• English
  • Login / Register

హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్’ యొక్క హాట్-హాచ్ వేరియంట్ మన ముందుకు వచ్చింది!

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియస్ 2019-2023 కోసం rohit ద్వారా ఫిబ్రవరి 28, 2020 01:07 pm ప్రచురించబడింది

  • 48 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

గ్రాండ్ i10 నియోస్ యొక్క స్పోర్టియర్ వెర్షన్ భారతదేశంలో హాట్-హాచ్ విభాగంలో హ్యుందాయ్ నుండి వచ్చిన ఎంట్రీ గా నిలిచింది

Hyundai Grand i10 Nios Turbo

  • ఇది మొదట ఆటో ఎక్స్‌పో 2020 లో ఆవిష్కరించబడింది.
  • గ్రాండ్ i10 నియోస్ టర్బో రెండు వేరియంట్లలో అందించబడుతుంది: స్పోర్ట్జ్ మరియు స్పోర్ట్జ్ (డ్యూయల్ టోన్). 
  • ఆరాలో అందించబడే అదే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ద్వారా పవర్ ని పొందుతుంది.
  • టర్బో-ఇంజన్ 5-స్పీడ్ MT తో మాత్రమే వస్తుంది.  
  • దీని ధర రూ .7.68 లక్షల నుండి రూ .7.73 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఇండియా).

హ్యుందాయ్   గ్రాండ్ i10 నియోస్ టర్బో వేరియంట్‌ ను భారత్‌లో విడుదల చేసింది. ఇది రెండు వేరియంట్లలో అందించబడుతుంది: స్పోర్ట్జ్ మరియు స్పోర్ట్జ్ (డ్యూయల్ టోన్) ధర వరుసగా రూ .7.68 లక్షలు మరియు రూ .7.73 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఇండియా). కార్ల తయారీసంస్థ మొదట ఆటో ఎక్స్‌పో 2020 లో హ్యాచ్‌బ్యాక్ యొక్క టర్బోచార్జ్డ్ వెర్షన్‌ను ఆవిష్కరించారు.  

టర్బో వేరియంట్ ధరలు సాధారణ స్పోర్ట్జ్ వేరియంట్‌తో ఎలా పోటీ పడతాయో ఇక్కడ ఉంది:  

వేరియంట్

గ్రాండ్ i10 నియోస్ (పెట్రోల్ MT) ధర

ధర గ్రాండ్ i10 నియోస్ టర్బో ధర

తేడా

స్పోర్ట్జ్ 

రూ. 6.43 లక్షలు

రూ. 7.68 లక్షలు

రూ. 1.25 లక్షలు

స్పోర్ట్జ్ డ్యూయల్ టోన్

రూ. 6.73 లక్షలు

రూ. 7.73 లక్షలు

రూ. 1 లక్షలు

Hyundai Grand i10 Nios Turbo badge

గ్రాండ్ i10 నియోస్ యొక్క స్పోర్టియర్ వెర్షన్ దాని సెడాన్ తోబుట్టువు   ఆరాలో చూసినట్లు BS 6-కంప్లైంట్ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ద్వారా పవర్ ని అందుకుంటుంది. హ్యాచ్‌బ్యాక్ మరియు సెడాన్ రెండూ ఒకే పవర్ మరియు టార్క్ ఫిగర్స్ (100Ps / 172Nm) 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ తో మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. మరోవైపు, గ్రాండ్ i10 నియోస్ యొక్క 1.2-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లు 5-స్పీడ్ MT మరియు AMT రెండింటినీ కలిగి ఉంటాయి. వెన్యూ లో, హ్యుందాయ్ ఈ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ ను 7-స్పీడ్ DCT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ తో మరియు ఎక్కువ పనితీరుతో అందిస్తుంది.   

Hyundai Grand i10 Nios Turbo cabin

గ్రాండ్ i10 నియోస్ టర్బో స్పోర్టియర్ లుక్ కోసం రెడ్ ఆక్సెంట్స్ తో పూర్తి నలుపు ఇంటీరియర్ ని పొందుతుంది మరియు డాష్‌బోర్డ్‌ మీద ఇన్సర్ట్స్ తో ఇంటీరియర్‌ను పొందుతుంది. ఇదిలా ఉండగా, సౌకర్యాలు రెగ్యులర్ స్పోర్ట్జ్ వేరియంట్ వలె ఉంటాయి, ఇందులో ఆటో క్లైమేట్ కంట్రోల్, 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రియర్ పార్కింగ్ కెమెరా మరియు పుష్-బటన్ స్టార్ట్-స్టాప్ ఉన్నాయి. వెలుపల గ్రాండ్ i10 నియోస్ టర్బో యొక్క ప్రత్యేక లక్షణం ఆరా మాదిరిగానే దాని ముందు గ్రిల్‌లోని ‘టర్బో’బ్యాడ్జ్ ని కలిగి ఉంటుంది.

Hyundai Grand i10 Nios Turbo

ఈ టర్బో వెర్షన్‌ తో, హ్యుందాయ్ N బాడ్జ్ లేకపోయినా భారతదేశంలో హాట్-హాచ్ విభాగంలోకి ప్రవేశించింది. స్పోర్టియర్ గ్రాండ్ i 10 నియోస్ ,  మారుతి సుజుకి స్విఫ్ట్, ఫోర్డ్ ఫిగో మరియు నిస్సాన్ మైక్రాతో పోరాడుతూనే ఉంది. పనితీరు పరంగా, వోక్స్వ్యాగన్ పోలో GT TSI మరియు మారుతి సుజుకి బాలెనో RS వంటి వాటితో పోలిస్తే ఇది కొంచెం తక్కువ ధర అని చెప్పవచ్చు. వాస్తవానికి, రాబోయే BS6 ఉద్గార నిబంధనల కారణంగా బాలెనో RS కూడా అందుబాటులో లేదు. ప్రస్తుత పోలో GT TSI అదే మార్గంలో వెళ్ళబోతోంది.       

మరింత చదవండి: గ్రాండ్ i10 నియోస్ AMT

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Hyundai గ్రాండ్ ఐ10 నియస్ 2019-2023

Read Full News

explore మరిన్ని on హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియస్ 2019-2023

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience