స్పెక్టర్ నుండి జాగ్వార్ సీ-ఎక్స్75 లండన్‌లో జరిగే లార్డ్ మేయర్ యొక్క షోలో ఆరంగ్రేటం చేయనుంది
జైపూర్:
జాగ్వార్ సీ-ఎక్స్75-రాబోయే జేంస్ బాండ్ సీరీస్ అయిన స్పెక్టర్ ఇప్పుడు మొదటి సారిగా లండన్‌లో దర్శనం ఇవ్వనుంది. స్పెక్టర్ లో స్టంట్ డ్రైవర్ అయిన ఇవానోవ్ ఈ 800వ ఈ వారాంతం జరగబోయే రెండు మైళ్ళ ప్రదర్శన గల ఈ లార్డ్ మేయర్ షోలో నడపనున్నారు. ఇంతకు మునుపు 2015 ఫ్రాంక్‌ఫర్ట్ మోటర్ షోలో, జేఆర్ఎల్ వారు వారి రాబోయే జేంస్ బాండ్ చిత్రంలో ఉపయోగించిన అన్ని వాహనాల ప్రదర్శనని అందించారు.
ఆల్బర్ట్ ఆర్.బ్రాకలీ వారి ఇయాన్ ప్రొడక్షన్స్, మెట్రో-గోల్డ్‌విన్-మేయర్ స్టూడియోస్ మరియూ సోనీ పిక్చర్స్ ఎంటర్‌టెయిన్‌మెంట్ వారిచే ముందుకు వస్తున్న జేంస్ బాండ్ 24వ సినిమా అయిన స్పెక్ట్రే లో జాగ్వార్ సీ-ఎక్స్75 ని హింక్స్ నడపగా, 007 ఆస్టన్ మార్టిన్ డీబీ10 లో ఈ కారుని ఛేదిస్తారు.
"ఈ కారు ని నడిపేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. రోమ్ లో ఈ కారుని సినిమా కోసం నడిపినప్పుడిపిన అనుభవం మరుపురానిది. ఇప్పుడు బ్రిటీష్ ప్రజల స్పందన ఎలా ఉంటుందో చూడాలి అని ఉంది," అని మార్టిన్ ఇవానోవ్ అన్నారు.
జాగ్వార్ సీ-ఎక్స్75 అనేది 007 యొక్క డీబీ10 లాగానే ఒక కాన్సెప్ట్ కారు. ఇది ఎప్పటికీ ఉత్పత్తి చేయబడదు. కాకపోతే, వీటిలోగల టెక్నాలజీ ఇతర వాహనాలలో స్థానం సంపాదించుకోగలదు. పైగా, ఇది జాగ్వార్ ల్యాండ్ రోవర్ వారి ప్రత్యేక వాహనాల ఆపరేషన్ టీం వారు విలియంస్ అడ్వాన్సడ్ ఇంజినీరింగ్ తో కలగలిసి సృష్టించిన ఒక ఎలక్ట్రిక్ హైబ్రీడ్ కాన్సెప్ట్ కారు.