• English
  • Login / Register

6 నెలల వెయిటింగ్ తో హ్యుండై క్రేటా యొక్క ఆటోమాటిక్ ని పొందవచ్చు

హ్యుందాయ్ క్రెటా 2015-2020 కోసం అభిజీత్ ద్వారా అక్టోబర్ 16, 2015 11:57 am ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

ఈమధ్యే హ్యుండై వారు వారి ఫేస్‌బుక్ పేజ్ లైక్స్ 6 మిలియన్ దాటాయని సమాచారం అందించారు. ఇప్పుడు వారి క్రేటా మారుతి ఎస్-క్రాస్, రెనాల్ట్ డస్టర్ మరియూ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వంటి వాటిని వెనక్కి నెట్టి ప్రాముఖ్యం సంపాదించింది అని అనడంలో అతిసయోక్తి లేదు. కానీ కొంచం అమ్మకాలు తక్కువ ఉండే ఆటోమాటిక్ వేరియంట్స్ యొక్క వెయిటింగ్ పీరియడ్ మాత్రము 6 నెలలు ఉంటుంది అని వినికిడి. 

మా మార్కెట్ అంచనాల ప్రకారం రోజు రోజుకి మాన్యువల్ కంటే ఆటోమాటిక్ అమ్మకాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ, క్రేటా అందమైన కారు మరియూ ఇతర కార్ల కంటే అధిక లక్షణాలను అందిస్తుండటంతో చేయవలసినదే హ్యుండై వారు చేశారు. 

ఒక నివేదిక ప్రకారం, ఎక్కువ శాతం క్రేటా వేరియంట్స్ డీజిల్ కంటే ఎక్కువగా పెట్రోల్ వేరియంట్సే ఉన్నాయి. పైగా, ఎక్కువ కస్టమర్లు ఉన్నత శ్రేణి  వేరియంట్స్‌నే కొనుగోలు చేశారు.  

పైగా, క్రేటా గురించే ఎక్కువ ఇతర పోటీదారులు డిస్కౌంట్లు అందిస్తున్నారు. మారుతీ వారు రూ.1 లక్ష వరకు ఆదా ని అందించారు. ఇదే రెనాల్ట్ వారు కూడా చేస్తున్నారు. ఈ విభాగం నుండే కాకుండా ఈ క్రేటా ఎక్స్‌యూవీ500 ఇంకా స్కార్పియన్ వినియోగదారులను సైతం ఆకర్షిస్తోంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Hyundai క్రెటా 2015-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience