తేలికపాటి నవీకరణలను పొందిన హ్యుందాయ్ i20, ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది కానీ భారతదేశంలో మాత్రం 2023 చివరిలో
హ్యుందాయ్ ఐ20 2020-2023 కోసం sonny ద్వారా మే 14, 2023 04:09 pm సవరించబడింది
- 44 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
స్పోర్టియర్ లుక్ కోసం తేలికపాటి డిజైన్ మార్పులును మరియు ఫీచర్ నవీకరణలను పొందింది, ఇవి ఇండియా-స్పెక్ నవీకరణలో ఉండకపోవచ్చు
- హ్యుందాయ్ మూడవ-జెనరేషన్ i20ని 2020 చివరిలో భారతదేశంలో విడుదల చేసింది.
- తన మొదటి నవీకరణలో భాగంగా ముందు భాగంలో మార్పులు, కొత్త రేర్ బంపర్ మరియు సరికొత్త రంగులను పొందింది.
- గ్లోబల్ మోడల్ؚలో క్యాబిన్ؚలో ఎటువంటి మార్పులు ఉండవు, మల్టీ-కలర్ ఆంబియంట్ లైటింగ్ؚను జోడించింది.
- బోనెట్ؚలో ఎటువంటి మార్పులు లేవు, 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚను కొనసాగిస్తుంది.
- ఇది 2023 చివరిలో భారతదేశంలో పరుగులు తీయనుంది.
మూడవ- జెనరేషన్ హ్యుందాయ్ i20 2020లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రస్తుతం తేలికపాటి నవీకరణను పొందింది. ఈ అప్ؚడేట్ؚతో, లుక్ మరియు ఇంటీరియర్ లైటింగ్ పరంగా తేలికపాటి మార్పులతో వస్తుంది. ఈ సంవత్సరం చివరిలో భారతదేశంలోకి అడుగుపెడుతుందని అంచనా.
కొత్తగా ఏం అందిస్తున్నారు?
I20 మిడ్-లైఫ్ నవీకరణలో డిజైన్ పరంగా చెప్పుకోదగిన మార్పులు ఏవి లేవు. లుక్ పరంగా ముందు భాగంలో ప్రధానమైన మార్పులతో వస్తుంది. బంపర్, గ్రిల్, సైడ్ ఇన్ؚటేక్ؚలు మరియు హెడ్‌ల్యాంప్ؚలకు కొత్త రూపాన్ని అందించారు. మునపటి వెర్షన్‌తో పోలిస్తే ప్రస్తుతం మరింత ధృడంగా మరియు స్పోర్టియర్ؚగా కనిపిస్తుంది. రేర్ బంపర్ కూడా నవీకరించబడింది, బాగా కనిపిస్తున్న రేర్ స్కిడ్ ప్లేట్ మరియు కాంట్రాస్ట్ బ్లాక్ ఎలిమెంట్‌లు స్పోర్టియర్ؚగా మరింత అందంగా కనిపించేలా చేస్తున్నాయి.
16- మరియు 17- అంగుళాల సైజులలో అందిస్తున్న అలాయ్ వీల్స్‌లో కొత్త ఫైవ్-పాయింటెడ్ స్టార్ డిజైన్ؚను కూడా హ్యుందాయ్ దీనికి అమర్చింది. నవీకరించబడిన గ్లోబల్-స్పెక్ i20 మూడు కొత్త ఎక్స్ؚటీరియర్ రంగు ఎంపికలను కూడా పొందింది: ల్యూసిడ్ లైమ్ మెటాలిక్ (ఇక్కడ అందించిన చిత్రంలో చూడవచ్చు), ల్యూమెన్ గ్రే పర్ల్ మరియు మెటా బ్లూ పర్ల్. ల్యూసిడ్ లైమ్ ఎంపికలో క్యాబిన్ హైలైట్‌లను అదే రంగులో అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఎక్స్టర్ؚ వివరాలను విడుదల చేసిన హ్యుందాయ్, టాటా-పంచ్ؚతో పోటీపడే ఈ SUV బుకింగ్ؚలను కూడా ప్రారంభించింది
సుపరిచిత ఫీచర్‌ల జాబితా
i20 గ్లోబల్ వెర్షన్ 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మరియు ADAS వంటి ఫీచర్‌లను పొందింది, ఇవి ఇండియా-స్పెక్ మోడల్‌లో అందించడం లేదు. 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, వైర్ؚలెస్ ఛార్జింగ్ మరియు కనెక్టెడ్ కార్ టెక్ؚ వంటి మిగిలిన ఫీచర్‌లలో ఎటువంటి మార్పులు ఉండవు.
అయితే, LED క్యాబిన్ లైట్ؚలు మరియు బహుళ-రంగుల ఆంబియెంట్ లైటింగ్ వంటి అప్ؚడేట్ؚలు ఇండియా-స్పెక్ నవీకరణలో కూడా కనిపించవచ్చు. భద్రత విషయంలో, నవీకరించిన మోడల్ ఎక్కువ ఎయిర్ బ్యాగ్ؚలను ప్రామాణికంగా పొందవచ్చు. టాప్ వేరియెంట్ؚలో ఇప్పటికే ఆరు ఎయిర్ బ్యాగ్ؚలను అందిస్తోంది.
సంబంధించినవి: హ్యుందాయ్ కార్‌ల అన్నిటిలో జోడించబడిన తేలికపాటి కానీ ముఖ్యమైన భద్రత అప్ؚగ్రేడ్
ఇంజన్‌లో ఎటువంటి మార్పులు లేవు
i20ని ప్రపంచవ్యాప్తంగా 6-స్పీడ్‌ల iMT లేదా 7-స్పీడ్‌ల DCT ఆటోమ్యాటిక్ؚతో జోడించబడిన 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚతో అందిస్తున్నారు. ఇండియా-స్పెక్ ప్రీమియం హ్యాచ్ؚబ్యాక్ కూడా 120PS మరియు 172Nmతో పాటు 83PS మరియు 114Nmను అందించే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚను పొందుతుంది. రెండవది 5-స్పీడ్‌ల మాన్యువల్ లేదా CVT ఆటోమ్యాటిక్ ఎంపిక ఉంటుంది. ఈ నవీకరణలో భాగంగా పవర్‌ట్రెయిన్ؚలలో ఎటువంటి మార్చలు లేవు.
విడుదల మరియు ధరలు
నవీకరించిన i20 ప్రపంచవ్యాప్తంగా మూడవ త్రైమాసికంలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది మరియు ఈ సంవత్సరం చివరిలో భారతదేశంలోకి ప్రవేశించవచ్చు. ప్రస్తుత ధర రూ.7.46 లక్షల నుండి రూ.11.88 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కంటే దీని ధర కొంతవరకు ఎక్కువగా ఉంటుంది అని అంచనా. మారుతి బాలెనో, టయోటా గ్లాంజా, టాటా అల్ట్రోజ్, మరియు సిట్రోయెన్ C3 వంటి వాటితో i20 పోటీ పడనుంది.
ఇక్కడ మరింత చదవండి: హ్యుందాయ్ i20 ఆటోమ్యాటిక్