జాజ్ ను జైపూర్ లో రూ. 5.40 లక్షల వద్ద ప్రారంభించిన హోండా
హోండా జాజ్ 2014-2020 కోసం raunak ద్వారా జూలై 16, 2015 10:34 am సవరించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: హోండా లో మూడవ తరం జాజ్ ను జైపూర్ లో రూ. 5.40 లక్షల (ఎక్స్-షోరూమ్, జైపూర్) వద్ద ప్రారంబించారు. ఈ హోండా జాజ్ పేరు వినగానే హార్ట్ గుర్తుకొస్తుంది. ఇది డీజిల్ ఇంజన్ తో అందుబాటులో ఉంది. అంతేకాక, ఇది అనేక విభాగాలలో, టచ్ స్క్రీన్, నావిగేషన్, సివిటి తో పాటు స్టీరింగ్ వీల్ పెడల్ షిఫ్టర్స్ వంటి మొదటి లక్షణాలను అందిస్తుంది. అంతేకాకుండా ఈ జాజ్, వాటి ప్రత్యర్ధులైన హ్యుందాయ్ ఎలైట్ ఐ 20, ఫియాట్ పుంటో ఈవివో మరియు వోక్స్వాగన్ పోలో వంటి వాహనాలతో గట్టి పోటీ ను ఇవ్వడానికి సిద్దంగా ఉంది.
హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ప్రెసిడెంట్ డైరెక్టర్ అయిన మిస్టర్ రామన్ కుమార్ శర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ, "కొత్త జాజ్ యొక్క అన్ని అంశాలు స్టైలింగ్, పాండిత్యము, ప్యాకేజింగ్ మరియు పనితీరు అన్ని వినియోగదారులకి ఒక విలువను అందిస్తుంది. జాజ్ వినియోగదారులకు కావలసిన హేతుబద్ధమైన అలాగే ఆకాంక్షించిన అంశాలు రెండింటీని కూడా దీనిలో అందిస్తున్నాము ఇవి వారి నమ్మకాన్ని నిలబెడతాయని మేము గట్టిగా నమ్ముతున్నాము. ఈ కొత్త జాజ్ తమ వ్యాపారానికి ఒక మూలస్తంభంగా ఉంటుందఅని మరియు భారతదేశం లో హోండా కార్స్ అభివృద్ధిని పెంచడంలో ముఖ్య పాత్ర వహిస్తుందని" ఆయన వాఖ్యానించారు.
ఈ హాచ్బాక్ మూడు ట్రాన్స్మిషన్ ఎంపికలు తో పాటు రెండు ఇంజిన్ ఎంపికలు తో వస్తుంది. ఒకటి 1.2 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్, ఇది అత్యధికంగా 90 PS పవర్ ను మరియు 110 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్, 5- స్పీడ్ మాన్యువల్ లేదా సివిటి విత్ పెడల్ షిఫ్టర్స్ తో జత చేయబడి ఉంటుంది. రెండవది అమేజ్ మరియు సిటీ లో ఉండే 1.5 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, 100 PS పవర్ ను మరియు 200 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది, అంతేకాకుండా ఈ ఇంజన్, 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది.
Variant | Jaipur Ex-showroom prices |
E MT Petrol | Rs. 540,500 |
S MT Petrol | Rs. 605,100 |
SV MT Petrol | Rs. 656,000 |
V MT Petrol | Rs. 693,000 |
S CVT Petrol | Rs. 710,100 |
VX MT Petrol | Rs. 742,100 |
V CVT Petrol | Rs. 798,100 |
Variant | Jaipur Ex-showroom prices |
E MT Diesel | Rs. 665,000 |
S MT Diesel | Rs. 730,600 |
SV MT Diesel | Rs. 781,500 |
V MT Diesel | Rs. 828,500 |
VX MT Diesel | Rs. 877,600 |