• English
  • Login / Register

ముగిసిన Hyundai Exter పరిచయ ధరలు, రూ.16,000 వరకు ధరల పెంపు

హ్యుందాయ్ ఎక్స్టర్ కోసం shreyash ద్వారా అక్టోబర్ 10, 2023 12:24 pm ప్రచురించబడింది

  • 193 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

హ్యుందాయ్ ఎక్స్టర్ CNG వేరియెంట్‌లపై కూడా ఈ ధరల పెరుగుదల ప్రభావం ఉంది

  • హ్యుందాయ్ ఎక్స్టర్ పెట్రోల్ మాన్యువల్ వేరియెంట్‌ల ధర ప్రస్తుతం రూ.16,000 అధికం కానుంది. 

  • దీని ఆటోమ్యాటిక్ వేరియెంట్ؚల ధర రూ.12,000 వరకు పెరగనుంది. 

  • ఇది 1.2-లీటర్ పెట్రోల్ మరియు CNG పవర్‌ట్రెయిన్ ఎంపికలతో వస్తుంది. 

  • ప్రస్తుతం దీని ధర రూ.6 లక్షల నుండి రూ.10.15 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ఉంది. 

జూలై 2023లో విక్రయాలు ప్రారంభం అయిన తరువాత, హ్యుందాయ్ ఎక్స్టర్ ప్రస్తుతం రూ.16,000 మొదటి ధర పెరుగుదలను అందుకుంది. ఈ ధర పెరుగుదలతో, మైక్రో SUV పరిచయ ధరలు ముగిశాయి. ఎక్స్టర్ CNG వేరియెంట్ؚల ధరలు కూడా ఈ ధరల పెరుగుదలకు అనుగుణంగా పెరిగాయి. 

ఈ క్రింద, ఈ మైక్రో SUVల వేరియెంట్-వారీ సవరించిన ధరలను అందించాము.

పెట్రోల్ మాన్యువల్ 

వేరియెంట్ 

పాత ధరలు 

కొత్త ధరలు 

తేడాలు 

ఎక్స్ 

రూ. 6 లక్షలు

రూ. 6 లక్షలు

మార్పు లేదు

ఎక్స్ (O)

రూ. 6.25 లక్షలు

రూ. 6.35 లక్షలు

+ రూ. 10,000

S

రూ. 7.27 లక్షలు

రూ. 7.37 లక్షలు

+ రూ. 10,000

S (O)

రూ. 7.42 లక్షలు

రూ. 7.52 లక్షలు

+ రూ. 10,000

SX

రూ. 8 లక్షలు

రూ. 8.10 లక్షలు

+ రూ. 10,000

SX DT

రూ. 8.23 లక్షలు

రూ. 8.34 లక్షలు

+ రూ. 11,000

SX (O)

రూ. 8.64 లక్షలు

రూ. 8.74 లక్షలు

+ రూ. 10,000

SX (O) కనెక్ట్

రూ. 9.32 లక్షలు

రూ. 9.43 లక్షలు

+ రూ. 11,000

SX (O) కనెక్ట్ DT

రూ. 9.42 లక్షలు

రూ. 9.58 లక్షలు

+ రూ. 16,000

S CNG

రూ. 8.24 లక్షలు

రూ. 8.33 లక్షలు

+ రూ. 9,000

SX CNG

రూ. 8.97 లక్షలు

రూ. 9.06 లక్షలు

+ రూ. 9,000

పెట్రోల్ ఆటోమ్యాటిక్ 

వేరియెంట్ 

పాత ధరలు 

కొత్త ధరలు 

తేడాలు

S AMT

రూ. 7.97 లక్షలు

రూ. 8.07 లక్షలు

+ రూ. 10,000

SX AMT

రూ. 8.65 లక్షలు

రూ. 8.77 లక్షలు

+ రూ. 12,000

SX AMT DT

రూ. 8.91 లక్షలు

రూ. 9.02 లక్షలు

+ రూ. 11,000

SX (O) AMT

రూ. 9.32 లక్షలు

రూ. 9.41 లక్షలు

+ రూ. 9,000

SX (O) AMT కనెక్ట్

రూ. 10 లక్షలు

రూ. 10 లక్షలు

మార్పు లేదు

SX (O) AMT కనెక్ట్ DT

రూ. 10.10 లక్షలు

రూ. 10.15 లక్షలు

+ రూ. 5,000

  • ఎక్స్టర్ టాప్-స్పెక్ SX(O) కనెక్ట్ పెట్రోల్-మాన్యువల్ వేరియెంట్ ధర అత్యధికంగా రూ.16,000 పెరిగింది.
  • SX డ్యూయల్-టోన్ మరియు SX (O) కనెక్ట్ؚలను మినహాయించి, ఇతర పెట్రోల్-మాన్యువల్ వేరియెంట్ؚలు అన్నీటి ధరలు రూ.10,000 పెరిగాయి, మొదటి రెండు వేరియెంట్ؚలు రూ.11,000 ధర పెరుగుదలను అందుకున్నాయి.

  • హ్యుందాయ్ ఎక్స్టర్ CNG వేరియెంట్ؚల కోసం కస్టమర్‌లు రూ.9,000 అధికంగా వెచ్చించాలి.

దీనిని కూడా పరిశీలించండి: ఓటమి లేకుండా, సెప్టెంబర్ 2023 కాంపాక్ట్ SUVల అమ్మకాలలో అగ్ర స్థానంలో నిలిచిన హ్యుందాయ్ క్రెటా

పవర్ؚట్రెయిన్ పరిశీలన

హ్యుందాయ్ ఎక్స్టర్, 83PS పవర్ మరియు 114Nm టార్క్‌ను విడుదల చేసే 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ నుండి శక్తిని పొందుతుంది మరియు 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT ట్రాన్స్ؚమిషన్ؚతో జోడించబడింది. CNG వేరియెంట్ؚలు కూడా అదే ఇంజన్ؚను ఉపయోగిస్తాయి అయితే 69PS మరియు 95Nm టార్క్‌తో తక్కువ అవుట్ؚపుట్ؚను అందిస్తాయి. ఇది కేవలం 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో మాత్రమే లభిస్తుంది. 

దీనిని కూడా పరిశీలించండి: రూ.30,000 వరకు పెరిగిన కియా సెల్టోస్ మరియు కియా క్యారెన్స్ ధరలు 

కొత్త ధర శ్రేణి & పోటీదారులు

ప్రస్తుతం హ్యుందాయ్ ఎక్స్టర్ ధర రూ.6 లక్షల నుండి రూ.10.15 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉంది. ఇది టాటా పంచ్ؚతో పోటీ పడుతుంది మారుతి ఇగ్నిస్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కైగర్, సిట్రోయెన్ C3, మరియు మారుతి ఫ్రాంక్స్ వంటి వాటికి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. 

ఇక్కడ మరింత చదవండి: ఎక్స్టర్ AMT

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Hyundai ఎక్స్టర్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience