Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

ఎట్టకేలకు పేరు పొందిన హోండా కొత్త కాంపాక్ట్ SUV

హోండా ఎలివేట్ కోసం rohit ద్వారా మే 04, 2023 04:19 pm ప్రచురించబడింది

సుమారు ఆరు సంవత్సరాల తర్వాత భారతదేశంలో హోండా ప్రవేశపెడుతున్న మొదటి సరికొత్త మోడల్ ఎలివేట్, ఇది హోండా లైనప్ؚలో సిటీ కంటేపై స్థానంలో ఉంటుంది

  • హోండా, ఎలివేట్ؚను త్వరలోనే ఆవిష్కరించనుంది, ఆగస్ట్ నాటికి దీని విడుదలను ఆశించవచ్చు.

  • కొన్ని డీలర్ؚషిప్ؚలు ఇప్పటికే ఈ SUV బుకింగ్ؚలను అంగీకరిస్తున్నారు.

  • ఎక్స్ؚటీరియర్ ముఖ్యాంశాలలో కనెక్టెడ్ LED టెయిల్ లైట్‌లు, భారీ గ్రిల్ మరియు భారీ వీల్ ఆర్చ్ؚలు ఉన్నాయి.

  • వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, భారీ టచ్ؚస్క్రీన్ మరియు ADASతో రావచ్చు.

  • బలమైన-హైబ్రిడ్ సెట్అప్ؚతో పాటు, సిటీ నుండి రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలను పొందవచ్చు.

  • ప్రారంభ ధర రూ. 11 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా.

కాంపాక్ట్ SUV విభాగంలోకి మరొక కొత్త జోడింపును చూడవచ్చు మరియు దీని పేరు హోండా ఎలివేట్ؚగా ఇటీవలే ధృవీకరించారు. దీని వివరాలు ప్రస్తుతానికి వెల్లడించనప్పటికి, కొన్ని డీలర్ؚషిప్ؚలు ఇప్పటికీ రానున్న ఈ SUV బుకింగ్ؚలను అంగీకరిస్తున్నారు.

ఎలివేట్, గత ఆరు సంవత్సరాలలో భారతదేశంలో హోండా ప్రవేశపెడుతున్న మొదటి సరికొత్త మోడల్. ఈ వాహనాన్ని మొదట భారతదేశంలో విడుదల చేస్తారు, తరువాత ప్రపంచ వ్యాప్తంగా విక్రయిస్తారు. “ఎలివేట్” నేమ్ ప్లేట్‌తో, ఈ కారు తయారీదారు ఎంతో కాలం నుండి కొనసాగిస్తున్న Vతో(ఉదాహరణకు CR-V, WR-V, మరియు BR-V) ముగిసే పేరు ఇంతటితో ముగింపు పలికారు. కొన్ని ఎలక్ట్రిఫైడ్ మోడల్‌లతో సహా, ఇది కొత్త తరం హోండా మోడల్‌లకు ప్రారంభం కావచ్చు.

కొత్త టీజర్ వివరాలు

హోండా కార్ ఇండియా, SUVపై “ఎలివేట్” బ్యాడ్జింగ్‌ను చూపిస్తూ కొత్త సోషల్ మీడియా పోస్ట్‌ను చేసింది. పేరును మినహహించి మరే ఇతర వివరాలు కనిపించకపోయిన, ఇది SUV కనెక్టెడ్ LED టెయిల్ లైట్‌లను చూపించింది.

ఇది కూడా చదవండి: భారతదేశంలో ఒక దశాబ్దాన్ని పూర్తి చేసిన హోండా అమేజ్: దీని ముఖ్యమైన గణాంకాలను చూడండి

ఇప్పటివరకు తెలిసింది ఏమిటి?

ఈ కారు తయారీదారు ఇంతకు ముందు పంచుకున్న ఎలివేట్ SUV టీజర్‌లో ఈ వాహన ఆకాహారంతో పాటుగా LED హెడ్‌లైట్‌లు, DRLలు మరియు LED ఫాగ్ ల్యాంపులను చూపించింది. ఈ SUV మునుపటి రహస్య చిత్రాలు కూడా భారీ వీల్ ఆర్చ్ؚలను, రూఫ్ రెయిల్స్ మరియు పెద్ద గ్రిల్ؚను ప్రదర్శించాయి.

ఆశించదగిన ఫీచర్‌లు

సిటీలో ఉన్న 8-అంగుళాల యూనిట్ؚతో పోలిస్తే ఎలివేట్ SUVలో భారీ టచ్ؚస్క్రీన్, సింగిల్-పెన్ సన్‌రూఫ్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు ఉంటాయని అంచనా.

ప్రయాణీకుల భద్రత కోసం ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, మరియు 360-డిగ్రీల కెమెరా ఉంటాయి. అనేక అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ؚలను (ADAS) ఇది అందిస్తుంది అని అంచనా.

డీజిల్ పవర్ లేదు

సిటీ విధంగానే, ఎలివేట్ SUV కూడా కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే అందిస్తున్నారు. సిటీలో ఉన్న స్వరూప 1.5-లీటర్ నేచురల్లీ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది, ఇది 6-స్పీడ్‌ల మాన్యువల్ మరియు CVT ఆటోమ్యాటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో జోడించబడుతుంది. హోండా కాంపాక్ట్ SUV సిటీ హైబ్రిడ్ బలమైన-హైబ్రిడ్ పవర్ؚట్రెయిన్ؚతో (126PS కంబైన్డ్) రావచ్చు.

ఇది కూడా చదవండి: ఆధునిక బ్రేక్-ఇన్ పద్ధతుల గురించి ఉన్న అపోహలు మరియు పద్దతులను విస్మరించడం

ధర మరియు పోటీ

ఎలివేట్ ధరను హోండా రూ.11 లక్షల వద్ద ప్రారంభిస్తుందని (ఎక్స్-షోరూమ్) అంచనా మరియు ఇది ఆగస్ట్ నాటికి విడుదల అవ్వచ్చు. ఈ SUV MG ఆస్టర్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హ్యుందాయ్ క్రెటా, వోక్స్వాగన్ టైగూన్, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్ మరియు స్కోడా కుషాక్ؚలతో పోటీ పడుతుంది.

r
ద్వారా ప్రచురించబడినది

rohit

  • 53 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన హోండా ఎలివేట్

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర