Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

డెలివరీలను ప్రారంభించిన కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్

కియా సెల్తోస్ కోసం rohit ద్వారా జూలై 26, 2023 10:29 pm ప్రచురించబడింది

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్‌లు జూలై 14న ప్రారంభమయ్యాయి. ఒక రోజులో నే 13,000 లకు పైగా ఆర్డర్లు పొందింది.

  • కియా జూలై ప్రారంభంలో భారతదేశానికి కొత్త సెల్టోస్‌ను ప్రవేశపెట్టింది.

  • ఈ SUV మూడు విస్తృత వేరియంట్ లలో అందుబాటులో ఉంది: టెక్ (HT) లైన్, GT లైన్ మరియు X-లైన్.

  • ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లు, ఆటోమేటిక్ ఆప్షన్ లు ఉన్నాయి.

  • డ్యూయల్ 10.25-అంగుళాల డిస్‌ప్లేలు, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు ADAS వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి.

  • ధరలు రూ. 10.90 లక్షల నుండి రూ. 20 లక్షల మధ్య ఉన్నాయి (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).

మీరు భారతదేశంలో కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ రాక కోసం ఎదురు చూస్తున్నారా? అయితే డెలివరీ గురించి టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. కార్‌మేకర్ అప్‌డేట్ చేయబడిన SUVని ప్రారంభించిన కొద్ది రోజులకే కస్టమర్‌లకు SUV ని అందజేయడం ప్రారంభించారు. కియా జూలై 14న సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్‌లను ప్రారంభించింది. ఇది మొదటి రోజునే 13,000 ప్రీ-ఆర్డర్‌లను పొందింది. కియా అధిక-ప్రాధాన్యతతో SUV డెలివరీ కోసం వినియోగదారులకు "K-కోడ్" అనే కాన్సెప్ట్‌ను కూడా పరిచయం చేసింది.

కొత్త ఎంపికలలోని నవీకరణలు

నవీకరించబడిన సెల్టోస్ మూడు విస్తృత వేరియంట్ లైన్లలో అందుబాటులో ఉంది: టెక్ (HT) లైన్, GT లైన్ మరియు X-లైన్. కియా కొత్త కాంపాక్ట్ SUVని ఇంజిన్-గేర్‌బాక్స్ కలయికల శ్రేణితో అందిస్తుంది, అవి క్రింది విధంగా ఉన్నాయి:

స్పెసిఫికేషన్

1.5-లీటర్ పెట్రోల్

1.5-లీటర్ టర్బో-పెట్రోల్

1.5-లీటర్ డీజిల్

శక్తి

115PS

160PS

116PS

టార్క్

144Nm

253Nm

250Nm

ట్రాన్స్మిషన్

6-స్పీడ్ MT, CVT

6-స్పీడ్ iMT, 7-స్పీడ్ DCT

6-స్పీడ్ iMT, 6-స్పీడ్ AT

క్లైమ్డ్ మైలేజ్

17kmpl, 17.7kmpl

17.7kmpl, 17.9kmpl

20.7kmpl, 19.1kmpl

సంబంధిత: 2023 కియా సెల్టోస్ మొదటి డ్రైవ్ సమీక్ష: సాధించబడింది, ఇంకా చాలా నిరూపించాల్సి ఉంది

ఫీచర్లు!

మిడ్‌లైఫ్ నవీకరణ ఇవ్వకముందే, సెల్టోస్ ఇప్పటికే దాని విభాగంలో అత్యంత ఫీచర్-లోడ్ చేయబడిన SUVలలో ఒకటి. కానీ ఇప్పుడు, కియా సెగ్మెంట్-ఫస్ట్ డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు డ్యూయల్ 10.25-అంగుళాల డిస్ప్లేలను (ఒకటి ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం మరియు మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం) పరిచయం చేయడం ద్వారా దాని స్థాయిని పెంచింది. SUVలో ఉన్న ఇతర ప్రీమియం ఫీచర్లలో పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్ మరియు వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ ఉన్నాయి.

భద్రతా ఫీచర్లు

ఫేస్‌లిఫ్ట్‌తో, కియా SUVలో అధునాతన డ్రైవర్ సహాయ వ్యవస్థలను (ADAS) పరిచయం చేసింది, ఇందులో లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB) వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని భద్రతా కిట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్‌లు మరియు ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు కూడా ఉన్నాయి.

దీని ధరలు చూద్దాం

కియా ఫేస్‌లిఫ్టెడ్ సెల్టోస్ రూ. 10.90 లక్షల నుండి రూ. 20 లక్షల రేంజ్‌లో ఉంది (పరిచయ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ఇది హ్యుందాయ్ క్రెటా, టయోటా హైరైడర్, వోక్స్వాగన్ టైగూన్, స్కోడా కుషాక్, మారుతి గ్రాండ్ విటారా, MG ఆస్టర్ మరియు రాబోయే సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్-హోండా ఎలివేట్ డ్యూయో లకు ప్రత్యర్థి.

మరింత చదవండి: కియా సెల్టోస్ ఆటోమేటిక్

Share via

Write your Comment on Kia సెల్తోస్

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.15.50 - 27.25 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.15 - 26.50 లక్షలు*
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.6.20 - 10.51 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర