• English
  • Login / Register

హ్యుందాయ్ ఐ 10 వేరియంట్స్ - ఏది ఉత్తమమైనదో తెలుసుకోండి

హ్యుందాయ్ ఐ10 కోసం sumit ద్వారా డిసెంబర్ 17, 2015 06:27 pm సవరించబడింది

  • 30 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:హ్యుందాయ్ ఐ 10 దాని విభాగంలో పేరుపొందిన కారు. మీరు ఒక B-సెగ్మెంట్ హ్యాచ్బ్యాక్ ని కొనుగోలు చేసుకోవాలి అనే ప్రణాళికలో ఉంటే ఐ10 మీకు చాలా ఉత్తమమైన కారు. ఒక ఆర్థిక ఖర్చుతో నవీకరించబడిన ఈ హ్యుందాయి ఐ10 వాహనాన్ని సులభంగా కొనుగోలు చేసుకోవచ్చు. అయితే, ఐ10 యొక్క ఒక నిర్దిష్ట వేరియంట్ ఎంచుకోవడానికి తికమక పడుతున్నారా? అయితే చింతించకండి మీకోసం మేము హ్యుందాయ్ ఐ 10 వేరియంట్ల సంక్షిప్త విశ్లేషణ ఇక్కడ సిద్ధం చేసాము.

హ్యుందాయి ఐ10 ఎరా, మాగ్న మరియు Sportz అనే మూడు వేరియంట్లలో వస్తుంది.

1. ఎరా వేరియంట్: రూపాయలు. 4.3 లక్షలు

ఇది ఐ 10 యొక్క బేస్ వేరియంట్ మరియు సెంట్రల్ లాకింగ్ మరియు పవర్ విండోస్ వంటి లక్షణాలను కలిగి ఉంది. అలానే కస్టమర్ తప్పనిసరిగా ఎదురు చూసే కొన్ని లక్షణాలను కలిగి ఉంది.

కీలక అంశాలు

  • ఇంజిన్ ఇమ్మొబలైజర్
  • రూఫ్ యాంటెన్నా
  • సెంటర్ కన్సోల్ ట్రే
  • ఫ్రంట్ రూం ల్యాంప్
  • గేర్ షిఫ్ట్ ఇండికేటర్
  • i-రిలాక్స్ ముందు సీట్లు
  • i-రిలాక్స్ గేర్ కన్సోల్
  • హీటర్ తో ఎయిర్ కండీషనర్
  • పవర్ స్టీరింగ్
  • అంతర్గతంగా సర్దుబాటు చేయగల బయట అద్దాలు

ఎవరైతే తక్కువ బడ్జెట్ ని కలిగి మరియు ఎంట్రీ లెవల్ విభాగం నుండి ఒక నవీకరణ కావాలనుకుంటారో వారికి ఈ ఎరా వేరియంట్ సరైనది. ఈ నవీకరించబడిన లక్షణాలతో ఐ10 ఖచ్చితంగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.

2. మాగ్న వేరియంట్: రూపాయలు. 4.6 లక్షలు - రూ. 4.7 లక్షలు

మాగ్న వేరియంట్, బేస్ వేరియంట్ కి డే/నైట్ ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ మరియు ప్యాసింజర్ వానిటీ మిర్రర్ వంటి అధనపు లక్షణాల చేరికతో వస్తుంది.

కొన్ని ముఖ్య లక్షణాలు:

  • సెంట్రల్ లాకింగ్
  • ఆటో-డౌన్ ఫీచర్ తో ముందు మరియు వెనుక పవర్ విండోస్
  • మెటల్ ఫినిష్ సెంటర్ ఫేసియా
  • బాడీ కలర్ బంపర్
  • waistline మౌల్డింగ్
  • ఫ్రంట్ డోర్ మ్యాప్ పోకెట్
  • డీలక్స్ ఫ్లోర్ కన్సోల్
  • ఫ్రంట్ & రేర్ డోర్ పూర్తి పరిమాణం గల ఆర్మ్రెస్ట్

ఎవరైతే సౌకర్యం కావాలనుకుంటారో మరియు ఎక్కువగా ఉన్న ధర విషయంలో రాజీపడరో అటువంటి వారికి ఈ వేరియంట్ సరైనది. పవర్ విండోస్ మరియు ప్రయాణీకుల వానిటీ మిర్రర్స్ డ్రైవర్ ని సౌకర్యవంతంగా చేస్తాయి.

3. Sportz వేరియంట్: రూపాయలు. 4.6 లక్షలు - రూ. 5.2 లక్షలు

ఇది ఐ10 యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ మరియు ఈ వేరియంట్ వినియోగదారునికి కారు LPG గ్యాస్ పైన నడిచే ఆప్షన్ ని కూడా అందిస్తుంది.

కొన్ని ముఖ్యమైన లక్షణాలు:

  • ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్
  • ఫోల్డబుల్ కీ
  • బగ్లర్ అలారంతో కీలెస్ ఎంట్రీ
  • పూర్తి వీల్ కవర్
  • రియర్ పార్సెల్ ట్రే
  • ఆడియో డిస్ప్లేలో డిజిటల్ గడియారం
  • టిల్ట్ స్టీరింగ్
  • USB పోర్టులు తో MP3 ప్లేయర్
  • శరీర రంగు బయట అద్దం

ఎవరైతే ఎక్కువగా సంగీతాన్ని ప్రేమిస్తారో మరియు లగ్జరీ లక్షణాలను కావలనుకుంటారో వారికి ఇది సరైన వేరియంట్.

హ్యుందాయ్ ఐ 10 ఎక్స్పెర్ట్ రివ్యూ వీడియో చూడండి (పెట్రోల్)

ఇంకా చదవండి  

రెనో క్విడ్ వేరియంట్స్ - మీకు ఏది బావుంటుందో చూసుకోండి

was this article helpful ?

Write your Comment on Hyundai ఐ10

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience