Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

2024లో 5 కొత్త కార్లను విడుదల చేయనున్న Hyundai

హ్యుందాయ్ క్రెటా కోసం ansh ద్వారా డిసెంబర్ 21, 2023 07:11 pm ప్రచురించబడింది

హ్యుందాయ్ విడుదల చేయనున్న కార్లలో ఎక్కువ శాతం SUV కార్లు ఉండగా, 3 ఫేస్‌లిఫ్ట్‌లు కూడా ఉండనున్నాయి.

మారుతి సుజుకి తరువాత హ్యుందాయ్ భారతదేశపు రెండవ అతిపెద్ద కార్ల కంపెనీ. ఎంట్రీ లెవల్ హ్యాచ్ బ్యాక్ ల నుంచి అగ్రశ్రేణి ఎలక్ట్రిక్ కార్ల వరకు భారత ఆటో మార్కెట్లో ఈ సంస్థ తన సత్తా చాటింది. అయితే, మార్కెట్లో ఇప్పటికీ చాలా హ్యుందాయ్ కార్లు కొత్త నవీకరణలను పొందలేదు. 2024 లో, హ్యుందాయ్ ఐదు కొత్త కార్లను విడుదల చేయనున్నారు, అవి:

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌

ఆశించిన విడుదల తేదీ: జనవరి 2024

అంచనా ధర: రూ.10.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి

హ్యుందాయ్ క్రెటా భారతదేశంలో కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి మరియు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUV కారు. రెండవ తరం క్రెటా 2020 లో భారతదేశంలో విడుదలయ్యింది, అప్పటి నుండి ఈ కాంపాక్ట్ SUV కారు ఎటువంటి పెద్ద నవీకరణ పొందలేదు, కాబట్టి కంపెనీ కొత్త ఫేస్లిఫ్ట్ వెర్షన్ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు, ఇది వచ్చే సంవత్సరం నాటికి విడుదల అవుతుంది. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ (115 PS/144 Nm), 1.5-లీటర్ డీజిల్ (116 PS/250 Nm) మరియు అత్యంత శక్తివంతమైన 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (160 PS/253 Nm) తో సహా సెల్టోస్ ఫేస్లిఫ్ట్ మాదిరిగానే ఫేస్ లిఫ్టెడ్ క్రెటా పనిచేస్తుంది.

ఇందులో 10.25 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 360 డిగ్రీల కెమెరా, లెవల్ 2 ADAS ఫీచర్లు ఉండనున్నాయి.

హ్యుందాయ్ ఆల్కాజర్ ఫేస్ లిఫ్ట్

రిఫరెన్స్ కొరకు ప్రస్తుత హ్యుందాయ్ అల్కాజార్ యొక్క చిత్రం

ఆశించిన విడుదల తేదీ: మార్చి 2024

అంచనా ధర: రూ.16 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి

క్రెటాతో పాటు, హ్యుందాయ్ ఆల్కాజార్ ఫేస్ లిఫ్ట్ ను కూడా వచ్చే సంవత్సరం నాటికి భారతదేశంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ క్రెటా ఆధారిత 3-రో SUV కారును 2021లో విడుదల చేశారు. విడుదల అయినప్పటి నుండి, ఈ కారు కొన్ని డిజైన్ నవీకరణలను పొందింది, అలాగే కొత్త ఇంజన్ ఎంపికను పొందింది. ఇప్పుడు అల్కాజార్ SUVకి కొత్త ఫేస్ లిఫ్ట్ నవీకరణ అవసరం.

ఇది కూడా చదవండి: తొలి సారి కనిపించిన ఫేస్ లిఫ్ట్ హ్యుందాయ్ ఆల్కాజార్

ఫేస్ లిఫ్టెడ్ హ్యుందాయ్ 3-రో SUV ప్రస్తుత మోడల్ మాదిరిగానే ఇంజన్ ఎంపికలతో అందించబడుతుంది, అవి: 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ (160 PS/253 Nm) మరియు 1.5-లీటర్ డీజిల్ (115 PS/250 Nm). ఇందులో డ్యూయల్ 10.25 అంగుళాల డిస్ ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్ రూఫ్, 360 డిగ్రీల కెమెరా, లెవల్ 2 ADAS ఫీచర్లు ఉండనున్నాయి.

హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

ఆశించిన విడుదల తేదీ: జూన్ 2024

అంచనా ధర: రూ.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి

ఫేస్ లిఫ్టెడ్ హ్యుందాయ్ టక్సన్ను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించారు. ఈ కారును 2024 ప్రారంభంలో యూరోపియన్ మార్కెట్లో విడుదల చేయనున్నారు. ఇది 2024 మధ్యలో లేదా చివరిలో భారతదేశంలో విడుదల కావచ్చు.

కొత్త హ్యుందాయ్ టక్సన్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ లో అనేక మార్పులను పొందనుంది, ఇది కారుకి మునుపటి కంటే ఎక్కువ ప్రీమియం అనుభవాన్ని ఇస్తుంది. ఇందులో డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ టచ్స్క్రీన్ సెటప్, టచ్ బేస్డ్ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ ఉండనున్నాయి. ప్రస్తుతానికి ఈ కారులో ఉండనున్న ఇతర ఫీచర్లను కంపెనీ వెల్లడించలేదు, అయితే డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, ఆరు ఎయిర్ బ్యాగులు మరియు ADAS టెక్నాలజీ వంటి ఫీచర్లను ఇందులో అందించవచ్చని అంచనా. ఇండియా-స్పెక్ టక్సన్ అదే ఇంజన్ ఎంపికలతో అందించబడుతుందని భావిస్తున్నారు: 2-లీటర్ డీజిల్ (186 PS/416 Nm) మరియు 2-లీటర్ పెట్రోల్ (156 PS/192 Nm).

కొత్త హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్

ఆశించిన విడుదల తేదీ: మే 2024

అంచనా ధర: రూ.25 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ 2019 లో భారతదేశంలో విడుదల అయినప్పటి నుండి ఎటువంటి కొత్త నవీకరణలను పొందలేదు. ఫేస్లిఫ్ట్ కోనా ఎలక్ట్రిక్ ను డిసెంబర్ 2022 లో అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించారు, కంపెనీ దీనిని 2024 నాటికి భారతదేశంలో విడుదల చేయాలని యోచిస్తున్నారు.

కొత్త కోనా ఎలక్ట్రిక్ కారు యొక్క ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్ నవీకరించబడింది. అంతర్జాతీయ మార్కెట్లో, ఇది రెండు బ్యాటరీ ప్యాక్లతో కూడిన ఎలక్ట్రిక్ మోటారుతో అందించబడుతుంది: 48.4 కిలోవాట్లు మరియు 65.4 కిలోవాట్ల సామర్థ్యం, ఇది వరుసగా 155 PS మరియు 218 PS శక్తిని అందిస్తుంది. నవీకరించబడిన కోనా ఎలక్ట్రిక్ 490 కిలోమీటర్ల వరకు పరిధిని కలిగి ఉంటుందని హ్యుందాయ్ తెలిపారు. బ్యాటరీని 41 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేయవచ్చు.

డ్యూయల్ 12.3 అంగుళాల డిస్ ప్లే, 12 అంగుళాల హెడ్ అప్ డిస్ ప్లే, 8 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, వెహికల్-2 లోడ్ (V2L) కంపాటబిలిటీ, 360 డిగ్రీల కెమెరా, ADAS వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.

హ్యుందాయ్ ఆయానిక్ 6

ఆశించిన విడుదల తేదీ: ఏప్రిల్ 2024

అంచనా ధర: రూ.65 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి

హ్యుందాయ్ ఫ్లాగ్షిప్ EV సెడాన్ ఆయానిక్ 6 ను వచ్చే ఏడాది నాటికి భారతదేశంలో విడుదల చేసే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా, ఇది 77.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తో పనిచేస్తుంది, ఇది 228 PS శక్తిని మరియు 350 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. హ్యుందాయ్ అయోనిక్ 5 కి చెందిన సెడాన్ 610 కిలోమీటర్లకు పైగా WLTP సర్టిఫైడ్ పరిధిని కలిగి ఉంది.

డ్యూయల్ 12.3 అంగుళాల డిస్ ప్లే, హెడ్ అప్ డిస్ ప్లే, 8 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, వైర్ లెస్ ఫోన్ ఛార్జింగ్, వెహికల్-2 లోడ్ (V2L) వంటి ఫీచర్లు ఈ ఎలక్ట్రిక్ కారులో ఉన్నాయి. భద్రతా ఫీచర్లలో ఏడు ఎయిర్ బ్యాగులు, 360 డిగ్రీల కెమెరా వంటి ADAS ఫీచర్లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: 2024 లో ఇండియాకు రానున్న అన్ని ఎలక్ట్రిక్ వాహనాలు ఇవే

ఈ హ్యుందాయ్ కార్లన్నీ వచ్చే ఏడాది నాటికి భారతదేశంలో యొక్క ICE మరియు EV సెగ్మెంట్లలో భాగం కానున్నాయి. ఈ కార్లలో దేని కోసం మీరు ఎక్కువగా ఎదురుచూస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.

a
ద్వారా ప్రచురించబడినది

ansh

  • 482 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన హ్యుందాయ్ క్రెటా

Read Full News

explore similar కార్లు

హ్యుందాయ్ క్రెటా

Rs.11 - 20.15 లక్షలు* ఆన్ రోడ్ ధర పొందండి
పెట్రోల్17.4 kmpl
డీజిల్21.8 kmpl
ట్రాన్స్ మిషన్మాన్యువల్/ఆటోమేటిక్
వీక్షించండి మే ఆఫర్లు

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
Rs.10.99 - 15.49 లక్షలు*
Rs.14.49 - 19.49 లక్షలు*
Rs.7.99 - 11.89 లక్షలు*
Rs.6.99 - 9.40 లక్షలు*
Rs.60.95 - 65.95 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర