బ్రెజిల్ వీదుల్లో మొదటిసారిగా పట్టుబడిన హోండా జాజ్ క్రాస్ఓవర్
హోండా జాజ్ 2014-2020 కోసం manish ద్వారా డిసెంబర్ 15, 2015 03:37 pm ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్ :
క్రాస్ ఓవర్ హాచ్బాక్ లు, ప్రాధమిక హాచ్బాక్ కంటే నవీకరణం పొంది ఈ మద్య ప్రాచుర్యంలోకి వచ్చాయి. దీనికి గల ప్రధాన కారణం వీటిని అందించే లక్షణాలలో ఉంది. ఇవి ప్రత్యేకమయిన గ్రౌండ్ క్లియరెన్స్ ని కలిగి ఉండి భారతదేశం లోని రోడ్ పరిస్థితులని అధిగమించేలా ఉన్నటువంటి ప్రీమియర్ హాచ్బాక్ సౌకర్యవంతమయిన లక్షణాలు కలిగి ఉంది. ప్రీమియం హ్యాచ్బ్యాక్ అయినటువంటి హోండా జాజ్ క్రాస్ ఓవర్ మార్కెట్లోకి తుఫానులాగా రాబోతుంది మరియు మొదటిసారి రహస్యంగా కనిపించింది. 2016 సంవత్సరంలో హోండా జాజ్ క్రాస్ఓవర్ నమూనా బ్రెజిల్ వీధుల్లో రౌండ్స్ తిరుగుతూ రహస్యంగా కనిపించింది.
ఇది' హోండా జాజ్ ట్విస్ట్'అనే పేరుతో ప్రాచుర్యంలోకి రాబోతోంది. ఈ మునుపటి తరం క్రాస్ఓవర్ కి బ్రెజిలియన్ మార్కెట్లో ప్రత్యేకమయిన స్థానం ఉన్నప్పటికీ భారత మార్కెట్లో హోండా జాజ్ కి ఉన్న ప్రజాదరణ పరంగా ఈ కారు భారతదేశం లోకి కుడా రాబోతోంది. ఈ పరీక్ష మ్యూల్ భారీగా కవరుతో కప్పబడి ఉన్నప్పటికీ దీనియొక్క బిగ్గర్ అల్లాయ్ చక్రాలు ,పునఃరూపకల్పన చేయబడిన పటిష్టమైన బంపర్, అండర్ బాడీ క్లాడింగ్ మరియు స్కిడ్ ప్లేట్లు తో ఆకర్షణీయంగా కనిపించింది.
ఈ కారు యొక్క ఇంజిన్ ఆప్షన్స్ మరియు లోపలి భాగాల ఆప్షన్స్ ఇంతకు ముందు లాగానే ఉంటాయి. భారతదేశంలో హోండా జాజ్ 1.5 లీటర్ i-DTECడీజిల్ యూనిట్, తో వస్తుంది. ఇది సిటీ సెడాన్ నుండి ఉద్భవించింది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ తో జత కలిసి వస్తుంది. దీనియొక్క పవర్-ప్లాంట్ 100PS శక్తిని మరియు 200 Nm టార్క్ ని , 27.3 kmpl ఇందన సామర్ధ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీని పెట్రోల్ వేరియాంట్ 1.2-లీటర్ పెట్రోలు యూనిట్ తో అందుబాటులో ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఒక CVT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో పెడల్ షిఫ్టర్స్ తో అందుబాటులో ఉంది .
ఇది కుడా చదవండి: