భారతదేశంలో జూలై 21, 2015 న ప్రవేశపెట్టనున్న హ్యుందాయ్ క్రిటా
జూన్ 08, 2015 10:29 am raunak ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- 26 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: హ్యుందాయ్ ఇండియా మరొక కొత్త మోడల్ తో మన ముందుకు రాబోతుంది. రానున్న పండగ సీజన్ ను సద్వినియోగం చేసుకోవడానికి కొరియన్ ఆటోమేకర్ తయారీదారుడైన హ్యుందాయ్, క్రిటా ను జూన్ 21, 2015 న ప్రవేశపెట్టబోతున్నారు. అంతేకాక, బేబి సాంట ఫీ లా కనబడే ఈ క్రిటా యొక్క ఉత్పత్తులు జూన్ 20 నుండి ప్రారంబమౌతాయి. దీని యొక్క బుకింగ్స్ కూడా జూలై నెల నుండి ప్రారంభించాలని భావిస్తున్నారు. దీని పోటీదారుల గురించి మాట్లాడటానికి వస్తే, కాంపాక్ట్ ఎస్యువి అయిన రెనాల్ట్ డస్టర్, నిస్సాన్ టెర్రినో, మహీంద్రా స్కార్పియో, టాటా సఫారి స్టోర్మ్ తో పాటు ఫోర్డ్ ఈకోస్పోర్ట్, మరియు వచ్చే నెలలో రాబోతున్న మారుతి సుజుకి యొక్క క్రాస్ వంటి వాటికి పోటీగా రానుంది.
హ్యుందాయ్ క్రీటా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది అని హ్యుందాయ్ చెప్పసాగింది. హ్యుందాయ్ గత సంవత్సరం చైనా లో ఐఎక్స్25 అను పేరుతో ప్రత్యేకంగా ప్రారంభించింది. క్రిటా కూడా ఐఎక్స్25 ను పోలి ఉంటుంది. సాంకేతికంగా చెప్పాలంటే, భారతదేశంలో జూన్ 21న ప్రవేశపెట్టిన తరువాత యూరోప్ తో సహా ఇతర మార్కెట్లలో ప్రారంభించనున్నట్లు హ్యుండాయ్ సంస్థ వారు తెలిపారు.
రాబోయే క్రిటా, వెర్నా లో ఉండే మూడు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉండబోతుంది. అవి వరుసగా 1.6 లీటర్ మరియు 1.4 సి ఆర్ డి ఐ మరియు 1.6 లీటర్ పెట్రోల్ ఇంజెన్ ఎంపికలతో రాబోతుంది. అంతేకాకుండా, వీటి యొక్క డీజిల్ ఇంజెన్లు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటాయి. వీటి యొక్క పెట్రోల్ ఇంజెన్లు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడతాయి. అయితే, రెండు ఇంజెన్ ఆప్షన్లు కూడా 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో అందుబాటులో ఉండబోతుంది. అంతేకాక, హ్యుందాయ్ యొక్క అమ్మకాలు కూడా , రెనాల్ట్ డస్టర్ కు సమానంగా అనగా నెలకు 4000 నుండి 5000 కార్ల విక్రయం జరగ వచ్చునని అంచనా వేస్తున్నారు.
0 out of 0 found this helpful