కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ Vs హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా మరియు టయోటా హైరైడర్: పెట్రోల్ మైలేజ్ పోలిక
కియా సెల్తోస్ కోసం rohit ద్వారా జూలై 31, 2023 07:34 pm ప్రచురించబడింది
- 1.2K Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ అనేది ఈ కాంపాక్ట్ SUV విభాగంలో ఒక సాధారణ ఎంపిక, కానీ వీటిలో అధిక ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉన్నది ఏది?
కియా సెల్టోస్ؚ ఇటీవల మిడ్ؚలైఫ్ నవీకరణను అందుకుంది, ఇందులో భాగంగా కొత్త టర్బో-పెట్రోల్ ఇంజన్ؚను పొందింది మరియు మునపటి 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలను, సంబంధిత గేర్ؚబాక్స్ ఎంపికలతో సహా నిలుపుకుంది. మీరు కియా SUV 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ؚను కొనుగోలు చేయాలనుకున్న లేదా పోటీదారుల వాహన సామర్ధ్యాలతో పోల్చి చూడాలనుకున్న, క్రింద అందించిన పట్టికను చూడండి.
పవర్ؚట్రెయిన్ؚలు మరియు ఇంధన సామర్ధ్యాల పోలిక
స్పెసిఫికేషన్ |
కియా సెల్టోస్ |
హ్యుందాయ్ క్రెటా |
మారుతి గ్రాండ్ విటారా |
టయోటా హైరైడర్ |
ఇంజన్ |
1.5-లీటర్ పెట్రోల్ |
1.5-లీటర్ పెట్రోల్ |
||
పవర్ |
115PS |
103PS |
||
టార్క్ |
144Nm |
137Nm |
||
ట్రాన్స్ؚమిషన్ |
6-స్పీడ్ MT, CVT |
5-స్పీడ్ MT, 6-స్పీడ్ AT |
||
క్లెయిమ్ చేసిన ఇంధన సామర్ధ్యం |
17kmpl, 17.7kmpl |
16.8kmpl, 16.9kmpl |
21.11kmpl/ 19.38kmpl (AWD), 20.58kmpl |
N.A.* |
*N.A – అందుబాటులో లేదు
పైన చూసినట్లు అయితే, మారుతి గ్రాండ్ విటారా పెట్రోల్-మాన్యువల్ కాంబో 21kmpl కంటే ఎక్కువగా అత్యధిక మైలేజ్‌ను అందిస్తుంది, దీని పెట్రోల్-ఆటో సెట్అప్ 20.5kmpl కంటే కొంత ఎక్కువగా మీలేజ్‌ను ఇస్తుంది.
పైన పేర్కొన్న అన్నీ కాంపాక్ట్ SUVలలో, హ్యుందాయ్ క్రెటా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుంది, ఇది కొంత మార్జిన్‌తో కియా సెల్టోస్ కంటే క్రింది స్థానంలో నిలుస్తుంది. హ్యుందాయ్ SUV గణాంకాలు ప్రీ-BS6.2 అప్‌డేట్ చేయబడిన పవర్‌ట్రెయిన్ؚవి అని గమనించాలి. ఈ కొరియన్ SUVలు మెరుగైన పనితీరును కనపరుస్తాయి, సాపేక్షంగా తక్కువ మైలేజ్ అందించడానికి ఇది కూడా కారణం కావచ్చు.
టయోటా హైరైడర్ క్లెయిమ్ చేసిన మైలేజ్ గణాంకాలు అందుబాటులో లేనప్పటికీ, అది గ్రాండ్ విటారా గణాంకాలకు సారూప్యంగా ఉండవచ్చు, ఎందుకంటే ఇవి రెండూ దాదాపుగా ఒకే విధమైన SUVలు. ఈ రెండు SUV ఆఫరింగ్ؚలు స్మార్ట్-హైబ్రిడ్ సాంకేతికతను కూడా పొందినాయి, ఇది సెల్టోస్-క్రెటా జంట కంటే అధిక ఇంధన సామర్ధ్యాన్ని అందిస్తాయి. ఇక్కడ పేర్కొన్న వాటిలో కేవలం గ్రాండ్ విటారా మరియు హైరైడర్ సరైన 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమ్యాటిక్‌ను కలిగి ఉన్న SUVలు. ఈ విభాగంలో పూర్తి-వీల్ డ్రైవ్ ట్రెయిన్ (AWD) ఎంపిక ప్రయోజనాన్ని పొందిన మోడల్‌లుగా ఈ కాంపాక్ట్ SUVలు నిలుస్తున్నాయి.
సంబంధించినవి: కియా సెల్టోస్ vs స్కోడా కుషాక్ vs వోక్స్వ్యాగన్ టైగూన్: టర్బో DCT క్లెయిమ్ చేసిన మీలేజ్ పోలిక
ఈ SUVల వేరియెంట్-వారీ పవర్ؚట్రెయిన్ ఎంపికలు
1.5-లీటర్ పెట్రోల్ MT |
1.5-లీటర్ పెట్రోల్ CVT |
1.5-లీటర్ పెట్రోల్ AT |
|
కియా సెల్టోస్ |
HTE, HTK, HTK+, మరియు HTX |
HTX |
– |
హ్యుందాయ్ క్రెటా |
E, EX, S, S+ నైట్, SX ఎగ్జిక్యూటివ్, మరియు SX |
SX, SX (O), మరియు SX (O) నైట్ |
– |
మారుతి గ్రాండ్ విటారా |
సిగ్మా, డెల్టా, జెటా, ఆల్ఫా, మరియు ఆల్ఫా AWD |
– |
డెల్టా, జెటా, మరియు ఆల్ఫా |
టయోటా హైరైడర్ |
E, S, G, మరియు V |
– |
S, G, మరియు V |
.... వీటి ధరలు ఇక్కడ చూడండి
సెల్టోస్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ వేరియెంట్ؚలను కియా రూ.10.90 లక్షలు మరియు రూ.16.59 లక్షల మధ్య విక్రయిస్తుంది. అదే పవర్ؚట్రెయిన్ؚలతో హ్యుందాయ్ క్రెటా వేరియెంట్ؚల ధర రూ.10.87 లక్షల నుండి రూ.17.70 లక్షల మధ్య ఉంది.
గ్రాండ్ విటారా-హైరైడర్ జంట మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ వేరియెంట్ؚల ధర రూ.10.70 లక్షల నుండి రూ.17.24 లక్షల పరిధిలో ఉంది. ఈ విభాగంలో 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మోటార్ؚతో వచ్చే మరొక వాహనం MG ఆస్టర్, కానీ దీని క్లెయిమ్ చేసిన సామర్ధ్య గణాంకాలు, ఈ పోలికను ప్రచురిస్తున్న సమయానికి అందుబాటులో లేవు.
ఇది కూడా చదవండి: కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ Vs హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, స్కోడా కుషాక్ & ఇతరములు: ధర పోలిక
సంబంధిత మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ గేర్ؚబాక్స్ ఎంపికలతో ఇక్కడ పేర్కొన్న నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ؚల నుండి, మీరు ఇష్టపడే SUV ఏది? కామెంట్‌లో మాకు తెలియజేయండి.
అన్నీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు
ఇక్కడ మరింత చదవండి: కియా సెల్టోస్ డీజిల్