• English
  • Login / Register

హ్యుందాయ్ ఆరా: మీరు ఏమి ఆశించవచ్చు?

హ్యుందాయ్ ఔరా 2020-2023 కోసం dhruv ద్వారా నవంబర్ 25, 2019 03:45 pm ప్రచురించబడింది

  • 34 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

 ఏ విధంగా అయితే ఎక్సెంట్ గ్రాండ్ i 10 పై ఆధారపడి ఉంటుందో, అదే విధంగా ఆరా గ్రాండ్ i10 నియోస్‌ పై ఆధారపడి ఉంటుంది

Hyundai Aura: What Can You Expect?

  •  ఆరా అనేది హ్యుందాయ్ యొక్క రాబోయే సబ్ -4 మీటర్ సెడాన్.
  •  ఇది ఎక్సెంట్‌కు మరింత ప్రీమియం భర్తీ అవుతుంది.
  •  ఆరా యొక్క ఫ్రంట్ ఎండ్ గ్రాండ్ i10 నియోస్‌కు ప్రతిబింబిస్తుందని మేము ఆశిస్తున్నాము.
  •  దీని ఇంటీరియర్, అలాగే ఫీచర్ జాబితా నియోస్‌ తో సమానంగా ఉంటుంది.
  •  ఇది గ్రాండ్ i10 నియోస్ మాదిరిగానే ఇంజిన్‌లను పొందుతుంది.
  •  దీని ధర రూ .6 నుంచి రూ .9 లక్షల బ్రాకెట్‌లో ఉంటుందని ఆశిస్తున్నాము.

హ్యుందాయ్ తన కొత్త సబ్ -4 మీటర్ సెడాన్‌ ను ఆరా అని పిలుస్తుందని ఇటీవల వెల్లడించింది. ఇది ఎక్సెంట్ వారసుడిగా ఉంటుంది. కాబట్టి హ్యుందాయ్ సెడాన్ పేరును మాత్రమే మార్చిందా లేదా ఆరా సరికొత్త వాహనంగా ఉంటుందా? మీరు ఆశించేది ఇక్కడ ఉంది.

అన్నిటికంటే ముందుగా, ఆరా హ్యుందాయ్ లైనప్‌ లో కొత్త వాహనంగా ఉంటుంది, అంటే ఎక్సెంట్ దానితో పాటు అమ్మకం కొనసాగుతుంది. అయితే, ఈ రెండింటి మధ్య పోలికలు ఉండవని కాదు. హ్యుందాయ్ గ్రాండ్ i10 మరియు గ్రాండ్ i10 నియోస్‌ తో చేసిన విధంగా వీటితో కూడా చేస్తోంది. ఎక్సెంట్ తక్కువ-ప్రీమియం సెడాన్ అవుతుంది మరియు ఫ్లీట్ ఆపరేటర్ల కోసం ఎక్కువగా అమ్మకానికి ఉంటుంది. ఆరా సెడాన్ యొక్క మరింత ప్రీమియం వెర్షన్ మరియు వ్యక్తిగత కార్ల కొనుగోలుదారులకు ఉపయోగపడుతుంది.

డిజైన్ 

Hyundai Aura: What Can You Expect?

చిత్రం: గ్రాండ్ i10 నియోస్

డిజైన్ పరంగా, ఆరా యొక్క ఫ్రంట్ ఎండ్  గ్రాండ్ i10 నియోస్‌ ను పోలి ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఫ్రంట్ గ్రిల్ మరియు కొంతవరకు, బంపర్‌ల ఆకృతిని నియోస్ నుండి నేరుగా తీసుకున్నవే అని భావిస్తున్నాము. ప్రక్క భాగానికి వస్తే, ఎక్సెంట్ మాదిరీగా కనిపిస్తుంది, వెనుక భాగం సరికొత్త డిజైన్ ని కలిగి ఉంటుంది. ఆరా గతంలో టెస్టింగ్ అవుతుండగా మా కంటపడింది మరియు కవరింగ్ తో ఉన్న టెస్ట్ మ్యూల్ నుండి టెయిల్ లాంప్స్ స్ప్లిట్ సెటప్ తో ఉన్నాయని మేము భావిస్తున్నాము.

పవర్ట్రెయిన్

పవర్‌ట్రెయిన్ ఫ్రంట్‌ లో, హ్యుందాయ్ నియోస్ మాదిరిగానే 1.2 ఇంజిన్ల పెట్రోల్ (83Ps / 114Nm) మరియు డీజిల్ ఇంజన్లు (75Ps / 190Nm) అందించాలి. నియోస్‌ తో చేసినట్లే, హ్యుందాయ్ పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్‌లకు మాన్యువల్ కౌంటర్ పార్ట్ లతో పాటు AMT ట్రాన్స్మిషన్ ని అందిస్తుందని మేము ఆశిస్తున్నాము. ఆరా ప్రారంభించిన రెండు ఇంజన్లు BS6 కంప్లైంట్ అయ్యి ఉండాలి.

లక్షణాలు

Hyundai Aura: What Can You Expect?

చిత్రం: హ్యుందాయ్ ఎక్సెంట్

ఆరా తన హ్యాచ్‌బ్యాక్ కౌంటర్, గ్రాండ్ i10 నియోస్ నుండి ఫీచర్లను తీసుకుంటుందని భావిస్తున్నాము. ఇంటీరియర్ కోసం డ్యూయల్ టోన్ లేఅవుట్ కాకుండా, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ మరియు నియోస్ నుండి వెనుక AC వెంట్లను కూడా షేర్ చేసుకుంటుందని మేము ఆశిస్తున్నాము. 

ధర

ఆరా ఆటో ఎక్స్‌పో 2020 లో విక్రయించబడుతుందని భావిస్తున్నాము. హ్యుందాయ్ ధర రూ .6 లక్షల నుంచి రూ .9 లక్షల మధ్య ఉంటుందని మేము భావిస్తున్నాము. లాంచ్ అయిన తర్వాత, ఇది మారుతి సుజుకి డిజైర్, ఫోర్డ్ ఆస్పైర్, హోండా అమేజ్, టాటా టిగోర్ మరియు వోక్స్వ్యాగన్ అమియో వంటి వాటితో పోటీపడుతుంది. 

was this article helpful ?

Write your Comment on Hyundai ఔరా 2020-2023

1 వ్యాఖ్య
1
M
m s nadiger
Nov 23, 2019, 3:36:58 PM

Waiting for best comp sedan car from Hyundai.I am interested in ds car for purchase in first time.

Read More...
    సమాధానం
    Write a Reply

    ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience