హ్యుండై వారు ణ్ 2015 విజన్ జీటీ కాన్సెప్ట్ ని ఆవిష్కరించడానికి రంగం సిద్దం అయ్యింది, ఫోటోలతో ఊరిస్తున్నారు
ఆగష్టు 28, 2015 12:13 pm nabeel ద్వారా ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
హ్యుండై వారి సబ్ బ్రాండ్ అయిన 'N'ని వచ్చే ఫ్రాంక్ఫర్ట్ మోటర్ షో లో ప్రదర్శించేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటి వరకు ప్రపంచ ర్యాలీ చాంపియన్షిప్ లో ఎక్కువగా పాల్గొనే ఈ కారు ఇప్పుడు హ్యుండై వారి భవిష్యత్ కాన్సెప్ట్ రంగం లో ఈ సెప్టెంబర్ ఫ్రాంక్ఫర్ట్ మోటర్ షో లో ముఖ్య పాత్ర పోషించనుంది.
కస్టమర్లను ఊరిస్తూ, హ్యుండై వారు వారి న్ 2025 విజన్ గ్రాన్ ట్యురిస్మో కాన్సెప్ట్ యొక్క ఫోటోలను విడుదల చేశారు. స్థిరత్వానికి ఈ కారు మారు పేరుగా నిలువనుంది. స్థిరమైన అనే పదానికి నిర్వచనంగా ఈ కారు ప్రత్యామ్నాయ ఇంధన మరియూ హైబ్రీడ్ టెక్నాలజీ కలిగి ఉంది. ఈ హ్యుండై న్ 2025 విజన్ గ్రాన్ ట్యూరిస్మో కాన్సెప్ట్ ప్రత్యేకంగా ప్లేస్టేషన్ గ్రాన్ మరియూ ట్యూరిస్మో రేసింగ్ గేం సీరీస్ లో లభ్యం అవుతుంది. ఈ కారు భవిష్యత్ ప్రామాణికమైన ఏరోడైనమిక్ బాడీ డిజైన్ తో ఏంగులర్ ల్యాంప్స్ మరియూ హ్యుండై లోగో ముందు వైపు ఉంటాయి. తెరతో ఉన్నప్పటికీ, ఈ కారు భవిష్యత్తు నుండి తీసుకు వచ్చినటువంటిది గా అనిపిస్తుంది.
2025 విజన్ గ్రాన్ ట్యూరిస్మో తో పాటుగా, ఇంకో దక్షిణ కొరియా కారు కూడా తేలిక పాటి కార్బన్ ఫైబర్-రీఎంఫోర్స్డ్, మిడ్-ఇంజిను, 2.0-లీటర్-300పీఎస్ ఆరెం15 ర్యాలీ కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఇది ఏప్రిల్ మాసంలోని సియోల్ మోటర్ షో లో మొదటి సారిగా ప్రదర్శితమైంది. పైగా, ఈ తయారిదారి వచ్చే ఏడాది డబ్ల్యూఆర్సీ లో ప్రదర్శించబడే తరువతి తరం హ్యుండై ఐ20 యొక్క నమూనాత్మక మోడల్ ని ప్రదర్శించబోతున్నారు. ప్రస్తుతానికి ఈ కారు భారీ పరీక్షల నడుమ తయారవుతోంది. ఇది 2016 ఎఫైఏ ప్రపంచ ర్యాలీ చాంపియన్షిప్ లోని ర్యాలే మాంటే కార్లో లో ప్రదర్శింపబడుతుంది.