కొత్త తరం ఎలంట్రా తో ఆకట్టుకుంటున్న హ్యుందాయి

హ్యుందాయ్ ఎలన్ట్రా 2015-2019 కోసం అభిజీత్ ద్వారా ఆగష్టు 19, 2015 03:46 pm ప్రచురించబడింది

జైపూర్: హ్యుందాయ్ డి-సెగ్మెంట్ అందిస్తున్నటువంటి తదుపరి తరం ఎలంట్రా ఒక డిజిటల్ రెండరింగ్ ఆకారంలో మొదటిసారిగా కనబడింది. తయారీ సంస్థ దీనిఅధికారిక విడుదల విషయం పై ఎంతగోప్యంగా ఉన్నా కూడా ఇది లాస్ ఏంజిల్స్ ఆటో షోలో దీనిని ప్రారంభించవచ్చునని అంచనా వేస్తున్నారు. భారతదేశంలో దీని ప్రారంభం గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇది బహుశా భారతదేశంలో వచ్చే సంవత్సరం ఆటో ఎక్స్పో 2016 వద్ద ప్రారంభించనున్నట్లు ఊహిస్తున్నారు. 

పైన టీసర్ చిత్రం ముఖ్యంగా దానియొక్క సైడ్ ప్రొఫైల్ మీద దృష్టి పెట్టి తీసారు. దీనిలో ఫ్రంట్ భాగం కొద్దిగా మాత్రమే కనబడుతుంది. ఈ ఒక్క చిత్రం ద్వారా రాబోయే కొరియన్ కారు ఎంత అద్భుతంగా మనకి అందించబడుతుందో అంచనా వేయవచ్చు. దీనిని చూస్తూ ఉంటే ఇప్పటికే ఉన్నటువంటి స్పోర్టీ అలంట్రాను అధిగమించే విధంగా ఉంది.  ఇది కనీసం వెలుపలి రూపం పరంగా అయినా మునుపటీ వెర్షన్ ను పక్కకి నెట్టివేస్తుందని చెప్పగలము. ఈ కారు బోనెట్ పైన బలమైన లైన్స్, అలానే షోల్డర్ లైన్స్ మరియు దిగువ వైపు లైన్స్ తో ఆకర్షణీయంగా ఉంది. అంతేకాక, దీని ముందరభాగం ముందు గ్రిల్ తో పాటు ఆంగ్రీయర్ హెడ్ల్యాంప్స్, అలానే దీని ప్రక్క భాగం డైమండ్ కట్ అల్లాయి వీల్స్ తో ఉంది. 

అంతర్భాగాల ప్రకారం  ఇప్పటివరకు ఎటువంటి నవీకరణలను  పొందలేదు. కానీ టీజర్ చిత్రాలు త్వరలో విడుదల కావచ్చు. దీనిలో  8-అంగుళాల సమాచార వ్యవస్థ, స్టార్ట్/స్టాప్ లక్షణం, డ్యుయల్ జోన్ వాతావరణ నియంత్రణ, వేడి/ చల్లని ముందరి సీట్లు మరియు విస్తృత సన్రూఫ్ ఉండవచ్చని భావిస్తున్నాము.    

ఇంజిన్ గురించి మాట్లాడుతూ, హ్యుందాయి  1.6 లీటర్ 175bhp టి-జిడి ఐ మోటార్ (పెట్రోల్) ని విదేశీ మార్కెట్లలోనికి అందించవచ్చని, అలానే భారతదేశంలోనికి ప్రస్తుతం ఉన్న ఎలంట్రా లో ఉన్నటువంటి ఇంజిన్ నే అందించవచ్చని వూహిస్తున్నాము.   

ఈ 2016 ఎలంట్రా 53% అధిక దృఢత్వం గల  స్టీల్ ని కలిగి ఉన్నాయని మరియు డ్రాగ్ కోయిఫిషియంట్ 0.27 ఉండి ఈ భాగంలోని అత్యంత ఏరోడైనమిక్ నిర్మాణంలో ఒకటిగా నిలిచింది.   

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన హ్యుందాయ్ ఎలన్ట్రా 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience