• English
  • Login / Register

భారతదేశంలో 2017 నుండి కొత్త జీప్ వాహన ఉత్పత్తికి 280 మిలియన్ డాలర్ పెట్టుబడి పెట్టిన ఫియాట్!

జూలై 03, 2015 06:03 pm raunak ద్వారా ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఫియట్-క్రిస్లర్ స్థానికంగా 2017 రెండో త్రైమాసికంలో , భారతదేశం లో తాము తయారు చేయబోయే 'కొత్త జీప్ వాహనం' కి పెట్టుబడి పెడుతున్నట్లు నిర్ధారించారు. 

జైపూర్: ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ కంపెనీ తాము ఫియట్ ఇండియా ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ , టాటా మోటార్స్ లిమిటెడ్ లతో కలిసి ఫియాట్ యొక్క రాంజనగాన్ లో తమ ఉత్పత్తిని పెంచుకోవడానికి 280 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించింది. ఫియట్ క్రిస్లర్ లో ఒక కొత్త జీప్ వాహనం ఉత్పత్తి కి ఈ పెట్టుబడి పెట్టారు మరియు ఈ జీప్ ఉత్పత్తి 2017 రెండో త్రైమాసికంలో ప్రారంభించే అవకాశాలున్నాయని తెలిసింది. 

 ఫియాట్ క్రిస్లర్ ఆటో మొబైల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సెర్గియో మర్చియోన్నె మాట్లాడుతూ" "మేము ఈ పెట్టుబడి భారతదేశం లో ఫియాట్ క్రిస్లర్ ఆటో మొబైల్స్ ఉనికిని బలోపేతం చేస్తుందని, ఇది ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది అని ఆయన అన్నారు. ఉమ్మడి వెంచర్లో ప్రముఖ జీప్ అనే పేరున్న ఈ వాహానాన్ని ప్రపంచ స్థాయి ఉత్పత్తులకు తగినట్లుగా అందివ్వగలమనే విశ్వాసంతో దీనిని ప్రారంభించాము " అని ఆయన అన్నారు.

ప్రపంచ నివేదిక ప్రకారం ఈ వాహనం భారతదేశంలో రంగ ప్రవేశం చేయనుంది. ఈ వాహనం, మహీంద్రా ఎక్యువి5ఓఓ తో పాటు టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్ వంటి వాహనాలతో పోటీ పడనుంది. అంతేకాకుండా, ఈ జీప్, 4డబ్ల్యూడి డ్రైవ్ తో రాబోతుంది. ఈ వాహనం బహుళ ఇంజన్ ఎంపికలతో రాబోతుంది అని అనేక పుకార్లు ఉన్నాయి. అంతేకాకుండా భారతదేశం లో ఫియాట్ చే తయారుచేయబడిన 1.5 లీటర్ మల్టిజెట్ ఇంజన్ తో రాబోతుంది. అంతేకాకుండా ఈ జీప్ వాహనం, 2.0 లీటర్ మల్టిజెట్ ఇంజన్ తో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇంజన్ 4 డబ్ల్యూడి సెటప్ తో జత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా, ఈ వాహనం ఫార్చ్యూనర్ కు వ్యతిరేకంగా టాటా ఎస్యువి ల వచ్చే అవకాశాలు ఉన్నాయి అని పుకార్లు వస్తున్నాయి. అంతేకాక, ఈ జీప్ వాహనం ఒక కాంపాక్ట్ ఎస్యువి ను కూడా అందించే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది రేనీగ్రేడ్ ను వెల్లడించింది. ఈ రాబోయే వాహనం, భారతదేశంలో ఉన్న కాంపాక్ట్ ఎస్యువి లకు మరియు క్రాస్ ఓవర్లకు పోటీగా రానుంది. అవి ఏమిటంటే, రెనాల్ట్ డస్టర్ / నిస్సాన్ టెర్రినో, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ తో పాటు రాబోయే హ్యుందాయ్ క్రెటా మరియు మారుతి సుజుకి ఎస్-క్రాస్. ఈ కాంపాక్ట్ ఎస్యువి కూడా 1.5 లీటర్ మల్టిజెట్ డీజిల్ ఇంజన్ తో రాబోతుంది. 

కంపెనీ ప్రెస్ విడుదలలో, యూఎస్ బయట ఉన్న రంజాంగంజ్, పూనే ప్లాంట్ లో జీప్ వాహనాల వాల్యూమ్ ఉత్పత్తి నాల్గవ స్థానంలో ఉండబోతుంది అని చెప్పారు. జీప్ బ్రాండ్ వాహనాల ఉత్పత్తి ప్రస్తుతం ఇటలీ మరియు బ్రెజిల్ లో నిర్మించబడుతున్నాయి మరియు 2015 నాలుగో త్రైమాసికంలో చైనా లో ఉత్పత్తి ప్రారంభం అవుతుంది అని కూడా వ్యాఖ్యానించారు. 

"మహారాష్ట్ర తో ఫియట్ యొక్క అసోసియేషన్ కొత్తది ఏమి కాదు మరియు అనేక దశాబ్దాల నాటిది అని " ముఖ్యమంత్రి ఫడ్నవీస్ చెప్పారు. అంతేకాకుండా, మహారాష్ట్ర లో దీని ఉత్పత్తి ప్రారంభిస్తున్నందుకు మరియు ఫియాట్ క్రిస్లర్ వారికి స్వాగతం మరియు వారు మా రాష్ట్రం లో దీనిని స్థాపించాలనే ఆలోచనతో పెట్టుబడి పెట్టారు మరియు మా ప్రభుత్వం కూడా ఫియాట్ యొక్క అనుబంధాన్ని విస్తరింపచేయడానికి ఫియాట్ వారికి వచ్చిన ఈ కొత్త ఆలోచనకు మేము మద్దతను ఇస్తున్నాము అని ఆయన ప్రసంగించారు". 

పిఎస్: గ్రాండ్ చెరోకీ మరియు రాంగ్లర్ వంటి వాహనాలు సిబియు మార్గం ద్వారా భారతదేశంలోకి వచ్చాయి, అలాగే ఈ సంవత్సరం అడుగుపెట్టబోయే జీప్ బ్రాండ్ కూడా ఈ మార్గం ద్వారానే రాబోతుంది. 

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience