గ్రాండ్ i10 నియోస్ؚకు కొత్త మిడ్-స్పెక్ వేరియంట్ؚను జోడించిన హ్యుందాయ్
హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ కోసం ansh ద్వారా మార్చి 13, 2023 10:56 am ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
సరికొత్త స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ కేవలం ఒకే ఒక్క తేడాతో స్పోర్ట్జ్ వేరియంట్ కంటే దిగువ స్థానంలో ఉంటుంది.
-
హ్యుందాయ్ గ్రాండ్ i10 కొత్త స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌లో వస్తుంది.
-
ఇది మధ్య శ్రేణి మాగ్నా మరియు స్పోర్ట్జ్ వేరియంట్‌ల మధ్యలో ఉంటుంది.
-
సరికొత్త వేరియంట్ ధర సంబంధిత స్పోర్ట్జ్ వేరియంట్‌లతో పోలిస్తే రూ.3500 తక్కువ ఉంటుంది.
-
గ్రాండ్ i10 నియోస్ 83PS పవర్, 114Nm టార్క్‌ను అందిస్తూ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో వస్తుంది.
-
ఈ హ్యాచ్ؚబ్యాక్ శ్రేణి ధర రూ.5.69 లక్షల నుండి రూ.8.46 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
గ్రాండ్ i10 నియోస్ నవీకరించబడిన వెర్షన్ విడుదల తరువాత, హ్యుందాయ్ తన వేరియంట్ లైన్అప్ؚకు తేలికపాటి మార్పులు చేసింది. మిడ్-స్పెక్ మాగ్నా మరియు హ్యాచ్ؚబ్యాక్ స్పోర్ట్జ్ వేరియంట్‌ల మధ్య స్థానంలో ఉండేలా కొత్త ‘స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్’ వేరియంట్ؚను పరిచయం చేసింది.
ధర
వేరియంట్ |
స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ |
స్పోర్ట్జ్ |
తేడా |
MT |
రూ. 7.16 లక్షలు |
రూ. 7.20 లక్షలు |
-రూ. 3,500 |
AMT |
రూ. 7.70 లక్షలు |
రూ. 7.74 లక్షలు |
-రూ. 3,500 |
వాటి సంబంధిత స్పోర్ట్జ్ మాన్యువల్ మరియు AMT వేరియంట్‌లతో పోలిస్తే స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ ధర రూ.3,500 తక్కువ. ఇందులో CNG, డ్యూయల్ టోన్ ఎంపికలు ఉండవు, ఇవి స్పోర్ట్జ్ వేరియంట్‌లలో అందించబడుతుంది.
ఫీచర్ తేడా
సరికొత్త స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌లో లేని ఒకే ఒక ఫీచర్ ఆటో క్లైమేట్ కంట్రోల్, దీని బదులుగా మాన్యువల్ AC ఉంటుంది. రెండు వేరియంట్‌లలో మిగిలిన ఫీచర్‌లు ఒకేలా ఉంటాయి. రెండిటిలో అండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లేలతో ఎనిమిది-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్ సిస్టమ్, వెనుక AC వెంట్‌లు, క్రూజ్ కంట్రోల్, నాలుగు ఎయిర్ బ్యాగ్ؚలు (ఆరు ఎయిర్ బ్యాగ్ؚలను టాప్ వేరియంట్ؚకు మాత్రమే పరిమితం చేశారు), EDBతో ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC|) మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఉన్నాయి.
ఇది కూడా చదవండి: కొత్త 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఆల్కజార్ వేరియంట్ؚల ధరలు వెల్లడించిన హ్యుందాయ్
పవర్ؚట్రెయిన్
గ్రాండ్ i10 నియోస్ 83PS/114Nm పవర్ మరియు టార్క్‌ను అందించే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో వస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚ లేదా 5-స్పీడ్ AMTతో జత చేయబడుతుంది. CNG వేరియంట్‌లు 69PS, 95.2Nm పవర్ మరియు టార్క్‌ను అందించే అవుట్ؚపుట్ؚతో అదే ఇంజన్ వస్తుంది. దీన్ని కేవలం 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ؚతో మాత్రమే జత చేశారు. అయితే, సరికొత్త స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌లలో CNG ఎంపిక ఉండదు.
పోటీదారులు
రూ.5.69 లక్షలు మరియు రూ.8.46 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ధరతో, హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ మారుతి స్విఫ్ట్, రెనాల్ట్ ట్రైబర్ؚలతో పోటీ పడుతుంది.
ఇది కూడా చదవండి: 490 కిమీ మీలేజ్ అందించగల రెండవ-జనరేషన్ హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ వెల్లడించబడింది
ఇక్కడ మరింత చదవండి: గ్రాండ్ i10 నియోస్ AMT