2015-16 ఆర్థిక సంవత్సరం యొక్క మొదటి త్రైమాసిక ఫలితాలను విడుల చేసిన జాగ్వార్ ల్యాండ్ రోవర్
published on ఆగష్టు 10, 2015 02:26 pm by saad
- 10 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: బ్రిటిష్ వాహన తయారీదారుడు జాగ్వార్ ల్యాండ్ రోవర్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క క్వార్టర్ 1 ఫలితాలను వెల్లడించింది. ఈ కార్ల తయారీ సంస్థ, ఏప్రిల్-జూన్ 2015 వరకు 114,905 యూనిట్ల వాహనాలు రిటైల్ లో అమ్మకాలు జరిపింది. ఈ అమ్మకాలు గత సంవత్సరం సంఖ్యతో పోలిస్తే అదే తరహాలో విస్తారంగా ఉన్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే సంస్థ యొక్క రెవెన్యూ 351 మిలియన్ల యూరోలు తగ్గినప్పటికీ, కంపెనీ ఉత్తర అమెరికా, ఐరోపా ప్రధాన ప్రాంతాలలో మరియు యునైటెడ్ కింగ్ డమ్ దేశాలలో మాత్రం బలమైన ప్రతిస్పందనను రుచి చూసింది. అలాగే, చైనీస్ మార్కెట్ లో కూడా తక్కువ అమ్మకాలే జరిగాయని చెప్పవచ్చు.
జాగ్వార్ ల్యాండ్ రోవర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డాక్టర్ రాల్ఫ్ స్పెథ్ ఈ ఫలితాల గురించి వ్యాఖ్యానిస్తూ " "మేము ముఖ్యంగా చైనా లో, చాలెంజింగ్ స్థూల ఆర్థిక వాతావరణం ఉన్నప్పటికీ ఈ త్రైమాసికంలో ఘనమైఅన ఆర్థిక ఆదాయాలను సంపాదించుకున్నాము.ఈ ఫలితాలు ఐదు అంతర్జాతీయ ప్రాంతాల్లో మా సమతుల్య మార్కెట్ ఉనికిని తెలియజేయడానికి సాక్ష్యంగా ఉన్నాయి. మా ప్రీమియం వాహనాలకు ముఖ్యంగా డిమాండ్, మా నిరంతర వ్యూహంతో కొఓడిన పూర్తిగా ప్రపంచ తరగతి టెక్నాలజీస్ ని అందజేయడం వలన, తయారీ సౌకర్యాలు అద్భుతంగా ఉండడం వలన, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు మరియు వారి యొక్క సేవల వలన వస్తుంది. అందువలనే జాగ్వార్ ల్యాండ్ రోవర్ వ్యాపారం ప్రతి భాగంలో వినియోగదారులను మా వైపు ఆకర్షించేలా చేస్తుందని" ఆయన తెలిపారు.
2014 లో, జాగ్వార్ ల్యాండ్ రోవర్ ముందు సంవత్సరం కంటే 6.4 శాతం ఎక్కువ, 462,209 వాహనాలను అమ్మకాలు చేసింది. పైన చెప్పిన అమ్మకాల సంఖ్యలో 76,930 యూనిట్లు జాగ్వార్ ద్వారా అమ్మకం జరిగింది. మిగిలిన 385,279 యూనిట్లు ల్యాండ్ రోవర్ బ్రాండ్ చే అమ్మకాలు చేయబడ్డాయి. ఈ బ్రిటిష్ వాహనతయారీసంస్థ ప్రస్తుతం ఎగుమతులు నుండి 80% రాబడిని సంపాదించి యునైటెడ్ కింగ్ డమ్ నుండి పెద్ద ఎగుమతిదారులలో ఒకటిగా నిలిచింది.
సంస్థ తరువాత ఐదు సంవత్సరాల లోగా ప్రపంచవ్యాప్తంగా 50 కొత్త ఉత్పత్తులు పరిచయం చేయాలని యోచిస్తోంది. ఈ 50 ఉత్పత్తులలో 12 ఉత్పత్తులు ఈ సంవత్సరంలో నే ప్రారంభించనున్నట్లుగా సమాచారం. భారతదేశం సరసమైన ఎక్స్ ఇ సెడాన్ మరియు కొత్త 2016 ఎక్స్ ఎఫ్ సెడాన్ ని వచ్చే సంవత్సరం ప్రారంభించనున్నది.
- New Car Insurance - Save Upto 75%* - Simple. Instant. Hassle Free - (InsuranceDekho.com)
- Sell Car - Free Home Inspection @ CarDekho Gaadi Store
0 out of 0 found this helpful