హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ Vs మారుతి స్విఫ్ట్: రియల్ వరల్డ్ మైలేజ్ పోలిక
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియస్ 2019-2023 కోసం dhruv ద్వారా అక్టోబర్ 16, 2019 10:22 am ప్రచురించబడింది
- 24 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఒక లీటరు ఫ్యుయల్ పై మీరు నిజంగా గ్రాండ్ ఐ 10 నియోస్ లేదా స్విఫ్ట్‌లో ఎంత దూరం వెళ్లగలుగుతారు? మేము కనుగొన్నాము
హ్యుందాయ్ ఇటీవల భారతదేశంలో గ్రాండ్ i10 నియోస్ ను విడుదల చేసింది. దాని ప్రీమియం స్టైలింగ్ మరియు అదనపు ఫీచర్ జాబితాతో, ఇది మారుతి స్విఫ్ట్ తో పోటీ పడుతుంది. రెండు హ్యాచ్‌బ్యాక్‌ల మధ్య వేరియంట్ వారీ పోలిక గురించి మీరు ఇక్కడ చదువుకోవచ్చు.
బయట ప్రపంచంలో అవి ఎలా మైలేజ్ ని అందిస్తాయో చూడటానికి మేము ఇప్పుడు రెండింటినీ పరీక్షించాము. ఈ పోలికలో, హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ మరియు మారుతి స్విఫ్ట్ యొక్క పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్ల ఫలితాలను పరిశీలిస్తాము. అయితే, రెండూ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్లు మాత్రమే.
మొదట వారి ఇంజిన్ స్పెసిఫికేషన్స్ మరియు ARAI- క్లెయిమ్ చేసిన మైలేజ్ ని పరిశీలిద్దాం.
పెట్రోల్ ఇంజిన్
గ్రాండ్ i10 నియోస్ |
మారుతి స్విఫ్ట్ |
|
ఇంజిన్ |
1197cc |
1197cc |
పవర్ |
83PS |
83PS |
టార్క్ |
113Nm |
113Nm |
ట్రాన్స్మిషన్ |
5MT/5AMT |
5MT/ 5AMT |
క్లెయిమ్ చేసిన FE |
20.7kmpl/20.5kmpl |
21.21kmpl |
ఎమిషన్ టైప్ |
BS6 |
BS6 |
డీజిల్ ఇంజిన్
గ్రాండ్ i 10 నియోస్ |
మారుతి స్విఫ్ట్ |
|
ఇంజిన్ |
1186cc |
1248cc |
పవర్ |
75PS |
75PS |
టార్క్ |
190Nm |
190Nm |
ట్రాన్స్మిషన్ |
5MT/5AMT |
5MT/5AMT |
క్లెయిమ్ చేసిన FE |
26.2kmpl |
28.40kmpl |
ఎమిషన్ టైప్ |
BS4 |
BS4 |
మేము ARAI క్లెయిమ్ చేసిన గణాంకాల ప్రకారం వెళితే, పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లు రెండిటిలో స్విఫ్ట్ గెలుస్తుంది. కానీ ఈ ఫ్యుయల్ ఎఫిషియన్సీ నియంత్రిత వాతావరణంలో నిర్వహించబడతాయి. హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ మరియు మారుతి స్విఫ్ట్ యొక్క మైలేజ్ వాస్తవ ప్రపంచ పరిస్థితులలో ఎలా భిన్నంగా ఉంటాయో చూద్దాం.
పెట్రోల్ పోలిక
పరీక్షించిన ఫ్యుయల్ ఎకానమీ (సిటీ) |
పరీక్షించిన ఫ్యుయల్ ఎకానమీ (హైవే) |
|
హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ |
15.12kmpl |
18.82kmpl |
మారుతి స్విఫ్ట్ |
16.10kmpl |
22.43kmpl |
మా పరీక్ష గణాంకాల ప్రకారం, సిటీ మరియు హైవే పై స్విఫ్ట్ మంచి మైలేజ్ అందిస్తుందని చెప్పవచ్చు.
25% నగరం, 75% హైవే |
50% నగరం, 50% హైవే |
75% నగరం, 25% హైవే |
|
హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ |
17.74kmpl |
16.77kmpl |
15.9kmpl |
మారుతి స్విఫ్ట్ |
20.42kmpl |
18.74kmpl |
17.32kmpl |
మీరు ఎక్కువగా సిటీలో గానీ హైవే మీద గానీ తిరిగినట్లయితే లేదా రెండు కలయికలో తిరిగినట్లయినా, పెట్రోల్-MT స్విఫ్ట్ కారు గ్రాండ్ i10 నియోస్ కంటే మిమ్మల్ని ఎక్కువ దూరం తీసుకెళుతుంది.
డీజిల్
పరీక్షించిన ఫ్యుయల్ ఎకానమీ (సిటీ) |
పరీక్షించిన ఫ్యుయల్ ఎకానమీ (హైవే) |
|
హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ |
19.39kmpl |
21.78kmpl |
మారుతి స్విఫ్ట్ |
19.74kmpl |
27.38kmpl |
మళ్ళీ, మా పరీక్ష ఫలితాల ప్రకారం, సిటీ మరియు హైవేలో స్విఫ్ట్ ఇక్కడ మరింత సమర్థవంతమైన ఎంపిక. గ్రాండ్ i10 నియోస్ మరియు స్విఫ్ట్ సిటీ లో దాదాపు పోటీగా ఉన్నాయి, కాని తరువాతి హైవే గణాంకాలలో స్విఫ్ట్ హాయిగా ముందుకు సాగుతుంది.
25% నగరం, 75% హైవే |
50% నగరం, 50% హైవే |
75% నగరం, 25% హైవే |
|
హ్యుందాయ్ గ్రాండ్ i 10 నియోస్ |
21.13kmpl |
20.52kmpl |
19.94kmpl |
మారుతి స్విఫ్ట్ |
24.96kmpl |
22.94kmpl |
21.22kmpl |
మీరు ఎక్కడ డ్రైవ్ చేసినా - సిటీ, హైవే లేదా రెండింటి కలయికలో, స్విఫ్ట్ ఎల్లప్పుడూ మీ డబ్బులకి మంచి విలువని అందిస్తుంది.
తీర్పు
మీరు హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ మరియు మారుతి స్విఫ్ట్ రెండిటిలో ఏదో ఒకటి కొనాలి అని చూస్తున్నట్లయితే మరియు మైలేజ్ మీ ప్రధాన కోరికల అంశాలలో ఉంటే, పెట్రోల్ లేదా డీజిల్ అయినా సరే స్విఫ్ట్ ఎంచుకోవాలని మేము సూచిస్తున్నాము. రెండు వెర్షన్లు గ్రాండ్ i10 నియోస్ కన్నా ఎక్కువ మైలేజ్ ని అందిస్తున్నాయి.
మరింత చదవండి: హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ AMT