Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

హోండా WR-V: మిస్ అయినవి ఏమిటి

హోండా డబ్ల్యుఆర్-వి 2017-2020 కోసం raunak ద్వారా మార్చి 27, 2019 12:34 pm ప్రచురించబడింది

మేము దీనిని ఎత్తి చూపడం లేదు, కానీ ఈ లక్షణాలతో కలిగి ఉన్న హోండా WR-V, ఇదే ధర పరిధిలో ఉన్న ఇతర క్రాసోవర్లను మరియు ఇదే సంస్థ నుండి వచ్చిన ఇతర కార్లతో పోల్చి చూస్తే కొన్ని అంశాలను మిస్ అయ్యింది. వచ్చేవారం మార్చి 16 న హోండా దీనిని ప్రారంభించనున్నది. దీని ధర రూ .7 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

దీని ప్రత్యర్థుల గురించి మాట్లాడుకుంటే, ఇదే ధర పరిధిలో చాలా కార్లు ఉన్నాయి(సబ్-4m SUV మరియు క్రాస్-హ్యాచులు రెండూ), అవి ఎకోస్పోర్ట్, విటారా బ్రెజ్జా, TUV300, న్యువోస్పోర్ట్, క్రాస్ పోలో, అర్బన్ క్రాస్ / అవవెంచురా, ఎటియోస్ క్రాస్, మరియు i20 యాక్టివ్. WR-V లో మిస్ అయిన అంశాలు చూద్దాం.

మరింత శక్తివంతమైన పెట్రోల్ ఇంజిన్

WR-V యొక్క 1.2 లీటర్ జాజ్-డిరైవెడ్ పెట్రోల్ ఇంజిన్ ఔత్సాహికులకు మరింత అంశాలని కావాలనుకొనేలా చేస్తుంది. సిటీ లో తిప్పుకొనేందుకు ఎలాంటి సమస్య ఉండదు, కానీ హైవే లో మాత్రం అంత ఉత్తేజకరంగా ఉండదు. ఈ కారు ఆధారంగా ఉన్న పెట్రోల్ జాజ్ అదే సమస్యను ఎదుర్కొంటుంది. కానీ WR-V అనేది ఈ సమస్యను ఇంకా పెంచుతుంది, ఎందుకంటే, ఇది హాచ్ తో పోలిస్తే 62 కిలోల బరువుతో ఉంటుంది.

ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ ఇంజన్ డిస్ప్లేస్మెంట్ సబ్-4m కారులో 1.2 లీటర్స్ కంటే పెంచినట్లయితే టాక్స్ లు పెరుగుతాయి తద్వారా ధర కూడా పెరుగుతుంది. ఇదిలా చెప్పగా ఉదాహరణకు ఎకోస్పోర్ట్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది మరియు ఇది కూడా సబ్-4m కారు. టయోటా ఎతియోస్ క్రాస్ కూడా సబ్-4m కారు మరియు ఇది 1.5 లీటర్ పెట్రోల్ మోటర్ తో వస్తుంది మరియు ఫియాట్ కూడా (1.4 లీటర్ టర్బో మోటర్) అదే విధంగా అందిస్తుంది. ఏది ఏమైనప్పటికీ జాజ్ వలే భారతదేశం నుండి ఎగుమతి చేయబడినట్టు హోండా కూడా సులభంగా WR-V లో 1.5 లీటర్ పెట్రోల్ మోటార్ ఇవ్వవచ్చు.

ఆటోమెటిక్ ఆప్షన్ లేదు

దాని తోబుట్టువుల మాదిరిగా కాకుండా, WR-V అనేది దేశంలోనే మొబిలియో తో (ఉత్పత్తి నిలిపివేయబడింది) పాటూ దాని పెట్రోల్ మోటర్ తో ఆటోమాటిక్ వేరియంట్ ను అందించనని హోండా యొక్క ఏకైక కారు. ఈ రోజుల్లో వినియోగదారులు ఆటొమెటిక్ ఆప్షన్ ని కొనడానికి బాగా ఇష్టపడుతున్నారు, కాబట్టి హోండా ఈ ఆప్షన్ ని మిస్ అవ్వకుండా ఉంటే బాగుండేది.

హోండా జాజ్ యొక్క మేజిక్ సీట్స్

WR-V యొక్క ప్యాకేజీలో అతిపెద్ద లోటులో ఈ లక్షణం ఒకటి. హోండా జాజ్ లా కాకుండా, WR-V దాని ప్రఖ్యాతమైన మేజిక్ సీట్లుని కలిగి లేదు. బ్రెజిలియన్ వెర్షన్ యొక్క కాంపాక్ట్ క్రాస్ఓవర్ లో ఇవ్వబడిన మేజిక్ సీట్లు, దీనిలో కూడా అందించి ఉంటే ఇంకా బాగా అందంగా ఉంటూ, హోండా యొక్క ఒక 'స్పోర్టి లైఫ్ స్టయిల్ వెహికెల్ (SLV)' అనే పదానికి ఇంకా మంచి అర్ధాన్ని ఇచ్చేది. దాని సౌకర్యవంతమైన మేజిక్ సీట్లు కలిగిన హోండా జాజ్ సైకిల్ తో సహా పలు రకాల సామానులను తీసుకుని వెళ్ళే విధంగా ఉంటుంది! బాధాకరం ఏమిటంటే హోండా సంస్థ భారతదేశంలో మేజిక్ సీట్లు ఇవ్వలేదు.

గ్రౌండప్ డిజైన్ కలిగి లేదు

చెప్పాలంటే హోండా సంస్థ WR-V ని జాజ్ కంటే భిన్నంగా ఉంచేందుకు ఒక మంచి పనే చేసింది. కానీ ఇప్పటికీ కూడా ఒక హ్యాచ్‌బ్యాక్ లా కొన్ని కొన్ని కోణాలలో కనిపిస్తుంది, ముఖ్యంగా ప్రక్క భాగం నుండి. కానీ అది అంత చెడ్డ పని అయితే కాదు మరియు డిజైన్ అనేది ఒక అంతుపట్టనటువంటిది, అనగా ఎంత చేసినా కూడా ఇంకా బాగా చేయాలనిపించే విషయం. కానీ చాలా మంది వినియోగదారులు గ్రౌండ్ అప్ డిజైన్ ఉన్న ఫోర్డ్ ఎకోస్పోర్ట్ లాంటి కార్లని ఇష్టపడతారు. ఇక్కడ తెలియని విషయం ఏమిటంటే, ఎకోస్పోర్ట్ పూర్తిగా ఫియస్టా(ఇప్పుడు భారతదేశంలో నిలిపివేయబడింది) మీద ఆధారపడి ఉంటుంది, కానీ ఒక్క బాడీ ప్యానెల్ కూడా అక్కడ నుండి తీసుకోవడం జరగలేదు. ఇంకా చెప్పాలంటే ఎకోస్పోర్ట్ దాని యొక్క లోపాలను కూడా ఫియస్టా తో పంచుకుంటుంది.

దాని తోబుట్టువుల వంటి స్పాయిలర్ లేదు

స్పాయిలర్స్ అనేవి ఖచ్చితంగా హోండా యొక్క వస్తువులు, దాని మొదటి తరం హోండా సిటీ నుండి పెద్ద హోండా జాజ్ వరకూ ప్రతీ కారులోని కలిగి ఉన్నాయి. ఫేస్లిఫ్ట్ బ్రియో లో కూడా కొత్త స్పాయిలర్ ని కలిగి ఉంది మరియు ఫేస్లిఫ్ట్ 2017 హోండా సిటీ లో కూడా అదే విధంగా ఉంది. దురదృష్టవశాత్తు WR-V ఒక స్పాయిలర్ ని అందించడం లేదు; అయితే, హోండా ఇది ఒక అదనపు ఆప్షన్ గా అందిస్తుంది. కానీ పైన చెప్పిన టాప్ మోడల్స్ అన్నిటిలో స్పాయిలర్ ప్రామాణికంగా అందించడం జరుగుతుంది.

డీజిల్ ప్రత్యర్ధులతో పోలిస్తే పెట్రోల్ వేరియంట్ లక్షణాలు తక్కువ

WR-V కేవలం రెండు వేరియంట్ లతో మాత్రమే లభ్యమవుతుండటంతో, డీజిల్ ట్రిమ్ తో పోలిస్తే పెట్రోల్ యొక్క టాప్ వెర్షన్స్ లో అన్ని లక్షణాలు లేవు.నిజానికి పెట్రోల్ మరియు డీజిల్ యొక్క టాప్-ఎండ్ వెర్షన్స్ పోల్చి చూస్తే గనుక, డీజిల్ దే పై చెయ్యి. పెట్రోల్ టాప్-స్పెక్ మోడల్ లో క్రూయిజ్ కంట్రోల్, మరియు ఇంజిన్ స్టార్ట్ స్టాప్ తో పాసివ్ కీలెజ్ ఎంట్రీ వంటి లక్షణాలను కలిగి లేదు.

r
ద్వారా ప్రచురించబడినది

raunak

  • 19 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన హోండా WRV 2017-2020

S
sunil soni
Nov 7, 2019, 10:26:53 PM

is honda wrv going to discontinue

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఎలక్ట్రిక్
Rs.6.99 - 9.24 లక్షలు*
Rs.5.65 - 8.90 లక్షలు*
Rs.7.04 - 11.21 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర