ్చు. 

  • 360-డిగ్రీల కెమెరా మరియు ADASలతో భద్రత మెరుగుపడవచ్చు.

  • మునపటి పెట్రోల్, టర్బో-పెట్రోల్, మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలను కొనసాగించే అవకాశం ఉంది.

  • 2024 ప్రారంభంలో విడుదల అవుతుందని అంచనా. 

కియా సోనెట్ ఫేస్ؚలిఫ్ట్ మళ్ళీ కెమెరాకు చిక్కింది, ఇప్పటికీ ఇది ముసుగులోనే కనిపించింది. అయితే, ఈ టెస్ట్ వాహనం భిన్నమైన వేరియెంట్‌లా కనిపిస్తోంది. 2020లో విడుదల అయినప్పటి నుండి, మొదటి భారీ అప్‌డేట్ؚను వచ్చే సంవత్సరం ప్రారంభంలో ఈ సబ్‌కాంపాక్ట్ SUV పొందనుంది. 

కొత్తవి ఏమిటి?

Kia Sonet Facelift

ముందు వైపు, సోనెట్ ఫేస్ؚలిఫ్ట్ؚ రీడిజైన్ చేసిన గ్రిల్ మరియు బంపర్ؚతో పాటుగా అప్ؚడేట్ చేసిన LED హెడ్ؚలైట్‌లు మరియు DRLలను పొందనుంది. బంపర్ పై ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్ؚలు కూడా చూడవచ్చు, ఈ SUVకి ఇది ఒక కొత్త ఫీచర్ జోడింపు. 

సరికొత్త 16-అంగుళాల అలాయ్ వీల్స్ؚను పొందనుంది, ఇవి ఇదివరకు కనిపించిన GT లైన్ టెస్ట్ వాహనంపై చూసిన వాటికంటే భిన్నంగా కనిపించాయి. ఇది సోనెట్ ఫేస్ؚలిఫ్ట్ HTX లేదా HTX+ కావచ్చు అని భావిస్తున్నాము. 

సెల్టోస్ؚలో ఉన్నట్లు వెనుక ప్రొఫైల్ؚకు కనెక్టెడ్ LED టెయిల్ లైట్ؚలను జోడించారు. బంపర్ మరియు బూట్ లీడ్ؚలకు కొన్ని సవరణలను ఆశించవచ్చు. 

ఇంటీరియర్‌లో మార్పులు

ఈ రహస్య చిత్రాలు ఇంటీరియర్ؚను చూపించకపోయినా, క్యాబిన్ స్టైలింగ్ؚకు కూడా కొన్ని అప్ؚడేట్ؚలు ఉంటాయని ఆశించవచ్చు, సెంటర్ కన్సోల్, సీట్ అప్ؚహోల్స్ట్రీ మరియు ఇంటీరియర్ థీమ్‌ను కూడా సరికొత్త ఆకర్షణ కోసం నవీకరించవచ్చు.

Kia Sonet cabin

కొత్త ఫీచర్ జోడింపులు 

సెల్టోస్ؚలో ఉన్నట్లుగా కొత్త సోనెట్ కూడా డ్యూయల్ డిస్ప్లే స్క్రీన్ సెట్అప్ؚను పొందవచ్చు, దీనిలో డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 360-డిగ్రీల కెమెరా. బహుశా ADAS (అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) కూడా ఉండవచ్చు. 

ప్రస్తుతం ఎలక్ట్రిక్ సన్ؚరూఫ్, వెంటిలేటెడ్ ముందరి సీట్లు, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, ప్యాడిల్ షిఫ్టర్‌లు, ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు వెనుక పార్కింగ్ కెమెరాల వంటి ఫీచర్‌లతో ఇది పరిపూర్ణంగా ఉంది. 

ఇది కూడా చదవండి: సబ్-కాంపాక్ట్ SUVలో పనోరమిక్ సన్ؚరూఫ్ؚను చూస్తామా? 

పవర్‌ట్రెయిన్ అప్ؚడేట్ؚలు ఉన్నాయా?

2024 సోనెట్, ప్రస్తుతం ఉన్న ఇంజన్‌ల సెట్‌ను నిలుపుకుంటుంది, ఇందులో 83PS 1.2-లీటర్ పెట్రోల్, 120PS 1-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 115PS 1.5-లీటర్ డీజిల్ ఎంపికలు ఉన్నాయి. టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ iMTని (క్లచ్ పెడల్ లేకుండా మాన్యువల్) ప్రామాణికంగా పొందుతాయి, ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్‌ల ఎంపిక కూడా ఉంటుంది. 

అంచనా ధర మరియు పోటీదారులు

Kia Sonet Facelift

నవీకరించిన సోనెట్ ధర, ప్రస్తుత రూ.7.79 లక్షల నుండి రూ.14.89 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర కంటే అధికంగా ఉండబోతోంది. హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మహీంద్రా XUV300, రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్ మరియు మారుతి సుజుకి బ్రెజ్జాలతో పోటీని కొనసాగిస్తుంది. 

చిత్రం మూలం

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన కియా సోనేట్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience