• English
  • Login / Register

ఉత్తమమైన అక్టోబర్ అమ్మకాలను సాధించిన జాగ్వార్ ల్యాండ్ రోవర్

నవంబర్ 10, 2015 06:06 pm bala subramaniam ద్వారా ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:  

జాగ్వార్ ల్యాండ్‌రోవర్ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ నెలలో 41,553 వాహనాలు పంపిణీ చేసి గత ఏడాది అక్టోబర్ కంటే 24% వృద్ధిని సాధించాయి. 2015 యొక్క మొదటి పది నెలల్లో, జెఎల్ఆర్ 390,965 వాహనాలను అమ్మి 2014 కంటే 2% పెరిగింది.  

ప్రదర్శన గురించి వ్యాఖ్యానిస్తూ, జాగ్వార్ ల్యాండ్ రోవర్ గ్రూప్ సేల్స్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఆండీ గాస్ ఈ విధంగా మాట్లాడారు " మా అక్టోబర్ పనితీరు జాగ్వార్ ఎక్స్ఇ మరియు ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ కి చాలా సానుకూల మార్కెట్ స్పందన కొరకు దోహదపడ్డాయి. అలాగే రేంజ్ రోవర్ స్పోర్ట్, ల్యాండ్ రోవర్ డిస్కవరీ మరియు రేంజ్ రోవర్ అమ్మకాల ఘన పెరుగుదలకు దోహదపడ్డాయి." 

"గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అక్టోబర్ లో యుఎస్ఎ మరియు యుకె తో ప్రాంతీయ రిటైల్ అమ్మకాలు వృద్ధి సాధించాయి.  చైనాలో మార్కెట్ లో అమ్మకాలు పుంజుకున్న ఫలితంగా రేంజ్ రోవర్ స్పోర్ట్, రేంజ్ రోవర్ మరియు జాగ్వార్ ఎక్స్ఇ యొక్క అమ్మకాలు పెరిగే సూచనలు ఉన్నాయి."

"జాగ్వార్ ఎక్స్ఎఫ్ తో పాటూ  2016 మోడల్ ఇయర్ ఎక్స్‌జె మరియు  త్వరలో ప్రారంభించబడిన ఎఫ్-పేస్ తో జెఎల్ఆర్ రాబోయే నెలల్లో దాని అమ్మకాలను మరింతగా పెంచుకునే అవకాశం ఉంది." అని ఆయన తదుపరి అన్నారు. 

JLR అక్టోబర్ 2015 అమ్మకాల వివరాలు :

ఇప్పటివరకు అక్టోబర్ నెలను తీసుకుంటే గనుక  ల్యాండ్ రోవర్ ఈ నెలలో 34,086 వాహనాలను అమ్మి మునుపటి సంవత్సరం తో పోలిస్తే 21% వృద్ధి సాధించింది. అక్టోబర్ వరకూ ఈ ఆర్ధిక సంవత్సరానికి గానూ  మొత్తం 323,353 వాహనాలను విక్రయించి మునుపటి సంవత్సరం తో పోలిస్తే 2 శాతం వృద్ధిని సాధించింది. ఈ నెల ఉత్తమ అమ్మకాల జాబితాలో మునుపటి సంవత్సరం తో పోలిస్తే రేంజ్ రోవర్ స్పోర్ట్ 40 శాతం, ల్యాండ్ రోవర్ డిస్కవరీ 41% మరియు రేంజ్ రోవర్ 21 శాతం వృద్ధిని సాధించాయి. కొత్త డిస్కవరీ స్పోర్ట్ నెలలో 7,182 యొక్క రిటైల్ వ్యాపారంతో ప్రజాదరణ పెరగడం కొనసాగుతుంది. చైనీస్ మార్కెట్ కోసం డిస్కవరీ స్పోర్ట్ యొక్క స్థానిక ఉత్పత్తి సెప్టెంబరులో ప్రారంభమయ్యింది. దీని రెటైల్ అమ్మకాలు ఈ సంవత్సరం చివరి నాటికి ప్రారంభం కావచ్చు. గిర్నార్‌సాఫ్ట్ 

జాగ్వార్  అక్టోబర్ నెలలో 7,467 వాహనాలను పంపిణీ చేసి 2014  అక్టోబర్ తో పోలిస్తే 39% వృద్ధిని సాధించాయి. కానీ జనవరి నుండి ఇప్పటి వరకు ఆర్ధిక సంవత్సరం మొత్తం పోల్చి చూస్తే 67,612 వాహనాలు తక్కువ అమ్మకాలు చేసి 1% తరుగుదల చూసింది. పోయిన సంవత్సరం తో పోలిస్తే యూరప్ 150% మరియు యుకె  64% లాభాలను నమోదు చేసుకున్నాయి. ఇక ఓవర్సీస్ విభాగంలో అవి 27 శాతం గా నమోదయ్యాయి. ఈ కొత్త జాగ్వార్ ఎక్స్ఇ అమ్మకాలు 3,550 ఈ నెలకు గాను నమోదయితే మొత్తంగా 15,716 అమ్మకాలు గడిచిన వేసవి కాలం నుండి ఇప్పటీ వరకూ నమోదయ్యాయి. ఈ కొత్త మధ్య రకం స్పోర్ట్ సలూన్ కారు ఇటీవలే చైనా మార్కెట్ లో కూడా ప్రవేశించింది, ఇంకా 2016 స్ప్రింగ్ సమయానికి అమెరికా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. గిర్నార్‌సాఫ్ట్ 

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience