Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

జాగ్వార్ F-పేస్ - మీరు తెలుసుకోవలసిన విషయాలు

జాగ్వార్ సి ఎక్స్17 కోసం raunak ద్వారా జనవరి 27, 2016 11:21 am ప్రచురించబడింది

జాగ్వార్ యొక్క మొట్టమొదటి ఎస్యువి ఆటో ఎక్స్పో లో ప్రదర్శింపబడుతుంది మరియు ఈ సంవత్సరం ప్రారంభించబడుతుంది!

జాగ్వార్ ఎఫ్-పేస్ కొన్ని నెలల క్రితం 2015 లో బహిర్గతమైంది మరియు ప్రపంచవ్యాప్తంగా, అతి త్వరలో అమ్మకానికి వెళ్తుంది. టాటా సొంతమైన బ్రిటీష్ బ్రాండ్ యొక్క మొట్టమొదటి అద్భుతమైన ఎస్యువి రాబోయే 2016 భారత ఆటో ఎక్స్పోలో ప్రపంచ ప్రదర్శన చేయనున్నది. జాగ్వార్ ఎఫ్-పేస్ వాహనం మెర్సిడెస్ బెంజ్ GLE, ఆడి Q5, BMW X5 వంటి వాటితో పోటీ పడుతుంది మరియు ఈ సంవత్సరం ప్రారంభించబడుతుందని అంచనా.

F-పేస్ జాగ్వార్ యొక్క కొత్త కాంతి అల్యూమినియం ఆర్కిటెక్చర్ ద్వారా వచ్చిన మూడవ ఉత్పత్తి. కొత్త XE, వాహనం భారతదేశంలో ఫిబ్రవరి యొక్క మొదటి వారంలో ఈ ప్లాట్ఫార్మ్ పైన ప్రారంభం కానున్నది మరియు కొత్త తరం XF కూడా ఇదే లక్షణాన్ని కలిగి ఉంది. దీని లుక్స్ గురించి మాట్లాడుకుంటే అది గణనీయంగా జాగ్వార్ యొక్క ప్రస్తుత పోర్ట్ఫోలియో నుండి ప్రేరణ పొందినట్టుగా తెలుస్తుంది మరియు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీని ముందర ప్రొఫైల్ చూసినట్లయితే ఎక్ష్ ఎఫ్ ని గుర్తుచేస్తుంది మరియు వెనుక ప్రొఫైల్ చూసినట్లయితే F-Type లా కనిపిస్తుంది.

వేరియంట్స్

జాగ్వార్ ఇండియా F-పేస్ యొక్క ప్యూర్, ప్రెస్టీజ్, R-స్పోర్ట్ మరియు ఫస్ట్ ఎడిషన్ వంటి నాలుగు వేరియంట్స్ అందిస్తుంది.

ఇంజిన్లు?

జాగ్వార్ ఇండియా రెండు డీజిల్ ఇంజిన్లు మాత్రమే అందిస్తుంది, ఆ రెండూ కూడా AWD (ఆల్-వీల్-డ్రైవ్) సెటప్ కలిగియున్న ఆటోమెటిక్ ట్రాన్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. ప్యూర్ మరియు ప్రెస్టేజ్ వేరియంట్స్ 2.0 లీటర్ ట్విన్ టర్బో ఇగ్నీషియం డీజిల్ ఇంజిన్ తో అమర్చబడి 4000rpm వద్ద 178bhp శక్తిని మరియు 1750-2500rpm వద్ద 430Nm టార్క్ ని అందిస్తుంది మరియు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ జతచేయబడి ఉంటుంది. ఈ వాహనం 0 నుండి 100 కిలోమీటర్లు 8.7 సెకెన్లలో చేరుకుంటుంది మరియు గరిష్టంగా 208Kmph వేగాన్ని చేరుకుంటుంది. ఈ వేరియంట్లు 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ ని అందిస్తుంది మరియు 213mm గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 18Kmpl (100Km / 5.3-లీటర్ల) మైలేజ్ అందిస్తుంది.

R-స్పోర్ట్ మరియు ఫస్ట్ ఎడిషన్ ట్రిమ్స్ 3.0-లీటర్ v6 ట్విన్ టర్బో డీజిల్ ఇంజిన్ ని కలిగి ఉండి 4000rpm వద్ద 296bhp శక్తిని మరియు 2000 ఆర్పిఎమ్ వద్ద గరిష్టంగా 700Nm టార్క్ ని అందిస్తుంది. ఈ ఇంజన్ కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వ్యవస్థతో జతచేయబడి ఉంటుంది. ఈ వాహనం 0 నుండి 100Kmph చేరుకోవడానికి 6.2 సెకెన్ల సమయం తీసుకుంటుంది మరియు గరిష్టంగా 241Kmph వేగాన్ని చేరుకుంటుంది. R -స్పోర్ట్ 19 అంగుళాల చక్రాలు తో నడుస్తుంది మరియు ఫర్స్ట్ ఎడిషన్ 20 అంగుళాల చక్రాలు తో నడుస్తుంది. v6 డీజిల్ సుమారు 16 Kmpl (100Km / 6.0-లీటర్ల) ఇంధన సామర్ధ్యం అందిస్తుంది.

లక్షణాలు?

F-పేస్ జాగ్వార్ యొక్క 8 అంగుళాల InControl సమాచార వినోద వ్యవస్థతో ప్రామాణికంగా వస్తుంది, ఎనలాగ్ డయల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో 5-అంగుళాల మల్టీ-సమాచారం ప్రదర్శన మరియు 80W జాగ్వార్ సౌండ్ సిస్టం వంటి లక్షణాలను కలిగి ఉంది. ఇంకా దీనిలో 12.3 అంగుళాల వాస్తవిక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో పాటూ 10GB అంతర్గత మెమొరీతో 10.2-అంగుళాల InControl టచ్ ప్రో మరియు 380W మెరిడియన్ డిజిటల్ సౌండ్ సిస్టం కూడా మీరు దీనిలో పొందవచ్చు.

ఇంకా చదవండిఫిబ్రవరి 3 న ప్రారంభమవబోతున్న జాగ్వార్ ఎక్స్ ఈ, బుకింగ్స్ ప్రారంభం

Share via

Write your Comment on Jaguar సి ఎక్స్17

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.15.50 - 27.25 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.15 - 26.50 లక్షలు*
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.6.20 - 10.51 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర