• English
  • Login / Register

హోండా జాజ్ వేరియంట్లు: మీరు కొనుగోలు చేసుకొనేందుకు ఉత్తమమైనది తెసుకోండి

హోండా జాజ్ 2014-2020 కోసం manish ద్వారా డిసెంబర్ 09, 2015 05:53 pm ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

Honda Jazz

పరిచయం తరువాత ఈ హోండా జాజ్ , ఒక మెరుపుతో ప్రీమియం హాచ్బాక్ విభాగంలోకి అడుగు పెట్టింది. ఈ విభాగంలో అనేక ప్రముఖ లక్షణాలతో వచ్చిన ఈ వాహనం, విమర్శనాత్మక మరియు వినియోగదారుల ప్రసంశలను పొందింది. ఈ వాహనం, బ్రాండ్ యొక్క కొత్త డీజిల్ ఇంజన్ తో వచ్చింది. ఈ డీజిల్ ఇంజన్ అత్యధికంగా, 100 పి ఎస్ పవర్ ను విడుదల చేస్తుంది. మరోవైపు ఇదే ఇంజన్, అధికంగా 27 కె ఎం పి ఎల్ గల మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. 1.5 లీటర్ ఐ- డి టెక్ డీజిల్ ఇంజన్, 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. దీని యొక్క మునుపటి వెర్షన్, 72% మార్కెట్ స్థానికీకరణ, నిర్వహించేది అదే ఈ కొత్త జాజ్ అయితే, 95% స్థానికీకరణ నిర్వహించి దీని ద్వారా, ఒక స్పష్టమైన ధర ట్యాగ్ తో వచ్చింది.

Honda Jazz interior

కాబట్టి, మీరు జాజ్ వాహనం యొక్క ఒక ఉత్తమ వాహనాన్ని ఎంచుకోవడం లో సహాయపడటం కోసం అనేక అంశాలను కలిగిన జాబితా ను మీ కోసం అందించాము. ఈ జాబితా ను తనిఖీ చేసి ఒక ఉత్తమ వేరియంట్ ను ఎంచుకోండి.  

ఈ వేరియంట్:

ధర (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ): రూపాయలు 5.4 లక్షల నుండి

మీరు బేరం తో తక్కువ ధర వద్ద ఒక ప్రీమియం హ్యాచ్బ్యాక్ పనితీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే, అప్పుడు ఈ వాహనం మీకు సరైనది. స్పోర్టి సొగసైన హెడ్ల్యాంప్ మరియు ఎల్ ఈ డి టైల్ ల్యాంప్లు వంటివి ఈ వాహనానికి ప్రామాణికంగా అందించబడతాయి.

  • నలుపు ముందు గ్రిల్ 
  • R14 పరిమాణం గల టైర్లు 
  • నలుపు డోర్ హ్యాండిల్ 
  • ముందు సెంటర్ యాంటెన్నా 
  • నీలం ప్రకాశం తో కూడిన ప్రామాణిక బహుళ సమాచారం కాంబిమీటర్ 
  • ఇంధన వినియోగం ప్రదర్శన / హెచ్చరిక 
  • టాకోమీటర్ 
  • సింగిల్ ట్రిప్ మీటర్ 
  • బ్లాక్ గేర్ నాబ్ ఫినిషింగ్ 
  • సిల్వర్ తో కూడిన లోపలి డోర్ హ్యాండిల్స్ 
  • డీజిల్ వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉండే ఏబిఎస్ తో ఈబిడి

ఎస్ వేరియంట్:

ధర (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ): రూపాయలు. 6.0 లక్షల నుండి

ఒక ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో నగర ట్రాఫిక్ ను ఓత్తిడి లేకుండా ఓడించాలి అనుకుంటున్నారా అయితే ఈ ప్రీమియం హ్యాచ్బ్యాక్ మీకు సరైన వాహనం మాత్రమే కాదు ఒక ఉల్లాసవంతమైన అనుభూతిని కూడా ఇస్తుంది.

  • క్రోమ్ చేరికలతో కూడిన అధిక నలుపు వివరణ గ్రిల్ 
  • R15 పరిమాణం గల టైర్లు 
  • ట్రిం వీల్ ప్రామాణికం
  • కారు శరీర రంగు లో ఉండే డోర్ హ్యాండిల్ 
  • సి వి టి 
  • సిల్వర్ ఫినిషింగ్ గేర్ నాబ్ 
  • ముందు కన్సోల్ లో సిల్వర్ ఫినిషింగ్
  • 3 అంగుళాల డిస్ప్లే తో ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్ 
  • హ్యాండ్స్ -ఫ్రీ టెలిఫోన్ కనెక్టివిటీ


ఎస్ వి వేరియంట్:

ధర (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ): రూపాయలు. 6.5 లక్షల నుండి

ఎవరైతే అన్ని లక్షణాలను కలిగిన వాహనాన్ని ఎంచుకోవాలి అనుకుంటున్నారో, ఈ ప్రీమియం హాచ్బాక్ విభాగంలో ఈ వేరియంట్ సరైన వాహనం అని చెప్పవచ్చు.

  • వెనుక మైక్రో యాంటెన్నా 
  • ఎల్ సి డి ప్రదర్శన మరియు నీలం బ్యాక్లైట్ తో కూడిన ఆధునిక బహుళ సమాచార కాంబీ మీటర్ 
  • కాంబీమీటర్ పై యాంబియంట్ రింగ్స్ తో ఈకో అసిస్ట్ వ్యవస్థ
  • తక్షణ ఇంధన ప్రదర్శన 
  • ద్వంద్వ ట్రిప్ మీటర్ 
  • 5 అంగుళాల డిస్ప్లే ను కలిగిన ఆధునిక ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్ 
  • ద్వంద్వ-ముందు ఎయిర్బ్యాగ్స్ 
  • ఏబిఎస్ తో ఈ బి డి ప్రామాణికం 
  • బహుళ వీక్షణ పార్కింగ్ కెమెరా


వి వేరియంట్:

ధర (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ): 6.9 లక్షల నుండి

ఎవరికైతే, ఆటోమేటిక్ వేరియంట్ తో పాటు అనేక సౌకర్య లక్షణాలను కలిగిన కారు ను ఎంచుకోవాలి అనుకుంటారో, వారికి ఇది సరైన వాహనం.

  • అల్లాయ్ వీల్స్ ప్రామాణికం 
  • వెనుక వైపర్ మరియు వాషర్లు ప్రామాణికం 
  • వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ ల పై టర్న్ సూచికలు 
  • బయట ఉష్ణోగ్రత ప్రదర్శన 
  • సివిటి 
  • లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ 
  • నిగనిగలాడే వెండి తో కూడిన డోర్ హ్యాండిల్స్


వి ఎక్స్ వేరియంట్:

ధర (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ): రూపాయలు. 7.4 లక్షల నుండి

ఎవరికైతే, ప్రీమియం హ్యాచ్బ్యాక్ విభాగంలో అందించబడతాయో ఒక శక్తివంతమైన ఇంజిన్ మరియు విలాసవంతమైన అంతర్గత భాగాలు కావాలి అనుకుంటారో వారికి ఇది సరైన వాహనం అని చెప్పవచ్చు.  

  • ముందు మరియు వెనుక మడ్ గార్డ్లు 
  • 6.2 అంగుళాల టచ్స్క్రీన్ నావిగేషన్ సిస్టమ్ 
  • డివిడి ప్లేయర్ 
  • ఆన్ బోర్డు నేవిగేషన్ వ్యవస్థ 
  • వెనుక సర్దుబాటు మేజిక్ సీట్లు 
  • 60:40 మడత సౌకర్యాన్ని కలిగిన వెనుక సీటు

ఇవి కూడా చదవండి:

was this article helpful ?

Write your Comment on Honda జాజ్ 2014-2020

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience