• English
  • Login / Register

2016 భారత ఆటో ఎక్స్పో వద్ద ఎఫ్ -పేస్ ఎస్యూవి ను ప్రదర్శించనున్న జాగ్వార్

జాగ్వార్ సి ఎక్స్17 కోసం raunak ద్వారా ఫిబ్రవరి 04, 2016 11:20 am ప్రచురించబడింది

  • 14 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కొనసాగుతున్న 2016 భారత ఆటో ఎక్స్పోలో జాగ్వార్ వారి మొట్టమొదటి ఎస్యూవి అయిన ఎఫ్ ఫేస్ వాహనాన్ని ఇండియన్ ప్రీమియర్ గా చేసింది. ఈ ఎస్యువి వాహనం, సంవత్సరం రెండవ భాగంలో విడుదల అవుతుంది అని భావిస్తున్నారు. జాగ్వార్ ఎఫ్- పేస్ వాహనం, 2015 సంవత్సరం లో కొన్ని నెలల క్రితం బహిర్గతం అయ్యింది. భారతదేశంలో ఈ వాహనం, ఇదే విభాగం లో ఉండే ఎస్యువి లు అయినటువంటి వోల్వో ఎక్స్ సి 90, ఆడి క్యూ 7, బిఎండబ్ల్యూ ఎక్స్ 5 మరియు ఇతర వాహనాలకు గట్టి పోటీ ను ఇస్తుంది.

ఈ వాహనం యొక్క ప్రదర్శన పరంగా చెప్పాలంటే, ఈ వాహనం యొక్క ముందు భాగం జాగ్వార్ యొక్క సెడాన్ ను పోలి ఉంటుంది అలాగే వెనుక భాగం స్టెరోయిడ్ ల పై ఎఫ్ టైప్ ను పోలి ఉంటుంది. ఎఫ్ -పేస్ అనునది, జాగ్వార్ యొక్క కొత్త తేలికపాటి అల్యూమినియం నిర్మాణం నుంచి చెక్కబడిన మూడవ ఉత్పత్తి. జాగ్వార్ ఇండియా ఈ ఎఫ్ ఫేస్ వాహనాన్ని, ప్యూర్, ప్రెస్టీజ్, ఆర్- స్పోర్ట్ మరియు ఫస్ట్ ఎడిషన్ అను 4 రకాల వేరియంట్ లతో అందిస్తుంది.

యాంత్రికంగా, ఈ ఎఫ్ ఫేస్ వాహనం భారతదేశంలో రెండు డీజిల్ ఇంజన్ లతో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ రెండు డీజిల్ ఇంజన్లు, 8- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటాయి మరియు ఈ ఇంజన్లు, ఏడబ్ల్యూడి (ఆల్ వీల్ డ్రైవ్) ఆధారంగా టార్క్, వాహనం యొక్క నాలుగు చక్రాలకు పంపిణీ చేయబడుతుంది. ఈ మోడల్ సిరీస్ యొక్క ప్యూర్ మరియు ప్రెస్టిజ్ వాహనాలు, 2.0 లీటర్ ట్విన్ టర్బో ఇంగీనియం డీజిల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటాయి. ఈ ఇంజన్ అత్యధికంగా, 4000 ఆర్ పి ఎం వద్ద 178 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 1750 నుండి 2500 ఆర్ పి ఎం మధ్యలో 430 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అదే ఈ మోడల్ సిరీస్ యొక్క ఆర్ స్పోర్ట్ మరియు ఫస్ట్ ఎడిషన్ విషయానికి వస్తే, 3.0 లీటర్ వి6 ట్విన్ టర్బో డీజిల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటాయి. ఈ ఇంజన్ అత్యధికంగా, 4000 ఆర్ పి ఎం వద్ద 296 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 2000 ఆర్ పి ఎం వద్ద 700 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ మోడల్ సిరీస్ యొక్క ప్యూర్ మరియు ప్రెస్టిజ్ వాహనాలకు, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ అందించబడతాయి. అదే ఆర్ స్పోర్ట్ వాహనం విషయానికి వస్తే, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్ అందించబడతాయి మరియు ఫస్ట్ ఎడిషన్ వాహనం విషయానికి వస్తే, 20 అంగుళాల వీల్స్ అందించబడతాయి. ఈ ఎఫ్ ఫేస్ వాహనానికి, 213 మిల్లీ మీటర్ల కనీస గ్రౌండ్ క్లియరెన్స్ అందించబడుతుంది.   


లక్షణాల గురించి మాట్లాడటానికి వస్తే, ఈ ఎస్యువి వాహనం, జాగ్వార్ యొక్క 8 అంగుళాల ఇన్ కంట్రోల్ సమాచార వ్యవస్థ, 5- అంగుళాల బహుళ ఇంఫో ప్రదర్శన, అనలాగ్ డైల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 80 వాట్ల జాగ్వార్ సౌండ్ సిస్టం వంటి ప్రామాణిక అంశాలతో వస్తుంది. మరోవైపు కొనుగోలుదారుడు ఈ వాహనం కోసం, 10జిబి అంతర్గత మెమోరీ తో 10.2 అంగుళాల ఇన్ కంట్రోల్ టచ్ ప్రో అలాగే 12.3 అంగుళాల విర్త్యువల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 380 వాట్ల మెరిడియన్ డిజిటల్ సౌండ్ సిస్టం వంటి అంశాలను ఆప్షనల్ గా ఎంపిక చేసుకోవచ్చు. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Jaguar సి ఎక్స్17

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience