Hyundai Creta Facelift భద్రతా ఫీచర్ؚల వివరణ
హ్యుందాయ్ క్రెటా కోసం rohit ద్వారా జనవరి 08, 2024 01:16 pm ప్రచురించబడింది
- 1.1K Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
నవీకరించిన క్రెటా ప్రామాణికంగా 36 భద్రతా ఫీచర్ؚలు, 19 ADAS ఫీచర్ؚలు మరియు మొత్తం మీద 70 భద్రతా ఫీచర్లతో వస్తుంది
-
నవీకరించిన క్రెటాను హ్యుందాయ్, జనవరి 16వ తేదీన విడుదల చేయనుంది.
-
సెల్టోస్ ADAS స్యూట్ؚలో ఉన్న ఫీచర్ల కంటే ఎక్కువ ఫీచర్లతో, క్రెటా మొదటిసారిగా ADAS సాంకేతికతను పొందుతుంది,
-
ఇతర భద్రతా ఫీచర్లలో ESC, ఆరు ఎయిర్ؚబ్యాగ్ؚలు మరియు ఆల్-వీల్ డిస్క్ బ్రేక్ؚలు ఉన్నాయి.
-
ఎంచుకున్న వేరియెంట్ؚను బట్టి మూడు ఇంజన్ؚలు మరియు నాలుగు ట్రాన్స్ؚమిషన్ ఎంపికలను పొందుతుంది.
నవీకరించిన హ్యుందాయ్ క్రెటా త్వరలోనే మన మార్కెట్ؚలోకి ప్రవేశించనుంది. ధరను ప్రకటించే ముందు, కారు తయారీదారు, నవీకరించిన కాంపాక్ట్ SUVలోని ముఖ్యమైన భద్రతా ఫీచర్ల సమాచారాన్ని పంచుకున్నారు. కొత్త హ్యుందాయ్ క్రెటాలో ఉన్న ముఖ్యమైన జోడింపులలో ఒకటి అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS).
ప్రామాణిక భద్రతా కిట్
దీని మునుపటి వర్షన్ؚలో ఉన్న విధంగానే, క్రెటా ఫేస్ؚలిఫ్ట్ కూడా ఆరు ఎయిర్ؚబ్యాగ్ؚలు , ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), మరియు ఆల్-వీల్ డిస్క్ؚబ్రేక్ؚలను ప్రామాణికంగా కలిగి ఉంటుంది. ఆశిస్తున్న ఇతర ప్రామాణిక భద్రతా ఫీచర్లలో ప్రయాణీకులు అందరికీ రిమైండర్లతో 3-పాయింట్ సీట్ؚబెల్ట్ؚలు, EBDతో ADB, మరియు ISOFIX చైల్డ్ సీట్ మౌంట్ؚలు ఉండవచ్చు. ఈ SUV 36 భద్రతా ఫీచర్లను ప్రామాణికంగా పొందుతుందని హ్యుందాయ్ ప్రకటించింది.
19 ADAS ఫీచర్ؚలు
ఈ మిడ్ లిఫ్ట్ రీఫ్రెష్ తో, హ్యుందాయ్ తన కాంపాక్ట్ SUVలో, కొత్త వెర్నాలో ఉన్న విధంగానే సెన్సార్ؚలు మరియు ముందరి కెమెరాతో లెవెల్ 2 ADASను అందిస్తుంది. ADAS ఫీచర్ؚలను ఇంకా ప్రకటించేలేదు, అయితే నవీకరించిన క్రెటా, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, మరియు లేన్ డిపార్చర్ వార్నింగ్ؚలతో వస్తుందని అంచనా.
ఇందులో ఉన్న ఇతర ఫీచర్ؚలు
నవీకరించిన క్రెటా, డ్యూయల్-జోన్ AC, మరియు 8-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, 360-డిగ్రీ కెమెరా, 10.25-అంగుళాల డిజిటల డ్రైవర్ డిస్ప్లేలను పొందుతుంది అని ధృవీకరించారు. ఈ SUV పనోరమిక్ సన్ؚరూఫ్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ؚలు, మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ؚలతో (TPMS) అందించబడుతుంది.
సంబంధించినవి: 2024 హ్యుందాయ్ క్రెటా: దీని కోసం వేచి ఉండాలా లేదా దీని పోటీదారులలో ఒకదానిని ఎంచుకోవాలా?
విస్తృతమైన పవర్ؚట్రెయిన్ؚల ఎంపిక
క్రెటా ఫేస్ؚలిఫ్ట్ ఈ క్రింది విధంగా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలు రెండిటితో వస్తుంది:
స్పెసిఫికేషన్ |
1.5-లీటర్ N.A. పెట్రోల్ |
1.5-లీటర్ టర్బో-పెట్రోల్ |
1.5-లీటర్ డీజిల్ |
పవర్ |
115 PS |
160 PS |
116 PS |
టార్క్ |
144 Nm |
253 Nm |
250 Nm |
ట్రాన్స్ؚమిషన్ |
6-స్పీడ్ MT, CVT |
7-స్పీడ్ DCT |
6-స్పీడ్ MT, 6-స్పీడ్ AT |
హ్యుందాయ్ కొత్త క్రెటాలో, వెర్నా 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ؚను తీసుకువచ్చింది, అయితే ఈ ఇంజన్ؚను వెర్నాలో ఉండే 6-స్పీడ్ల MT ఎంపికతో అందించదు. మిగిలిన రెండు పవర్ؚట్రెయిన్ ఎంపికలను ఎటువంటి మార్పు లేకుండా కొనసాగిస్తుంది.
కొత్త క్రెటా విడుదల మరియు ధర
జనవరి 16వ తేదీన విక్రయాలు ప్రారంభం కానున్న ఈ నవీకరించిన హ్యుందాయ్ క్రెటా ధర రూ. 11 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతుందని అంచనా. ఇది కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, స్కోడా కుషాక్, MG ఆస్టర్, వోక్స్వాగన్ టైగూన్ మరియు సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్ؚలతో పోటీ పడుతుంది.
ఇక్కడ మరింత చదవండి: క్రెటా ఆటోమ్యాటిక్
0 out of 0 found this helpful