• English
  • Login / Register

హైదారాబాద్‌లో 1 రోజులో 100 ఎలివేట్ SUVలను డెలివరీ చేసిన Honda

హోండా ఎలివేట్ కోసం tarun ద్వారా సెప్టెంబర్ 12, 2023 05:52 pm ప్రచురించబడింది

  • 58 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ మోడల్ ప్రాముఖ్యతను సూచిస్తూ, తమ హోండా ఎలివేట్ SUVలను ఒకేసారి 100 మంది కస్టమర్‌లకు అందించడానికి హోండా ఒక మెగా ఈవెంట్ؚను నిర్వహించింది

Honda Elevate

  • హైదరాబాద్ؚలో జరిగిన ఒక మెగా ఈవెంట్ؚలో ఒకే రోజు 100 ఎలివేట్ SUVలు డెలివర్ చేసిన హోండా.

  • భారతదేశంలోని ప్రధాన నగరాలలో ఇలాంటి మెగా డెలివరీ ఈవెంట్ؚలు మరిన్ని నిర్వహించనున్నారు. 

  • మాన్యువల్ మరియు CVT ట్రాన్స్‌మిషన్ؚలతో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. 

  • ఎలక్ట్రిక్ సన్ؚరూఫ్, 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్ మరియు సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేలను పొందింది. 

  • ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, వెనుక కెమెరా మరియు ADASలతో భద్రతను మెరుగుపరచారు. 

  • ధరలు రూ.11 లక్షల నుండి రూ.16 లక్షల పరిధిలో (ఎక్స్-షోరూమ్) ఉంది.

ధరలను ప్రకటించిన రోజు నుండి హోండా ఎలివేట్ డెలివరీలు దేశవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభం అయ్యాయి. మోడల్ؚ గురించి ప్రచారం చేయడానికి మరియు మొదటి కొనుగోలుదారులను ప్రశంసించడానికి, హోండా హైదారాబాద్ؚలో ఒక మెగా డెలివరీ ఈవెంట్‌ను నిర్వహించింది మరియు ఇందులో భాగంగా 100 ఎలెవెట్ SUVలను డెలివరీ చేసింది. ఇటువంటి మరిన్ని డెలివరీ ఈవెంట్ؚలను దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలలో నిర్వహించడానికి ప్రణాళికలను కలిగి ఉంది.

ఎలివేట్ పవర్ؚట్రెయిన్

Honda Elevate

1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ హోండా ఎలివేట్‌కు శక్తిని అందిస్తుంది, ఇది 121PS పవర్ మరియు 145Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ భాద్యతలను 6-స్పీడ్ మాన్యువల్ మరియు CVT ఎంపికలు నిర్వహిస్తాయి. ఆటోమ్యాటిక్ వేరియెంట్‌లు, సంబంధిత మాన్యువల్ వేరియెంట్‌లతో పోలిస్తే రూ 1.1 లక్షల ఎక్కువ ధరను కలిగి ఉన్నాయి. దీని తోటి సెడాన్ వాహనం అయిన హోండా సిటీలో ఉన్న హైబ్రిడ్ ఎంపిక ఇందులో లేదు

ఫీచర్‌ల సారాంశం

Honda Elevate Interior

ఎలక్ట్రిక్ సన్ؚరూఫ్, 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్ؚలెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లే, 7-అంగుళాల సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్ؚలెస్ ఛార్జింగ్ మరియు 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్‌తో హోండా ఎలివేట్ క్యాబిన్ మరింత మెరుగ్గా కనిపిస్తుంది. 

భద్రత విషయానికి వస్తే ఆరు ఎయిర్ؚబ్యాగ్ؚలు, రేర్ పార్కింగ్ కెమెరా, లేన్-వాచ్ కెమెరా, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్ؚలు మరియు ADAS (అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: హోండా ఎలివేట్ SUV వేరియెంట్ؚల వివరణ: మీరు దేన్ని కొనుగోలు చేయాలి?

ధర & పోటీదారులు

Honda Elevate

SUV ప్రారంభ ధరలు రూ.11 లక్షల నుండి రూ.16 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, వోక్స్వాగన్ టైగూన్, సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్, స్కోడా కుషాక్ మరియు MG ఆస్టర్లు హోండా ఎలివేట్ؚకు గట్టి పోటీ ఇస్తాయి.

ఇక్కడ మరింత చదవండి: ఎలివేట్ ఆన్ؚరోడ్ ధర

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Honda ఎలివేట్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience