Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

జనవరి 2016 నాటికి బాలెనో ని జపాన్ కి ఎగుమతి చేయనున్న భారత్

మారుతి బాలెనో 2015-2022 కోసం sumit ద్వారా డిసెంబర్ 16, 2015 12:07 pm ప్రచురించబడింది

Maruti Baleno

జైపూర్:భారత ప్రధాని నరేంద్ర మోడి వెల్లడి ప్రకారం భారతీయ తయారీ కార్లు త్వరలో జపాన్ కు ఎగుమతి కానున్నాయి. ఈ వాహనాలు మారుతి సుజికి ద్వారా తయారుచేయబడి జపాన్ కు ఎగుమతి కాబడుతున్న మొట్టమొదటి శ్రేణి.

" ఈ జపనీస్ తయారీసంస్థ మారుతి (సుజికి) తమ వాహనాలను ఇక్కడ తయారుచేసి జాపన్ కు ఎగుమతి చేయనున్నారు." అని ఇండియా-జపాన్ బిజినెస్ లీడర్స్ ఫార్మ్ సమావేశంలో గౌ.మోడీ తెలియపరిచారు. భారత్ మరియు జపాన్ కలిసి ఈ విధంగా ముందుకు నడవాలి, ఇది కేవలం హై స్పీడ్ ట్రెయిన్స్ మాత్రమే కాకుండా ఇతర వేగవంతమైన రంగాలలో కూడా.. అని ఆయన అధనంగా తెలియజేశారు.

మారుతి సుజికి చైర్మెన్ ఆర్.సి భార్గవ వెల్లడి ప్రాకారం, మారుతి బాలెనో ఈ కోవలోని ఎగుమతి కాబడుతున్న తొలి కారుగా ఆయన వర్ణించారు. ఇంకా ఈ విధంగా సంస్థ 20,000 నుండి 30,000 యూనిట్లను ప్రతి సంవత్సరం ఈ విధంగా ఎగుమతి చేయాలని యోచిస్తున్నారు. అయితే, ఈ ఎగుమతి విధానం కొంచెం క్లిష్టమైనది అయినప్పటికీ సంస్థ దీనిని ఒక సవాలుగా తీసుకొని వచ్చే సంవత్సరం జనవరి నాటికి ఆరంభించే విధంగా ఉన్నారు. ఇంకా మారుతి బాలెనో భారతీయ మార్కెట్ లో ఈ సంవత్సరం అక్టోబర్ చివరి నాళ్ళలో ప్రవేశపెట్టబడి అప్పటి నుండి అద్భుతమైన విజయాలను అందుకోగలిగింది.

ఇక, ఈ ఎగుమతి తీర్మానం వెనుక మన భారతదేశానికి జపాన్ వారి బుల్లెట్ ట్రెయిన్ ను అహమ్మదాబాద్-ముంబయి కారిడార్ కి గాను మనం దిగుమతి చేసుకోవడం తద్వారా భారత్-జపాన్ సత్సంబంధాలను పెంచుకోవడం కొరకు అనేది ఒక కారణంగా చెప్పవచ్చు. ఈ బుల్లెట్ ట్రెయిన్ భారతీయ రెయిల్ వే నెట్వర్క్ లో వేస్తున్న ఒక పెద్ద ముందడుగులో భాగం. అయితే, ఈ ప్రోజెక్ట్ కు గానూ జపాన్ వారు భారత్ కు ఒక దాదాపుగా వడ్డీ లేని(0.1%) వడ్డీని అందించడం జరిగింది. దీని అంచనా ధర భారత రూపాయలలో 98,000 కోట్లు(12 బిలియన్ డాలర్స్). ఇది కాకుండా ఇరు దేశాలు ఎన్నో పెద్ద సంభందాలకు పరస్పర సంతకాలు జరుపుకున్నారు. ఉదాహరణకు సామాజిక అణు ఒప్పందం మరియు వ్యూహాత్మక ప్రాముఖ్యత ఒప్పందం వీటిలో కొన్ని.

మారుతి బాలెనో యొక్క మొదటి డ్రైవ్ చూడండి

ఇంకా చదవండి

s
ద్వారా ప్రచురించబడినది

sumit

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన మారుతి బాలెనో 2015-2022

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర