మాన్సూన్ స్ప్లాష్ ఆఫర్ లో రూ .70,000/- డిస్కౌంట్ ని అందిస్తున్న హ్యుందాయి
జైపూర్:హ్యందాయి ముఖ్యంగా కొత్త ఫేస్లిఫ్ట్ వెర్నా 4ఎస్ ఫ్లుయిడిక్ ద్వారా భారతదేశం లో వారి కార్ల అమ్మకాలు పెంచుకునేందుకు కష్టపడి ప్రయత్నిస్తున్నారు. వారు వారి 'మాన్సూన్ స్ప్లాష్ ఆఫర్' లో రూ 70,000 భారీ డిస్కౌంట్లను అందించడం ద్వారా వినియోగదారులను ఆకర్షించేందుకు నూతన వ్యూహం చేపట్టబోతున్నారు.
హ్యుందాయ్ మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్ విభాగంలో వెర్నా 3 వ స్థానంలో ఉంటూ అత్యధికంగా అమ్ముడవుతున్న హోండా సిటీ మరియు మారుతి సుజుకి సియాజ్ వంటి వాటితో పోటీ పడడానికి ప్రయత్నిస్తూ ఉంది. అసహజమైన సీజన్లలో డిస్కౌంట్లను అందించడం ద్వారా, హ్యుందాయ్ దీపావళి వచ్చేనాటికి అమ్మకాల శాతం పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంది.
కొరియన్ వాహన తయారీసంస్థ అత్యధికంగా అమ్ముడుపోతున్న ఐ20 తప్ప మిగిలిన వాటి అన్నింటికీ డిస్కౌంట్ అందిస్తోంది. ఎక్సెంట్ మరియు ఐ20 అత్యధికంగా అమ్ముడుపోతున్నాయి. ఇవి కాకుండా మిగిలిన వాటితో సంస్థ మార్కెట్లో తమ ఆధిపత్యాన్ని నడపడానికి కష్టపడుతుంది. ఈ ఆఫర్ తో,అమ్మకాల పరంగా సంస్థ మార్కెట్ స్థిరమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతుందని ఆశిస్తుంది.ఈ వెర్నా 1,620 యూనిట్లు అమ్ముడుపోగా, దీని అమ్మకాల ద్వారా సంస్థ నెల నుంచి నెలకు అమ్మకాల పట్టికలో 24 శాతంకి క్షీణించింది.
ఈ ఆఫర్ జులై వరకూ మాత్రమే అందుబాటులో ఉంది.
CAR | VARIANT | DISCOUNT |
Hyundai Verna | Petrol | Rs. 50,000 |
Hyundai Verna | Diesel | Rs. 50,000 |
Hyundai Grand i10 | Petrol | Rs. 26,000 |
Hyundai Grand i10 | Diesel | Rs.26,000 |
Hyundai Eon | Petrol | Rs.23,500 |
Hyundai Eon | CNG | Rs.26,000 |
Hyundai i10 | Petrol | Rs.37,500 |
Hyundai i10 | CNG | Rs.42,500 |
Hyundai Xcent | Petrol | Rs.28,000 |
Hyundai Xcent | Diesel | Rs.28,000 |
Hyundai Elantra | Petrol | Rs.60,000 |
Hyundai Elantra | Diesel | Rs.60,000 |
Hyundai Santa Fe | Rs.70,000 |