• English
    • Login / Register

    త్వరలో ఫీచర్ నవీకరణలను పొందనున్న కియా సోనెట్, సెల్టోస్ మరియు క్యారెన్స్

    మార్చి 13, 2023 11:22 am rohit ద్వారా ప్రచురించబడింది

    • 42 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    ఈ నవీకరణؚలలో చాలా వరకు భద్రత అంశాలకు చెందినవే, అన్నిటిలో ముఖ్యమైనది వెనుక మధ్య ప్రయాణికుడి కోసం మూడు-పాయింట్‌ల సీట్ బెల్ట్ؚను పరిచయం చేయడం 

    Kia Carens, Seltos and Sonet

    • వెనుక-మధ్య ప్రయాణికుడి కోసం మూడు-పాయింట్‌ల సీట్ బెల్ట్ మొదట రెండు SUVలలో ఆ తరువాత క్యారెన్స్ؚలో అందిస్తారు.

    • కియా సోనెట్ అన్ని వేరియెంట్‌లలో ISOFIX మరియు ESCని (డీజిల్ మాత్రమే) అందిస్తుంది. 

    • క్యారెన్స్ త్వరలో 12.5-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ؚను ప్రామాణికంగా పొందనుంది. 

    • మూడు మోడల్‌లలోని కనెక్టడ్ కార్ టెక్ؚను మార్చి 1 నుండి, అలెక్సా కనెక్టివిటీకి మద్దతు ఇచ్చేలా అప్ؚడేట్ చేయనున్నారు. 

    • ఈ నవీకరణలను అందించిన తరువాత వీటి ధరలో పెరుగుదల ఉంటుందని ఆశించవచ్చు. 

    కియా తన స్థానికంగా తయారుచేయబడిన మూడు వాహనాలు – సోనెట్, సెల్టోస్ మరియు క్యారెన్స్ؚల కోసం BS6 ఫేస్ II అప్ؚగ్రేడ్‌తో పాటుగా బహుళ అప్ؚడేట్‌లను అందించడానికి ప్రణాళిక చేస్తుంది. ప్రస్తుతం, ఈ కొరియన్ కారు తయారీదారు మూడు మోడల్‌లకు ఫీచర్ నవీకరణలను అమలు చేస్తుందని సమాచారం. 

    కియా చేయబోతున్న మోడల్-వారీ మార్పులను ఇప్పుడు చూద్దాం:

    సోనెట్

    Kia Sonet

    ఫీచర్ నవీకరణ

    వేరియెంట్ 

    ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC)

    అన్ని డీజిల్ వేరియెంట్‌లలో ప్రామాణికం  

    ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్ 

    అన్ని వేరియెంట్‌లలో ప్రామాణికం 

    3-పాయింట్ వెనుక మధ్య సీట్ బెల్ట్  

    అన్ని వేరియెంట్‌లలో ప్రామాణికం 

     

    సర్దుబాటు చేసుకోగల వెనుక సీట్ హెడ్ؚరెస్ట్ؚలు

    అన్ని వేరియెంట్‌లలో ప్రామాణికం

    సర్దుబాటు చేసుకోగల వెనుక మధ్య సీట్ హెడ్ؚరెస్ట్ؚలు

    అన్ని వేరియెంట్‌లలో ప్రామాణికం

    కియా కనెక్ట్‌కు అలెక్సా కనెక్టివిటీ (ఇప్పటికే పరిచయం చేయబడింది)

    HTX+, GTX+, X-లైన్

    • ఈ నవీకరణతో, కియా సోనెట్ లైన్ؚఅప్ؚలో మరిన్ని భద్రత ఫీచర్‌లను ప్రామాణికంగా అందించడంపై ధృష్టి పెట్టింది. వీటిలో ISOFIX యాంకర్‌లు, సర్దుబాటు చేసుకోగల వెనుక హెడ్ؚరెస్ట్ؚలు ఉన్నాయి, గతంలో ఇవి కేవలం హై-స్పెక్ HTX వేరియెంట్‌ల నుంచి మాత్రమే అందుబాటులో ఉండేవి. 

    • సబ్-4m SUVల కోసం కూడా ఈ కారు తయారీదాలు రెండు తేలికపాటి ముఖ్యమైన ఫీచర్‌లను తీసుకువస్తున్నారు అవి: వెనుక మధ్య ప్రయాణికుడి కోసం మూడు-పాయింట్ సీట్ؚబెల్ట్ మరియు అదే సీట్‌లో సర్దుబాటు చేసుకోగల హెడ్ؚరెస్ట్.

    Kia Sonet four airbags

    • సోనెట్ ఇప్పటికే నాలుగు ఎయిర్ బ్యాగులతో, హైలైన్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ప్రామాణికంగా వస్తుంది. 

    • అయితే, సోనెట్ؚలో ఇకపై మడవగలిగిన వెనుక ఆర్మ్-రెస్ట్ ఉండదు. 

    • ఇటీవల (మార్చి 1, 2023 నుండి)  కియా, సోనెట్ శ్రేణిలోని టాప్ వేరియెంట్‌లలో కనెక్టడ్ కార్ టెక్ؚను అమెజాన్ అలెక్సా కనెక్టివిటీతో అప్ؚడేట్ చేసింది. రిమోట్ క్లైమెట్ కంట్రోల్, రిమోట్ వెహికిల్ స్టేటస్ చెక్, వెహికిల్ లాక్/అన్ లాక్, ఫైండ్ మై కార్, స్పీడ్ అలెర్ట్ (ఆన్/ఆఫ్ చేసుకోగల) టైమ్ ఫెన్స్ అలర్ట్ (ఆన్/ఆఫ్ చేసుకోగల) మొదలైన రిమోట్ కమాండ్‌లను కియా కనెక్ట్ ద్వారా వినియోగదారులకు అందిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుత, కొత్త కస్టమర్‌లకు అందించబడుతుంది. 

    సెల్టోస్

    Kia Seltos

    ఫీచర్ నవీకరణ

    వేరియెంట్ 

    3-పాయింట్ వెనుక మధ్య సీట్ؚబెల్ట్  

    అన్ని వేరియెంట్‌లలో ప్రామాణికం  

    కియా కనెక్ట్ؚకు అలెక్సా కనెక్టివిటీ (ఇప్పటికే పరిచయం చేయబడింది)

    HTX, HTX+, GTX (O), GTX+, X-లైన్

    • సోనెట్‌లో అందిస్తునట్లుగా, సెల్టోస్‌లో కూడా వెనుక మధ్య సీట్ ప్రయాణికుడి కోసం మూడు-పాయింట్ సీట్ బెల్ట్ؚను పొందుతుంది. 

    • దీని కనెక్టెడ్ కార్ టెక్ؚను కూడా నవీకరించబడింది, ఇంతకు ముందు పేర్కొన్న సమాంతర ఫంక్షన్‌ల కోసం అమజాన్ అలెక్సా కనెక్టివిటీ మద్దతు ఉంటుంది. 

    ఇది కూడా చదవండి: మీ సన్‌రూఫ్‌ను సక్రమంగా నిర్వహించడానికి టాప్ ఐదు చిట్కాలు 

    క్యారెన్స్

    Kia Carens

    ఫీచర్ నవీకరణ

    వేరియెంట్ 

    12.5-అంగుళాల డిజిటలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్   

    అన్ని వేరియెంట్‌లలో ప్రామాణికం  

    లెదర్-చుట్టబడిన గేర్ నాబ్ 

    ప్రెస్టీజ్ ప్లాస్ట్ నుండి  

    3-పాయింట్ వెనుక మధ్య సీట్ؚబెల్ట్ 

    త్వరలోనే ప్రామాణికంగా అందిస్తారు 

    కియా కనెక్ట్ కోసం అలెక్సా కనెక్టివిటీ (ఇప్పటికే పరిచయం చేయబడింది)  

    లగ్జరీ, లగ్జరీ ప్లస్ 

    Kia Carens digitised instrument cluster

    • క్యారెన్స్ బేస్-స్పెక్ ప్రీమియం వేరియెంట్ నుండి 12.5-అంగుళాల డిజిటలైజ్ చేయబడిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ؚను కియా త్వరలోనే పరిచయం చేయనుంది. ఇప్పటి వరకు, దీన్ని బేస్ తరువాతి వేరియెంట్ అయిన ప్రెస్టీజ్ వేరియెంట్ؚలో మాత్రమే అందించారు. 

    • ఈ MPV మిడ్-స్పెక్ ప్రెస్టెజ్ ప్లస్ వేరియెంట్ నుండి లెదర్-చుట్టబడిన గేర్ నాబ్ కూడా వస్తుంది, ఇప్పటి వరకు దీన్ని కేవలం అధిక-స్పెక్ లగ్జరీ వేరియెంట్‌లలో మాత్రమే ఉండేది. 

    • ఈ నవీకరణతో, కారు తయారీదారు క్యారెన్స్ؚలో 3-పాయింట్ వెనుక మధ్య సీట్ బెల్ట్ؚను అందించడం లేదు, దీన్ని కొంత సమయంలో ప్రవేశపెట్టనున్నారు. 

    • SUV జంటలాగే, క్యారెన్స్ కనెక్టెడ్ కార్ టెక్ కూడా మార్చి 1 నుంచి పైన పేర్కొన్న ఫంక్షన్‌ల కోసం అలెక్సా కనెక్టివిటీని పొందుతుంది. 

    సంబంధించినవి: సోనెట్ సెల్టోస్ మరియు క్యారెన్స్ లైన్ؚఅప్ؚల నుండి డీజిల్-మాన్యువల్ ఎంపికను నిలిపివేయనున్న కియా ఇండియా

    ధర మరియు పోటీదారులు

    Kia Sonet, Carens and Seltos

    ఈ నవీకరణలతో, ఈ మూడు కియా కార్‌ల ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నాము, ప్రస్తుతానికి, సోనెట్ ధర రూ.7.69 లక్షల నుండి రూ.14.39 లక్షల మధ్య ఉంది. సెల్టోస్ మరియు క్యారెన్స్ ధరలు రూ. 10.19 లక్షల నుండి రూ. 19.15 లక్షల పరిధిలో ఉన్నాయి. కియా సబ్-4m SUV మహీంద్రా XUV300, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, నిసాన్ మాగ్నైట్, మారుతి బ్రెజ్జా, రెనాల్ట్ కైగర్ؚలతో పోటీ పడుతుంది. మరోపక్క సెల్టోస్ హ్యుందాయ్ క్రెటా, స్కోడా కుషాక్, వోక్స్ؚవ్యాగెన్ టైగూన్, మారుతి గ్రాండ్ విటారా వంటి వాటితో పోటీ పడుతుంది. క్యారెన్స్ టయోటా ఇన్నోవా కంటే క్రింది స్థానంలో ఉంది, హ్యుందాయ్ ఆల్కాజార్ؚకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. 

    ఇక్కడ మరింత చదవండి: సోనెట్ డీజిల్

    was this article helpful ?

    Write your Comment on Kia సోనేట్ 2020-2024

    explore similar కార్లు

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience