• English
  • Login / Register

హ్యుందాయి క్రెటా - ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ - ఇది అర్హురాలా?

హ్యుందాయ్ క్రెటా 2015-2020 కోసం bala subramaniam ద్వారా డిసెంబర్ 29, 2015 05:01 pm ప్రచురించబడింది

  • 17 Views
  • 1 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

న్యూ డిల్లీ:

హ్యుందాయ్ క్రెటా ఒక గొప్ప కారు. మీరు కార్లను ఇష్టపడే వారే అయితే దాని గురించి తెలుసుకోవాలనుకోరా? ఒక అందుకోలేని డిమాండుని కలిగి ఉన్న ఈ కారు నిస్సందేహంగా అత్యంత ప్రజాధారణ పొందిన కారు మరియు అభిమానుల అభిమానాన్ని చూరగొన్న కారు. అంతేకాకుండా అభిమానుల కిరీటంలో కోహినూర్ చేరుకున్నట్టు దీనికి ఇండియన్ కారు ఆఫ్ ది ఇయర్ అవార్డ్డు కూడా వచ్చింది. అయితే, ఈ అవార్డ్డు కి ఇది అర్హురాలా లేదా అనేది పెద్ద ప్రశ్న?

చాలా మంది ఆటోమొబైల్ పత్రికలు మరియు వెబ్సైట్లు తమ అవార్డ్డులను తామే ప్రకటించుకోవడం జరుగుతుంది. వీటి మధ్యలో అందరు తయారీదారులు కలిసి ఒకే కారు ని ఎంచుకోవడం అనేది ప్రత్యేకమైనదే కదా?

హ్యుందాయ్ సంస్థ, నాణ్యత మరియు క్వాంటిటీ పరంగా చాలా వృద్ధి చూపించింది. సంస్థ నిరంతరం చూడడానికి, నడపడానికి మరియు అనేక లక్షణాలను అందించే కార్లను బయటకి తెస్తుంది. హ్యుందాయి క్రెటా ఆ జాబితాలో ఉన్న మరో కారు మరియు గ్రాండ్ ఐ 10 మరియు ఎలీట్ ఐ 20 వరుసగా 2014 మరియు 2015 లో అందుకున్న తరువాత మూడోసారి ఈ కొరియన్ కంపెనీ ICOTY అవార్డుని అందుకుంది. ఇది హ్యుందాయి యొక్క నాల్గవ బహుమతి.  

హ్యుందాయ్ క్రెటా జూలై 2015 లో ప్రారంభించబడి, ఇప్పటికే (ఎగుమతి 16,000 యూనిట్లతో సహా) 90,000 బుకింగ్స్ పై వసూలు చేసింది మరియు ఈ వ్యాసం ప్రచురించబడే సమయానికి 100,000 యూనిట్లకు కూడా చేరుకోగలుగుతుందని సంస్థ నమ్మకంగా ఉంది. క్రెటా వాహనం భారతదేశంలో మాత్రమే తయారుచేయబడి మరియు లాటిన్ అమెరికన్, వెస్ట్ అమెరికన్ మరియు ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయబడుతుందనే విషయం గమనించాలి.

క్రెటా భారతదేశంలో తయారుచేయబడుతుందన్న విషయం మాత్రమే కాకుండా లాటిన్ NCAP క్రాష్ పరీక్షలలో 4 ఔట్ ఆఫ్ 5 స్కోర్ నమోదు చేసుకోవడం మరింత ముఖ్యమైన విషయం.

అవార్డ్డుకి ఇది అర్హురాలేనా? లేదా? అయితే క్రెటా యొక్క టెస్ట్ డ్రైవ్ కి వెళ్ళి స్వయంగా తెలుసుకొని మాకు తెలియపరచండి.

మరింత చదవండి : హ్యుందాయ్ Creta

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Hyundai క్రెటా 2015-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience