హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ టాప్-స్పెక్ ఆస్టా వేరియంట్ లో AMT ఎంపికను పొందుతుంది
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియస్ 2019-2023 కోసం rohit ద్వారా మార్చి 04, 2020 05:47 pm ప్రచురించబడింది
- 32 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
బేస్-స్పెక్ ఎరా వేరియంట్ మినహా, అన్ని ఇతర 1.2-లీటర్ పెట్రోల్ వేరియంట్లు ఇప్పుడు AMT ఎంపికతో వస్తాయి
- గ్రాండ్ i10 నియోస్ ఆస్టా 1.2-లీటర్ పెట్రోల్ వేరియంట్ ఇప్పుడు AMT ఎంపికను పొందింది.
- హ్యుందాయ్ ఇటీవల గ్రాండ్ i10 నియోస్ యొక్క టర్బో-పెట్రోల్ వేరియంట్‌ను విడుదల చేసింది.
- డీజిల్ వేరియంట్లలో, గ్రాండ్ i10 నియోస్ స్పోర్ట్జ్ మాత్రమే AMT గేర్‌బాక్స్ ని పొందుతుంది.
- కొత్త ఆస్టా AMT వరుసగా పెట్రోల్ మాగ్నా AMT మరియు స్పోర్ట్జ్ AMT కంటే రూ .1.25 లక్షలు, రూ .64,000 ఎక్కువ ధరని కలిగి ఉంటాయి.
హ్యుందాయ్ 1.2-లీటర్ పెట్రోల్ మోటారుతో కూడిన గ్రాండ్ i10 నియోస్ టాప్-స్పెక్ ఆస్టా వేరియంట్ తో AMT గేర్‌బాక్స్ ఎంపికను ప్రవేశపెట్టింది. ఇటీవల, దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యాచ్‌బ్యాక్ యొక్క టర్బో-పెట్రోల్ వేరియంట్ ను కూడా విడుదల చేసింది. అస్తా AMT ధర రూ .7.67 లక్షలు కాగా, దాని మాన్యువల్ కౌంటర్ ధర రూ .7.18 లక్షలు, తద్వారా ధర వ్యత్యాసం రూ .49,000 గా ఉంది.
అంతకుముందు, హ్యుందాయ్ మాగ్నా మరియు స్పోర్ట్జ్ వేరియంట్లలో మాత్రమే AMT ఎంపికను అందించేది. వీటి ధరలు వరుసగా రూ .6.42 లక్షలు, రూ .7.03 లక్షలు. మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో జతచేయబడతాయి, ఇవి 84Ps పవర్ ని మరియు 114Nm టార్క్ ని ఇస్తాయి. అయితే, మీకు 1.2-లీటర్ డీజిల్ ఇంజిన్ తో AMT గేర్‌బాక్స్ కావాలంటే, ఇది గ్రాండ్ i10 నియోస్ యొక్క స్పోర్ట్జ్ వేరియంట్ లో మాత్రమే లభిస్తుంది. డీజిల్ ఇంజిన్ యొక్క అవుట్పుట్ గణాంకాలు 75Ps / 190Nm వద్ద ఉన్నాయి.
ఇది కూడా చదవండి: 2020 హ్యుందాయ్ క్రెటా యొక్క వేరియంట్ వారీగా ఇంజిన్ ఎంపికలు వెల్లడయ్యాయి
టాప్-స్పెక్ ఆస్టా AMT ధర మాగ్నా AMT మరియు స్పోర్ట్జ్ AMT వేరియంట్ల కంటే వరుసగా రూ .1.25 లక్షలు, రూ .64,000 ఎక్కువ. మరోవైపు స్పోర్ట్జ్ AMT డీజిల్ ధర రూ .7.90 లక్షలు. ఇదిలా ఉండగా, హ్యుందాయ్ రాబోయే నెలల్లో ఉత్పత్తుల సమూహాన్ని విడుదల చేయనుంది. ఇది మొదట రెండవ-జెన్ క్రెటాను మార్చి 17 న విడుదల చేస్తుంది, తరువాత 2020 ఏప్రిల్ లో వెర్నా ఫేస్‌లిఫ్ట్ మరియు 2020 మధ్యలో థర్డ్-జెన్ i20 ఉంటుంది.
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
మరింత చదవండి: గ్రాండ్ i10 నియోస్ AMT
0 out of 0 found this helpful