• English
    • Login / Register

    హ్యుందాయ్ ఆరా vs మారుతి డిజైర్: ఏ సబ్ -4m సెడాన్ కొనాలి?

    హ్యుందాయ్ ఔరా 2020-2023 కోసం dinesh ద్వారా జనవరి 27, 2020 03:11 pm ప్రచురించబడింది

    • 43 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    ఈ ఆరా సెగ్మెంట్ లీడర్ తో పోటీ పడగలదా? పదండి కనుక్కుందాము

    Hyundai Aura vs Maruti Dzire: Which Sub-4m Sedan To Buy?

     ఆరా రూ .7.80 లక్షల (ఎక్స్-షోరూమ్ ఇండియా) ప్రారంభ ధర వద్ద ప్రారంభించబడి, ఎక్సెంట్ వారసుడిగా భారతదేశంలో అత్యంత పోటీతత్వ సబ్  -4m సెడాన్ విభాగంలోకి ప్రవేశించింది. ఈ విభాగంలో ముందున్న మారుతి డిజైర్ నెలవారీ అమ్మకాల సంఖ్య 19K యూనిట్లు. ఈ కొత్త ఆరాకు సెగ్మెంట్ లీడర్ ని ఓడించే సత్తా ఉందా? ఆ పోలిక ఇక్కడ చూద్దాము.   

    కొలతలు:

     

    హ్యుందాయ్ ఆరా

    మారుతి డిజైర్

    తేడా

    పొడవు

    3995mm

    3995mm

    Nil

    వెడల్పు

    1680mm

    1735mm

    +55mm (డిజైర్ వెడల్పైనది)

    ఎత్తు

    1520mm

    1515mm

    +5mm (ఆరా పొడవైనది

    వీల్బేస్

    2450mm

    2450mm

    Nil

    బూట్ స్పేస్

    402L

    378L

    +24L (ఆరా ఎక్కువ స్పేస్ ని కలిగి ఉంది)

    రెండు కార్లు పొడవు మరియు వీల్‌బేస్ పరంగా ఒకేలా ఉంటాయి. ఏదేమైనా, వెడల్పు మరియు ఎత్తు విషయానికి వస్తే, డిజైర్ మరియు ఆరా వరుసగా ముందంజలో ఉన్నాయి. బూట్ స్పేస్ పరంగా, ఆరా మారుతి డిజైర్ కంటే ఎక్కువ ఉన్నట్టు స్పస్టంగా కనిపిస్తుంది.   

    ఇంజిన్స్:

    పెట్రోల్:

     

    హ్యుందాయ్ ఆరా

    మారుతి డిజైర్

    ఇంజిన్

    1.2-లీటర్

    1.0-లీటర్ టర్బో పెట్రోల్

    1.2-లీటర్

    ఎమిషన్

    BS6

    BS6

    BS6

    పవర్

    83PS

    100PS

    83PS

    టార్క్

    113Nm

    172Nm

    113Nm

    ట్రాన్స్మిషన్

    5-స్పీడ్ MT/AMT

    5-స్పీడ్ MT

    5-స్పీడ్ MT/AMT

    ఫ్యుయల్ ఎకానమీ

    20.50kmpl/20.10kmpl

    20.50kmpl

    21.21kmpl/21.21kmpl

    •  ఆరా మనకి రెండు పెట్రోల్ ఇంజన్లతో అందుబాటులో ఉంది. మరోవైపు, డిజైర్‌ ఒకే పెట్రోల్ యూనిట్‌తో మాత్రమే అందించబడుతుంది. 
    •  1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్లు ఒకేలాంటి పవర్ మరియు టార్క్ అవుట్‌పుట్‌లను అందిస్తున్నాయి మరియు ఇవి 5-స్పీడ్ MT లేదా 5-స్పీడ్ AMT తో వస్తాయి. 
    •  అయితే, ఫ్యుయల్ ఎకానమీ విషయానికి వస్తే, మారుతి ఆరా యొక్క 20.50 కిలోమీటర్లతో పోల్చి చూస్తే 21.21 కిలోమీటర్లతో స్వల్ప ఆధిక్యంలో ఉంది.  
    •  ఆరా యొక్క 1.0-లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్ ఇక్కడ అత్యంత శక్తివంతమైన ఇంజిన్. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో లభిస్తుంది మరియు ఫ్యుయల్ ఎకానమీ 20.50 కిలోమీటర్లు ఉంది.   
    •  ఆరా యొక్క 1.0-లీటర్ టర్బో యూనిట్ యొక్క FE ఫిగర్ దాని 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌తో సమానంగా ఉంటుంది.   

    డీజిల్:

     

    హ్యుందాయి ఆరా

    మారుతి డిజైర్

    ఇంజిన్

    1.2-లీటర్

    1.3-లీటర్

    ఎమిషన్

    BS6

    BS4

    పవర్

    75PS

    75PS

    టార్క్

    190Nm

    190Nm

    ట్రాన్స్మిషన్

    5MT/AMT

    5-speed MT/AMT

    ఫ్యుయల్ ఎకానమీ

    25.35kmpl/25.40kmpl

    28.40kmpl/28.40kmpl

    •  ఆరా BS 6 డీజిల్ ఇంజన్ తో లభిస్తుండగా, డిజైర్ BS4 యూనిట్‌ తో లభిస్తుంది.
    •  వేర్వేరు సామర్థ్యాలు ఉన్నప్పటికీ, ఈ రెండు ఇంజన్లు ఒకే పవర్ ని మరియు టార్క్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంటాయి.   
    •  ఈ రెండు ఇంజన్లు 5-స్పీడ్ MT తో పాటు 5-స్పీడ్ AMT కి జతచేయబడతాయి.
    •  ఫ్యుయల్ ఎకానమీ విషయానికి వస్తే, డిజైర్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లతో ఆరా కంటే చాలా పొదుపుగా ఉంటుంది. 
    •  మారుతి డిజైర్ డీజిల్ 2020 మార్చి 31 వరకు అమ్మకానికి ఉంటుందని గమనించాలి, ఎందుకంటే కార్ల తయారీసంస్థ తన డీజిల్ కార్లన్నింటినీ ఏప్రిల్ 2020 నుండి నిలిపివేయడానికి సిద్ధంగా ఉంది.  

    వివరణాత్మక పెట్రోల్ ధరలు:

    హ్యుందాయి ఆరా

    మారుతి డిజైర్

    E- రూ. 5.80 లక్షలు

    LXI- రూ. 5.82 లక్షలు

    S- రూ. 6.56 లక్షలు

    VXI- రూ. 6.73 లక్షలు

    SX- రూ. 7.30 లక్షలు

    ZXI- రూ. 7.32 లక్షలు

    SX(O)- రూ. 7.86 లక్షలు

    ZXI+ రూ. 8.21 లక్షలు

    SX+ MT(1.0-లీటర్ టర్బో)- రూ. 8.55 లక్షలు

     

     

     

    S AMT- రూ. 7.06 లక్షలు

    VXI AGS- రూ. 7.20 లక్షలు

    SX+ AMT- రూ. 8.05 లక్షలు

    ZXI AGS- రూ. 7.79 లక్షలు

     

    ZXI+ AGS- రూ. 8.68 లక్షలు

    పెట్రోల్ వేరియంట్లు పోలిక:

    Maruti Dzire vs Honda Amaze vs Ford Aspire

    హ్యుందాయ్ ఆరా E vs మారుతి డిజైర్ LXI

    హ్యుందాయి ఆరా E

    రూ. 5.80 లక్షలు

    మారుతి డిజైర్ LXI

    రూ. 5.82 లక్షలు

    తేడా

    రూ. 2,000 (డిజైర్ చాలా ఖరీదైనది)

    సాధారణ లక్షణాలు: బాడీ కలర్ బంపర్స్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఎబిడి తో ఇబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్, మాన్యువల్ AC, టిల్ట్-అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ మరియు రూఫ్ యాంటెన్నా వంటి లక్షణాలు ఉన్నాయి.

    ఆరా E డిజైర్ LXI పై ఏమి అందిస్తుంది:  అడ్జస్టబుల్ వెనుక హెడ్‌రెస్ట్‌లు, అడ్జస్టబుల్ ఫ్రంట్ హెడ్‌రెస్ట్, ఫ్రంట్ పవర్ విండోస్, కూల్డ్ గ్లోవ్ బాక్స్ మరియు ఇంటర్నల్లీ అడ్జస్టబుల్ ORVM లు అందించబడతాయి.      

    ఆరా E పై డిజైర్ LXI ఏమిటి అందిస్తుంది:    ఏమిలేదు.

    తీర్పు: దాదాపు ఒకేలాంటి ధరల వద్ద, ఆరా డిజైర్ కంటే ఎక్కువ ఫీచర్లను అందిస్తుంది, ఇది బేస్-స్పెక్ మారుతి పై మరింత సరైన ఎంపికగా ఉంటుంది.   

     Hyundai Aura vs Maruti Dzire: Which Sub-4m Sedan To Buy?

    హ్యుందాయ్ ఆరా S vs మారుతి డిజైర్ VXI

    హ్యుందాయి ఆరా S

    రూ. 6.56 లక్షలు

    మారుతి డిజైర్ VXI

    రూ. 6.73 లక్షలు

    వ్యత్యాశం

    రూ. 26,000 (డిజైర్ మరింత ఖరీదైనది)

    సాధారణ లక్షణాలు (మునుపటి వేరియంట్ల కంటే):

    బాడీ-కలర్ ORVM లు, బాడీ-కలర్ డోర్ హ్యాండిల్స్, వీల్ కవర్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, డే / నైట్ IRVM, బ్లూటూత్ మరియు స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్‌తో 2-DIN మ్యూజిక్ సిస్టమ్, సెంట్రల్ లాకింగ్, కీలెస్ ఎంట్రీ, రియర్ AC వెంట్స్, రియర్ సెంటర్ కప్ హోల్డర్, ఫ్రంట్ మరియు రియర్ పవర్ విండోస్, ఎలక్ట్రికల్లీ-అడ్జస్టబుల్ ORVM లు, హైట్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు మరియు అడ్జస్టబుల్  ఫ్రంట్ హెడ్‌రెస్ట్‌ తో ఆర్మ్‌రెస్ట్.  

    డిజైర్ VXI పై ఆరా S ఏమి అందిస్తుంది:

    ఫ్రంట్ ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్, వెనుక డీఫాగర్ మరియు LED DRLలు.

    ఆరా S పై డిజైర్ VXI ఏమి అందిస్తుంది: యాంటీ తెఫ్ట్ వ్యవస్థ.

    తీర్పు: ఆరా మా ఎంపికగా కొనసాగుతునే ఉంది. ఇది మరింత తక్కువ ఖరీదైనప్పటికీ, డిజైర్ కంటే ఎక్కువ ఫీచర్లను అందిస్తుంది.   

    •  టాటా టిగోర్ ఫేస్‌లిఫ్ట్ రూ .5.75 లక్షల వద్ద ప్రారంభమైంది  

    హ్యుందాయ్ ఆరా SX vs మారుతి డిజైర్ ZXI:

    హ్యుందాయి ఆరా SX

    రూ. 7.30 లక్షలు

    మారుతి డిజైర్ ZXI

    రూ. 7.32 లక్షలు

    తేడా

    రూ. 2,000 (డిజైర్ చాలా ఖరీదైనది)

    సాధారణ లక్షణాలు (మునుపటి వేరియంట్ల మీద):

    15- ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ ఫాగ్ లాంప్స్, రియర్ డీఫాగర్, పుష్-బటన్ స్టార్ట్ మరియు ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ ORVM లు.

    ఆరా SX డిజైర్ ZXI పై ఏమిటి అందిస్తుంది:   ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, రివర్స్ పార్కింగ్ కెమెరా మరియు LED DRL లతో 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి లక్షణాలను అందిస్తుంది.

    ఆరా SX పై డిజైర్ ZXI ఏమిటి అందిస్తుంది:   ఆటో AC, లెథర్ చుట్టబడిన స్టీరింగ్ వీల్ మరియు యాంటీ తెఫ్ట్ సిస్టమ్ వంటి లక్షణాలు అందిస్తుంది.

    తీర్పు: ఇక్కడ మనకి కొంచెం క్లోజ్ కాల్ అని చెప్పవచ్చు. అయినప్పటికీ, డిజైర్ లో ఆరా కంటే ఆటోమేటిక్ AC లభిస్తుందని మేము మీకు డిజైర్ ని సూచిస్తాము. ఇది ఆరా పొందే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు పార్కింగ్ కెమెరాను కోల్పోతుంది, కానీ దానిని తరువాత మార్కెట్ లో పొందవచ్చు. అయితే, ఆరా లో మిస్ అయిన ఆటో AC ని ఒక ఆక్సిసరీగా చేర్చడం కూడా సాధ్యం కాదు, ఇది డిజైర్‌ను మరింత మంచి ఎంపికగా చేస్తుంది.    

    హ్యుందాయ్ ఆరా SX (O) vs మారుతి డిజైర్ ZXI +:       

    హ్యుందాయ్ ఆరా SX(O)

    రూ. 7.86 లక్షలు

    మారుతి డిజైర్ ZXI+

    రూ. 8.21 లక్షలు

    తేడా

    రూ. 35,000 (డిజైర్ చాలా ఖరీదైనది)

    సాధారణ లక్షణాలు (మునుపటి వేరియంట్ల మీద): ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పార్కింగ్ కెమెరా, ఆటో AC, LED DRL లు మరియు లెథర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ వంటి లక్షణాలు ఉన్నాయి.

    డిజైర్ ZXI + పై ఆరా SX (O) ఏమిటి అందిస్తుంది:   క్రూయిజ్ నియంత్రణ మరియు వైర్‌లెస్ మొబైల్ ఛార్జింగ్.

    ఆరా SX (O) పై డిజైర్ ZXI + ఏమిటి అందిస్తుంది:   ఆటోమెటిక్ LED హెడ్‌ల్యాంప్‌లు.

    తీర్పు: ఆరా ఇక్కడ మా ఎంపిక. ఇది LED హెడ్‌ల్యాంప్‌లను కోల్పోతుంది, అయితే ఇది డిజైర్ కంటే రూ .35,000 తక్కువ ఖర్చవుతుంది. అలాగే, హ్యుందాయ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు వైర్‌లెస్ మొబైల్ ఛార్జింగ్ వంటి ప్రీమియం ఫీచర్లను పొందుతుంది, ఇది మారుతి కోల్పోతుంది.  

    Maruti Dzire

    పెట్రోల్ ఆటోమేటిక్: 

    హ్యుందాయ్ ఆరా S AMT vs మారుతి డిజైర్ VXI AGS:

    హ్యుందాయ్ ఆరా S AMT

    రూ. 7.06 లక్షలు

    మారుతి డిజైర్ VXI AGS

    రూ. 7.20 లక్షలు

    తేడా

    రూ. 14,000 (డిజైర్ చాలా ఖరీదైనది)

    సాధారణ లక్షణాలు: బాడీ కలర్ బంపర్స్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, EBD తో ABS, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, ఫ్రంట్ సీట్‌బెల్ట్ రిమైండర్, మాన్యువల్ AC, టిల్ట్-అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, రూఫ్ యాంటెన్నా, బాడీ కలర్డ్ ORVM లు, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, డే / నైట్ IRVM, బ్లూటూత్ మరియు స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్‌తో 2-DIN మ్యూజిక్ సిస్టమ్, సెంట్రల్ లాకింగ్, కీలెస్ ఎంట్రీ, రియర్ ఎసి వెంట్స్, కప్ హోల్డర్‌తో రియర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, ఫ్రంట్ అండ్ రియర్ పవర్ విండోస్, ఎలక్ట్రికల్ -అడ్జస్టబుల్ ORVM లు, హైట్-అడ్జస్టబుల్  డ్రైవర్ సీటు మరియు అడ్జస్టబుల్ ఫ్రంట్ హెడ్‌రెస్ట్ వంటి లక్షణాలు ఉన్నాయి.     

    డిజైర్ VXI AGS మీద ఆరా S AMT ఏమిటి అందిస్తుంది:

    ఫ్రంట్ ప్రొజెక్టర్ ఫాగ్ లాంప్స్, రియర్ డీఫాగర్, 15-ఇంచ్ స్టీల్ వీల్స్, ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ ORVM లు మరియు LED DRL లు.

    ఆరా S AMT మీద డిజైర్ VXI AGS ఏమిటి అందిస్తుంది: యాంటీ తెఫ్ట్ వ్యవస్థ మరియు వీల్ కవర్లు.

    తీర్పు: ఆరా ఇప్పటికీ మా ఎంపికగా కొనసాగుతోంది. ఇది మరింత సరసమైనప్పటికీ, ఇది డిజైర్ కంటే పూర్తి ప్యాకేజీగా వస్తుంది.  

    Hyundai Aura vs Maruti Dzire: Which Sub-4m Sedan To Buy?

    హ్యుందాయ్ ఆరా SX + AMT vs మారుతి డిజైర్ ZXI AGS: 

    హ్యుందాయ్ ఆరా SX+ AMT

    రూ. 8.05 లక్షలు

    మారుతి డిజైర్ ZXI AGS

    రూ. 7.79 లక్షలు

    తేడా

    రూ. 26,000 (ఆరా చాలా ఖరీదైనది)

    సాధారణ లక్షణాలు (మునుపటి వేరియంట్ల మీద): 15-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ ఫాగ్ లాంప్స్, ఆటో AC, రియర్ డీఫాగర్, పుష్-బటన్ స్టార్ట్ మరియు ఎలక్ట్రికల్-ఫోల్డబుల్ ORVM లు వంటి లక్షణాలు అందించబడతాయి.  

    డిజైర్ ZXI AGS పై ఆరా SX + AMT ఏమిటి అందిస్తుంది:   ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో లతో 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు మరియు LED DRL లు.   

    ఆరా SX + AMT పై డిజైర్ ZXI AGS ఏమిటి అందిస్తుంది:   లెథర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ మరియు యాంటీ తెఫ్ట్ వ్యవస్థ

    తీర్పు:

    ఆరా ఇక్కడ మా ఎంపికగా ఉంది. ఇది ఖచ్చితంగా డిజైర్ కంటే ఖరీదైనది, కాని చెప్పిన ప్రీమియం కోసం అది పొందే అదనపు లక్షణాలు సమర్థించబడుతున్నాయి.   

    ఇది కూడా చదవండి: హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ త్వరలో ఆరా లాగా టర్బో పెట్రోల్ వేరియంట్ ని పొందనున్నది

    మరింత చదవండి: ఆరా AMT

    was this article helpful ?

    Write your Comment on Hyundai ఔరా 2020-2023

    1 వ్యాఖ్య
    1
    A
    allenki srikanth
    Jan 24, 2020, 9:34:30 AM

    Launched price mentioned here is wrong(i.e., Launched at a starting price of Rs 7.80 lakh (ex-showroom India), the Aura enters the highly competitive sub-4m sedan segment in India). Please correct.

    Read More...
      సమాధానం
      Write a Reply

      ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

      • లేటెస్ట్
      • రాబోయేవి
      • పాపులర్
      ×
      We need your సిటీ to customize your experience