భారతదేశం 2021 నాటికి BS-VI ఎమిషన్ నిబంధనలు అమలు చేయనున్నది
మారుతి ఎస్-క్రాస్ 2017-2020 కోసం sumit ద్వారా డిసెంబర్ 02, 2015 11:52 am ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
భారతదేశం మరోసారి మారుతున్న వాతావరణం మరియు పర్యావరణ రక్షణ పట్ల తన నిబద్ధతను చూపించింది. భారతదేశం, BS (భారత్ స్టేజ్) స్టేజ్ V నియమాలను ఏప్రిల్ 1, 2022 నుండి మరియు ఏప్రిల్ 1, 2024 (ఆటో ఇంధన విధానం ప్రకారం) నుండి BS స్టేజ్ VI నియమాలను అమలు చేయనున్నది. కానీ, ఇప్పుడు వచ్చిన కొత్త ప్రకటన ప్రకారం,నాలుగు చక్రముల వాహనం కోసం మూడు సంవత్సరాలలో రెండు స్టేజ్ లను ముందుగా అమలు చేయనున్నదని తెలుస్తుంది.
"రోడ్డు రవాణా & హైవేల శాఖ BS-V అమలు కోసం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది మరియు ఆటోమొబైల్ రంగం కోసం BS-VI నిబంధనలు , నాలుగు చక్రాల వర్గాన్ని కవర్ చేస్తాయి. మంత్రిత్వ ఉన్నత స్థాయి ఎమిజన్ ప్రమాణాల అమలు కోసం తేదీ ముందస్తుగా నిర్ణయించింది." "రోడ్డు రవాణా & రహదారుల మంత్రి రోడ్డు రవాణా రంగం పర్యావరణం మరియు వాతావరణ మార్పు పై ఉద్గారాల హానికరమైన ప్రభావాలను తగ్గించడం లో ముఖ్యపాత్ర తీసుకోవాలి." అని తెలిపారు. టూ వీలర్ మరియు త్రీ వీలర్ కేటగిరీ కొరకు డ్రాఫ్ట్ నియమాలు కూడా నాలుగు చక్రాల కేటగిరీ వలే అధునాతన కాలక్రమం తో త్వరలోనే తెలియజేయబడుతుంది.
ఇప్పుడు ఉన్న కొత్త తేదీల ప్రకారం, మంత్రిత్వ శాక అమలు చేద్దాం అనుకున్నట్లు ఏప్రిల్ 1, 2019 నుండి BS-V నియమాలు మరియు ఏప్రిల్ 1, 2021 నుండి BS-VI నియమాలు అమలు చేయబడవచ్చు. BS-VI నియమాలు NOx / 4C స్థాయిలు తగ్గుదలపై దృష్టి పెడుతుంది. PM నరేంద్ర మోడీ నవంబర్ 30 నుంచి జరిగే "2015 యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్" లో పాల్గోనేందుకు పారిస్ వెళ్ళే సమయం లో నే ఈ ప్రకటన వచ్చింది. భారతదేశం వాతావరణ మార్పుకి సంబంధించినంతవరకు ఏ కాంఫెరెన్స్ ని మిస్ చేసుకోదు.