హ్యుందాయ్ క్రేటా బ్రోచర్ వెలువడింది
హ్యుందాయ్ క్రెటా 2015-2020 కోసం అభిజీత్ ద్వార ా జూలై 20, 2015 04:52 pm సవరించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: క్రేటా విడుదలకు ముందు హ్యుండై పరికరాల పూర్తి వివరాలు కలిగిన దాని సమగ్ర బ్రోషర్ ని విడుదల చేసింది. ఎంతగానో ఎదురుచూస్తున్న వాహనం జూలై 21న, రేపు విడుదల కానుంది. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ రూ 8.5 నుండి 13.5 లక్షలు మధ్య ధరగా భావిస్తున్నారు. బ్రోషర్ యొక్క ప్రధాన ముఖ్యాంశాలు క్రింద పరిశీలన చేయండి.
ఇంజిన్
బ్రోషర్ అందడంతో, సంబంధిత ప్రత్యేకతలతో మోటార్ ఇప్పుడు ధ్రువీకరించబడింది.
- 1.6 లీటర్ సీఆర్డీఐ డీజిల్ ఉత్పత్తి శక్తి 127పీఎస్ మరియు 260ఎనెం టార్క్ గా ఉంది
- 1.4 డీజిల్ 220ఎనెం టార్క్ ని మరియూ 90పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది
- 1.6 లీటర్ వీటీవీటీ పెట్రోల్ 123పీఎస్ శక్తిని మరియు టార్క్ 151ఎనెం ని బయటకు విడుదల చేస్తుంది
వేరియంట్స్
బ్రోషర్ లో సూచించినట్లుగా, మొత్తం తొమ్మిది రకాలు ఉన్నాయి. 3 రకాలు,1.6 లీటర్ వీటీవీటీ పెట్రోల్ తో ,1.4 లీటర్ డీజిల్ తో మూడు మరియూ 1.6 లీటర్ డీజిల్ ఇంజినుతో మరో మూడు వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ వైవిధ్యాలను బేస్ నుండి ప్రారంభించి, ఎస్, ఎస్ +, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ + మరియు ఎస్ఎక్స్ (ఆప్షన్) అనే ఆరు వేర్వేరు ట్రిమ్ స్థాయిల్లో పొందవచ్చు.
భద్రత
క్రేటా విడుదల భారతదేశం భద్రత ఆధారాలకు ఒక క్రొత్త ప్రమాణం తీసుకుని వస్తుంది అని భావిస్తున్నారు. ఇది, ఏబీఎస్ ఈబీడీ వంటి ప్రాథమిక భద్రతా లక్షణాలతో పాటుగా, ప్రమాణంగా ఎయిర్బ్యాగ్స్ మరియూ అధిక రక్షణ కోసం ఆధునిక బీహైవ్ నిర్మాణాత్మక పటిమను జోడించారు. టాప్ ట్రిం లకి ఒక ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), వాహనం స్థిరత్వం నిర్వహణ (వీఎసెం) పంపబడతాయి ఉండగా, హిల్-స్టార్త్ అస్సిస్ట్ కంట్రోల్ (హెచేసీ) మరియు సైడ్ మరియు కర్టెయిన్ ఎయిర్బ్యాగ్స్ వంటివి ఉన్నాయి.
రంగు
హ్యుందాయ్ క్రేటా వివిధ రుచులకు సరిపోయేందుకు తగిన రంగులు అందిస్తుంది. అది మొత్తం ఏడు రంగులు అందిస్తోంది,పోలార్ తెలుపు, సొగసైన వెండి, మిస్టిక్ నీలం, ఎరుపు పాషన్, ఫాంటమ్ నలుపు, స్టార్ డస్ట్ మరియు పెర్ల్ లేత గోధుమరంగులలో లభ్యం. అంతేకాక, రెండు చక్రాల ఎంపికలు ఉన్నాయి, ఒక 16-అంగుళాల క్లీన్ సిల్వర్ 205/65 R16 టైర్లతో మరియు 17 అంగుళాల డైమండ్ కట్ 215/60 R17 టైర్లు తో వస్తున్నాయి.