Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

హోండా WRV డీజిల్ vs హ్యుందాయ్ i20 యాక్టివ్ డీజిల్ - రియల్ వరల్డ్ పెర్ఫామెన్స్ & మైలేజ్ పోలిక

మార్చి 27, 2019 01:23 pm khan mohd. ద్వారా ప్రచురించబడింది
14 Views

హోండా WR-V మరియు హ్యుందాయ్ i20 యాక్టివ్ ఒక విషయాన్ని కామన్ గా పంచుకుంటున్నాయి. అది ఏమిటంటే రెండు క్రాసోవర్స్ కూడా వాటి కజిన్స్ అయిన జాజ్ మరియు ఎలైట్ i20 మీద ఆధారపడి ఉంటాయి. హోండా SUV లుక్ తో ఉంటుంది, దాని యొక్క ఎత్తైన బోనెట్, ఫ్లాట్ నోస్ మరియు మందపాటి క్రోమ్ గ్రిల్ BR-V నుండి ప్రేరణ పొందినట్లు కనిపిస్తాయి. ఇదిలా ఉండగా హ్యుందాయి రూఫ్ రెయిల్స్ మరియు ప్లాస్టిక్ క్లాడింగ్లతో ఒక జాజెడ్ -అప్ హాచ్బ్యాక్ లా కనిపిస్తుంది. అందువలన, వాస్తవ ప్రపంచంలో ఏ రెండూ మెరుగైన పనితీరు మరియు మంచి సామర్ధ్యాన్ని అందిస్తాయి?మా రహదారి పరీక్షల ఫలితాలు ఇక్కడ ఉన్నాయి.

ఆక్సిలరేషన్

హోండా WR-V యొక్క డీజిల్ వేరియంట్స్1.5 లీటర్, 4 సిలిండర్ i-DTEC ఇంజన్ తో శక్తిని కలిగి ఉన్నాయి, ఇది 100PS పవర్ మరియు 200Nm గరిష్ట టార్క్లను ఉత్పత్తి చేస్తుంది, ఇది హ్యుందాయ్ కంటే 10PS పవర్ ఎక్కువ మరియు 20Nm టార్క్ లో తక్కువ. ఈ రెండిటి మధ్య, హోండా త్వరితంగా ఉంటుంది. హోండా అనేది 100kmph మార్క్ ని 12.43 సెకెండ్స్ లో వెళుతుంది మరియు i20 ఆక్టివ్ అయితే 100kmph మార్క్ ని 13.3 సెకెండ్స్ లో అందుకుంటుంది. ఈ రెండిటిలో చూస్తే హోండా వేగవంతమైనది.

i20 యాక్టివ్ యొక్క అధిక టార్క్, ట్రాఫిక్ అంతరాలను సులభతరం చేయటానికి సహాయపడుతుంది, ఇది నగరంలో నడపడానికి మెరుగైన కారుగా ఉంటుంది. అయితే హోండా సంస్థ అంత స్పీడ్ ని స్థిరంగా ఉంచడానికి చాలా కష్టపడుతుంది, దీనికి కారాణం ఏమిటంటే దీనిలో గేర్లు చాలా పొడవుగా ఉంటాయి, దీనివలన స్పీడ్ అందుకోవడం కొంచెం టైం పడుతుంది. i20 ఆక్టివ్ కి చిన్నపాటి గేర్ రేషియోస్ ఉండడం వలన WR-V కన్నా మెరుగైన ఇంధన సామర్ధ్యపు గణాంకాలను అందిస్తుంది. హైవే మీద అయితే మాత్రం WR-V యొక్క పొడవైన గేరింగ్ వలన మంచి మైలేజ్ గణాంకాలు అందిస్తూ హ్యుందాయ్ ని ఓడిస్తుంది.

బ్రేకింగ్

హోండా WR-V కూడా బ్రేకింగ్ పరీక్షలలో i20 యాక్టివ్ ను ఢీ కొడుతుంది. 100 నుండి -0 Kmph బ్రేకింగ్ వేయగా, హోండా తక్కువ దూరం (41.90 మీటర్లు) ముందుకు వెళ్ళి ఆగగా, హ్యుందాయి i20 యాక్టివ్ 4.97 మీటర్లు హ్యుందాయి కంటే ఎక్కువ ముందుకు వెళ్ళి ఆగుతుంది. అయితే, మేము పరిశీలించిన i20 ఆక్టివ్ 40,000km పైగా తిరిగిన బండి కనుక దాని బ్రేక్లు పలచబడి పోయి ఉంటాయని అభిప్రాయపడుతున్నాము. అందువల్ల పైన చెప్పిన ఆ ఫిగర్ అనేది ఈ కారు యొక్క అసలైన బ్రేకింగ్ పనితీరు కాకపోవచ్చు. రికార్డు కోసం, రెండు కార్లు వెంటిలేటెడ్ ఫ్రంట్ డిస్క్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) తో ఫ్రంట్ డిస్క్ లు మరియు వెనుక డ్రమ్ బ్రేక్లు మరియు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ను (అన్ని వేరియంట్స్ లో ప్రామాణికం) గా పొందుతున్నాయి.

రియల్-వరల్డ్ ఇంధన సామర్ధ్యం పోలిక

సంస్థ ప్రకటించిన మైలేజ్ గణాంకాల ప్రకారం, హోండా WR-V యొక్క డీజిల్ వెర్షన్ 25.5kmpl ఇవ్వగా, హ్యుందాయి i20 అయితే 21.19kmpl మైలేజ్ అందిస్తుంది. తక్కువ గేర్ నిష్పత్తులు మరియు అధిక టార్క్ కారణంగా, i20 యాక్టివ్ సిటీ ప్రాంతంలో 16.36kmpl అందించగా, హోండా 15.35kmpl అందిస్తుంది. మేము ముందు చెప్పినట్లుగా, హోండా యొక్క పొడవైన గేరింగ్ 25.88kmpl మైలేజ్ అందించగా, i20 ఆక్టివ్ 23.8kmpl మైలేజ్ అందిస్తుంది.

ఈ గణాంకాల పరంగా చూసుకుంటే హ్యుందాయి i20 ఆక్టివ్ ఎవరైతే కొనుగోలుదారులు సిటీ లో కారుని ఎక్కువ వాడాలనుకుంటారో వారికి ఇది మంచి ఎంపిక. అదే హైవే మీద ఎక్కువగా వెళ్ళేందుకు కారు ని ఉపయోగించాలనుకుంటే వారికి WR-V మంచి ఎంపిక. ఇదిలా చెప్పినప్పటికీ మేము నిర్వహించిన టెస్ట్ లలో రెండు కార్లు ఒకదానితో ఒకటి బాగా ఓడించలేకపొయినా ఒకదానిలో ఒకటి ఎక్కువ, ఇంకోదానిలో ఇంకొకటి ఎక్కువ ఉంది.

ధరలు(డీజిల్ వేరియంట్లవి మాత్రమే)

హోండా WRV

హ్యుందాయ్ i20 యాక్టివ్

S - రూ 8.82 లక్షలు

S - రూ. 9.02 లక్షలు

SX - రూ. 9.83 లక్షలు

VX - రూ. 10 లక్షలు

SX డ్యూయల్ టోన్ - రూ. 10.07 లక్షలు

అన్ని ధరలు ఎక్స్ షోరూం ఢిల్లీ

Share via

Write your Comment on Honda డబ్ల్యుఆర్-వి 2017-2020

explore similar కార్లు

హోండా డబ్ల్యుఆర్-వి 2017-2020

4.3422 సమీక్షలుకారు ని రేట్ చేయండి
హోండా డబ్ల్యుఆర్-వి 2017-2020 ఐఎస్ discontinued మరియు కాదు longer produced.
పెట్రోల్17.5 kmpl
డీజిల్25.5 kmpl

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్

4.6213 సమీక్షలుకారు ని రేట్ చేయండి
హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ ఐఎస్ discontinued మరియు కాదు longer produced.
పెట్రోల్17.19 kmpl
డీజిల్21.19 kmpl

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
Rs.6.23 - 10.19 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.4.70 - 6.45 లక్షలు*
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.7 - 9.84 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.3.25 - 4.49 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర