Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

కియా సెల్టోస్ తరువాత ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు ప్రామాణికంగా కలిగిన రెండవ కాంపాక్ట్ SUVగా నిలిచింది హ్యుందాయ్ క్రెటా

హ్యుందాయ్ క్రెటా 2020-2024 కోసం tarun ద్వారా ఫిబ్రవరి 03, 2023 02:32 pm ప్రచురించబడింది

ప్రజాదరణ పొందిన ఈ కాంపాక్ట్ SUV ఎన్నో క్రియాశీల భద్రత ఫీచర్‌లను ప్రామాణికంగా పొందింది

2023 కోసం హ్యుందాయ్ తన SUV శ్రేణిని నవీకరించింది. ఈ నవీకరణలు క్రెటా, ఆల్కాజర్, వెన్యూలను మరింత సురక్షితమైనవిగా, రాబోయే ఉద్గార నిబంధనలకు అనుగుణంగా మార్చింది, అంతేకాకుండా, ఇవి అధిక ధరతో వస్తాయి. వెన్యూ గురించి ఇప్పటికే చర్చించాము, ఇప్పుడు క్రెటా మరియు ఆల్కజార్ؚలలో నిర్ధారించబడిన మార్పులను మనం చూద్దాం.

హ్యుందాయ్ క్రెటా

క్రెటా ఇప్పుడు ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికిల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, హిల్ హోల్డ్ అసిస్ట్, రేర్ డిస్క్ బ్రేక్ؚలు, సీట్ బెల్ట్ ఎత్తు సర్దుబాటు, ISOFIX యాంకరేజ్ؚలను అన్నీ వేరియెంట్ؚలలో ప్రామాణికంగా పొందింది. వెనుక భాగంలో పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రోక్రోమిక్ IRVM, ఆటోమ్యాటిక్ హెడ్ؚల్యాంప్ؚలు, ఫాగ్ ల్యాంప్ؚలు వంటివి టాప్ వేరియెంట్ؚలలో అందుబాటులో ఉన్నాయి.

హ్యుందాయ్, క్రెటాను ఐడిల్-ఇంజన్ స్టాప్ؚతో మరియు గో ఫీచర్ؚతో నవీకరించింది. ఇప్పుడు ఇది BS6 ఫేస్ 2-కాంప్లియెంట్ మరియు E20 (20 శాతం ఎథనాల్ బ్లెండ్) ఇంజన్‌తో వస్తుంది. ఈ కాంపాక్ట్ SUV మాన్యువల్ లేదా ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚతో 115PS పవర్ 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌లను అలాగే 140PS పవర్ 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ మోటార్ؚను కలిగి ఉంది.

నవీకరించిన క్రెటా కొత్త ధరలు రూ.10.84 లక్షల నుండి రూ.19.13 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ఈ 20 చిత్రాలలో కొత్త హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ؚను పరిశీలించండి

హ్యుందాయ్ ఆల్కజార్

ఆల్కజార్ ESCతో పాటుగా ఆరు ఎయిర్ బ్యాగులు, హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రేర్ డిస్క్ బ్రేక్ؚలు, LED ఫాగ్ ల్యాంప్ؚలు, వెనుక భాగంలో పార్కింగ్ కెమెరాతో నవీకరించబడిన ప్రామాణిక పరికరాలను పొందింది. టాప్ వేరియెంట్ؚలలో ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ؚలు, బ్లైండ్ వ్యూ మానిటర్‌తో 360-డిగ్రీ కెమెరా వంటివి అందించబడతాయి.

మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚలతో జత చేయబడిన 150PS పవర్ 2-లీటర్ పెట్రోల్, 115PS పవర్ 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ؚలు ఆల్కజార్ؚకు శక్తిని ఇస్తాయి. వీటిని రాబోయే ఉద్గార నిబంధనలకు అనుగుణంగా నవీకరించారు. ఈ మూడు-వరుసల SUV ఇప్పుడు రూ.16.10 లక్షల నుండి రూ.21.10 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరలో విక్రయించబడుతుంది. టాటా సఫారి, MG హెక్టార్ ప్లస్, మహీంద్రా XUV700 వంటి వాటికి ప్రత్యామ్నాయంగా కొనసాగుతుంది.

ఇటీవల మార్కెట్‌లోకి వచ్చిన నవీకరించబడిన గ్రాండ్ i10 నియోస్ మరియు ఆరాలలో కూడా భద్రత ఫీచర్‌లుؚ ప్రామాణికంగా ఉన్నాయి. హ్యుందాయ్ మోడల్‌లలో కేవలం వెర్నా, i20కి మాత్రమే MY2023 నవీకరణ మిగిలి ఉంది, వీటి కోసం కూడా వేచి చూడవచ్చు.

ఇక్కడ మరింత చదవండి: హ్యుందాయ్ క్రెటా ఆన్-రోడ్ ధర

t
ద్వారా ప్రచురించబడినది

tarun

  • 39 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన హ్యుందాయ్ క్రెటా 2020-2024

Read Full News

explore similar కార్లు

హ్యుందాయ్ క్రెటా

Rs.11 - 20.15 లక్షలు* ఆన్ రోడ్ ధర పొందండి
పెట్రోల్17.4 kmpl
డీజిల్21.8 kmpl
ట్రాన్స్ మిషన్మాన్యువల్/ఆటోమేటిక్
వీక్షించండి మే ఆఫర్లు

హ్యుందాయ్ అలకజార్

Rs.16.77 - 21.28 లక్షలు* ఆన్ రోడ్ ధర పొందండి
పెట్రోల్18.8 kmpl
డీజిల్24.5 kmpl
ట్రాన్స్ మిషన్మాన్యువల్/ఆటోమేటిక్
వీక్షించండి మే ఆఫర్లు

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర