• English
  • Login / Register

ఉత్తమానికి ఉత్తమమే పోటీగా నిలుస్తోంది: డిస్కవరీ స్పోర్ట్ పోటీని ఎదుర్కొంటోంది!

సెప్టెంబర్ 04, 2015 03:41 pm అభిజీత్ ద్వారా సవరించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: డిస్కవరీ స్పోర్ట్ ప్రారంభించబడినది మరియు ల్యాండ్ రోవర్ దానికి బహుముఖ ఎస్యువి గా నామకరణం చేసింది. ఇప్పటికే, ఈ కారు ప్రారంభం కాక మునుపే దానికి 200 కంటే ఎక్కువ ఎడ్వాన్స్ బుకింగ్స్ రావడం చూసాము. ఇది ఏ విధంగా దాని ప్రాముఖ్యతను కొనసాగిస్తూ  ఆడి క్యు5, బిఎండబ్లు ఎక్స్3 మరియు మెర్సెడెజ్-బెంజ్ ఎం-క్లాస్ వంటి ప్రముఖ కార్లతో పోటీ పడుతుందో చూద్దాం.

బాహ్య రూపం


ఇప్పటి వరకు రూపం యొక్క పోటిలో ల్యాండ్ రోవర్ పాల్గొనలేదు కానీ ఈ డిస్కవరీ స్పోర్ట్ యొక్క రాకతో భవిష్యత్తు కాస్థ మెరుగ్గా కనపడుతోంది. ఈ నూతన ఎస్యూవీ ధృఢమైన రూపంతో కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది. పోటీ గురించి మాట్లాడుతూ, ప్రతీ యొక్క పోటీదారి మోడ్ల కి ఒకో రకమైన ప్రత్యేకత ఉంది. 

క్యూ5 ఒక హుందా రూపంతో ఆకర్షిస్తుండగా, ఇది ఇంకో పునరుద్దరణ కు సిద్దం అయ్యింది మరియూ క్యూ3 తో పోలిస్తే కొంచం వెనుకబడి ఉంది. 

ఎక్స్3 తాజాగా పునరుద్దరణ పొందింది మరియు ముందువైపు ఇంకా వెనుక వైపు గతంలో కంటే దుడుకైన శైలిని కలిగి ఉంది. 

ఎం-క్లాస్ గురించి మాట్లాడుతూ, ఇది దాని తాజా తరం మోడలుతోనే ఉంది మరియూ కొత్త హెడ్ల్యాంప్ మరీయూ టెయిల్ ల్యాంప్ క్లస్టర్ ని కలిగి ఉంది. పైగా, బాహ్యపు గీతల విషయానికి వస్తే దీనికి ఇదే సాటి.  

అంతర్భాగాలు: 

అంతర్భాగాలలో, డిస్కవరీ యొక్క కాక్పిట్ విభాగం చూడడానికి , రేంజ్ రోవర్ స్పోర్ట్ ని గుర్తు చేసుకున్నట్టుగా ఉంటుంది. ఇది ఒక ఆఫ్-రోడర్ ఇమేజ్ ని కలిగి ఉండడం మంచి విషయం. ఈ కారు నమూనా సాధారణంగా ఉంటుంది కానీ అదే సమయంలో దీని గొప్పతనాన్ని చూపిస్తుంది. అయితే, ఎవరైతే, కారు స్టయిల్ గా ఉండాలనుకుంటారో వారికి మాత్రం కొంచెం నిరాశను కలిగిస్తుంది. దీనిలో 17 స్పీకర్ 825డబ్లు మెరిడియన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ తో ఉన్న టచ్ స్క్రీన్ సమాచార / నావిగేషన్ సిస్టమ్  ఉంది. దీని క్యాబిన్లో యుఎస్ పి ధ్వని వ్యవస్థ కాదు. దాని బదులుగా  5 + 2 సీటింగ్ సెటప్ ఒకటే దాని పోటీదారులకు పోటీ ని ఇస్తుంది.

క్యూ5 మళ్ళీ అదే ఇబ్బందికరమైన పాత రకపు అంతర్ఘతాలను మరియూ బాహ్య రూపాన్ని కలిగి ఉంది. ఎన్నో లక్షణాలను కలిగి ఉన్నా కూడా, డిస్కవరీ స్పోర్ట్ లేదా ఎం-క్లాస్ లాగా కొత్త తరం అనుభూతిని ఇవ్వడంలో లోపిస్తుంది. 

క్యూ5, ఎక్స్3 కి కూడా పాత అంతర్ఘతాలు ఉన్నా, సౌకర్యం విషయంలో మరియూ సాంకేతికత పరంగా బాగానే పునరుద్దరణ చెంది ఉంది. స్పోర్ట్ తో పోల్చినప్పుడు, సాదా అంతర్ఘతాల కారణంగా భారీ తేడా లేదు.

కొత్త తరం అంతర్ఘతాలతో మరియూ పునరుద్దరణ కలిగిన కమాండ్ ఇంఫొటెయిన్మెంట్ సిస్టం వలన ఎం-క్లాస్ ఆకర్షణీయంగా ఉంటుంది. 

సాంకేతికాలు: 

డిస్కవరీ స్పోర్ట్ ల్యాండ్ రోవర్ చరిత్రలో స్వచ్చమైనదిగా ఉంటుంది మరియు ఇతర మూడిటి కంటే అత్యంత ఆఫ్ రోడర్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది అత్యంత విరుద్ధమైన రోడ్డు పరిస్థితుల్లో హాయిగా ప్రయాణించగలదు, కానీ 65 లక్షల విలువ గలిగిన కారుని ఆఫ్-రోడింగ్ కి వాడుతారా? అనే ప్రశ్న మిగిలిపోయింది. డిస్కవరీ స్పోర్ట్ 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ తో 188bhp శక్తిని అందిస్తుంది. శక్తి మాత్రం ఇదే ధర కలిగిన దాని పోటీ దారుల కంటే తక్కువ అందిస్తుంది. ఇంకా 8.9 సెకన్లలో ఒక 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. ఇది 9-స్పీడ్ ఎటి అత్యంత అధునాతన గేర్బాక్స్ మరియు టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్ ని పొంది ఉంది. ఈ టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్ అన్ని రకాల పరిస్థితులలో గొప్పగా హ్యాండిల్ చేస్తుంది. కానీ ధర మాత్రం చాలా ఎక్కువగా ఉంది.

క్యూ5 కి 241.4బీహెచ్పీ శక్తిని మరియూ 580ఎనెం యొక్క భారీ టార్క్ ని ఉత్పత్తి చేసే 3.0-లీటర్ వీ6 డిజిల్ ఇంజిను అమర్చబడి ఉంది. ఇదంతా క్వాట్ట్రో కి అందించడంతో ఇది ల్యాండ్ రోవర్ కంటే కూడా వేగవంతంగా ఉంటుంది. ఇది గంటకి 0 నుండి 100 కీ.మీ కి 6.5 సెకనుల్లో చేరుకుంటుంది.

ఎక్స్3 కి తిన్నగా ఉన్న 6 సిలెండర్ల ఇంజినుని అమర్చి ఉంది. ఇది 258బీహెచ్పీ యొక్క శక్తి విడుదల చేసీ మరియూ గంటకి 0 నుండి 100 కీ.మీ 5.9 సెకనుల్లో చేరుకునే సామర్ధ్యం కలదు. 

ఎం-క్లాస్ కి కేవలం 1200-2400ఆర్పీఎం వద్ద 619ఎనెం టార్క్ ని ఉత్పత్తి చేయగలిగే 3.0 వీ6 ఇంజిను అమర్చబడి ఉంది. ఇది గంటకు 100 మైళ్ళని 7 సెకనుల్లో చేరుకోగలదు.

కొలతలు

ల్యాండ్ రోవర్ యొక్క ట్రూ బ్లూ ఎస్యూవీ సెటప్ తో మరియూ 4700ఎమెం తో, ఇది ఈ విభాగంలోనే రెండవ పెద్ద వాహనం.

క్యూ3 4629ఎమెం దగ్గర స్పోర్ట్ కంటే కొంచం తక్కువగా ఉంటుంది.

ఎం-క్లాస్ 4804ఎమెం తో పరిమాణం విషయంలో అధిక మార్కులను కొట్టేసింది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience