హోండా సిటీ పెట్రోల్ మాన్యువల్ వర్సెస్ ఆటోమాటిక్ - రియల్ వరల్డ్ మైలేజ్ పోలిక
మే 25, 2019 11:17 am khan mohd. ద్వారా ప్రచురించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
హోండా సిటీ సివిటి యొక్క మైలేజ్ దాని మాన్యువల్ కంటే ఎక్కువగా ఉంటాయి అని సంస్థ పేర్కొంది, కాని రియల్ వరల్డ్ సంఖ్యలు మరి ఏదో చెబుతున్నాయి
హోండా సిటీ దాని విభాగంలో అత్యంత ప్రసిద్ది చెందిన పేరు పొందింది. దాని తాజా అవతార్, దాని మునుపటి వెర్షన్ ల కన్నా ఎక్కువ కొనుగోలుదారులను సంపాదించింది. ఇది ప్యాకేజీ మెరుగుపరచడానికి కొన్ని కాస్మెటిక్ మరియు ఫీచర్ నవీకరణలను అందుకుని 2017 లో ఒక ఫేస్లిఫ్ట్ రూపంలో మన ముందుకు వచ్చింది.
హోండా సిటీ, పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ స్టాండర్డ్ అయితే, పెట్రోల్ వెర్షన్ మాత్రమే ఒక ఆటోమేటిక్ గేర్బాక్స్ ను కలిగి ఉంటుంది. ఆటోమేటిక్ హోండా సిటీ యొక్క ఇంధన సామర్ధ్యం మాన్యువల్ కంటే మెరుగైనదని కార్ల తయారీదారులు వాదిస్తున్నారు. పెట్రోల్ హోండా సిటీ యొక్క మాన్యువల్ మరియు ఆటోమేటిక్ మైలేజ్ లు వరుసగా 17.4 కెఎంపిఎల్ మరియు 18.0 కెఎంపిఎల్ గా ఉన్నాయి. వాస్తవిక ప్రపంచంలో రెండు కార్లు పరీక్షించాము మరియు ఇక్కడ మేము కనుగొన్నాము.
సరైన స్కోర్ ను స్థిరపరుస్తుంది: టొయోటా యారీస్ వర్సెస్ హ్యుందాయ్ వెర్నా వర్సెస్ హోండా సిటీ: పెట్రోల్ ఆటోమేటిక్ పోలిక రివ్యూ
హోండా సిటీ మైలేజ్ పోలిక:
కారు మోడల్ |
క్లెయిమ్ చేసిన ఇంధన సామర్ధ్యం |
పరీక్షించిన హైవే ఇంధన సామర్ధ్యం |
పరీక్షించిన నగర ఇంధన సామర్ధ్యం |
పెట్రోల్ సిటీ ఎంటి |
17.4 కెఎంపిఎల్ |
19.21 కెఎంపిఎల్ |
13.86 కెఎంపిఎల్ |
పెట్రోల్ సిటీ ఏటి (సివిటి) |
18.0 కెఎంపిఎల్ |
16.55 కెఎంపిఎల్ |
11.22 కెఎంపిఎల్ |
హోండా సిటీ యొక్క పెట్రోల్ వెర్షన్ ను తీసుకున్నట్లైతే దానిలో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్బాక్స్ లతో ఇంధన సామర్ధ్యాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముఖ్యంగా పెట్రోల్ హోండా సిటీ నగరంలో 13.86 కిలోమీటర్లు మరియు రహదారిపై 19.21 కి.మీ. మైలేజ్ ను అందిస్తుంది. మరోవైపు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడిన హోండా సిటీ విషయానికి వస్తే నగరంలో 11.22 కిలోమీటర్లు మరియు హైవేలో 16.55 కిలోమీటర్లు మైలేజ్ ను అందిస్తుంది. మీరు గమనిస్తే, నగరంలో మరియు రహదారిలో, మాన్యువల్ హోండా సిటీ సుమారు 2.6 కిలోమీటర్ల తేడాతో ఉంది అని చెప్పవచ్చు.
సిటీ సివిటి యొక్క తక్కువ ఇంధన సామర్ధ్యం కారణంగా పేస్ మార్చడానికి, దాని పవర్ట్రెయిన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పోలిస్తే ఇంజిన్ పనిని మరింత కష్టతరం చేస్తుంది. ఒక వాస్తవ ప్రపంచ దృష్టాంతంలో వేగంలో మార్పులు చాలా చూస్తాయని, భారతదేశంలోని రహదారులపై కూడా, సిటీ సివిటి మాన్యువల్ తో పోలిస్తే తక్కువ ఇంధన సామర్ద్యాన్ని అందిస్తుంది.
తప్పక చదవండి: టొయోటా యారీస్ సివిటి వర్సెస్ హ్యుందాయ్ వెర్నా ఆటోమాటిక్ వర్సెస్ హోండా సిటీ సివిటి - రియల్ వరల్డ్ పెర్ఫార్మన్స్ పోలికలు
హోండా సిటీ ధరలు
పెట్రోల్ వేరియంట్లు |
హోండా సిటీ మాన్యువల్ |
హోండా సిటీ సివిటి |
ఎస్ |
రూ 8.72 లక్షలు |
- |
ఎస్ వి |
రూ. 9.75 లక్షలు |
- |
వి |
రూ. 10.0 లక్షలు |
రూ. 11.73 లక్షలు |
విఎక్స్ |
రూ. 11.84 లక్షలు |
రూ. 13.03 లక్షలు |
జెడ్ ఎక్స్ |
- |
రూ. 13.70 లక్షలు (సివిటి) |
అన్ని ధరలు ఎక్స్ షోరూం ఢిల్లీ
హోండా సిటీ పెట్రోల్ విషయానికి వస్తే, ఈ వాహనం 1.5 లీటర్ ఐ విటెక్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది, ఈ ఇంజన్ గరిష్టంగా 119 పిఎస్ పవర్ ను మరియు 145 ఎన్ఎమ్ గల గరిష్ట టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ లేదా ఒక సివిటి ఆటోమేటిక్క ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది.
మధ్యతరహా సెడాన్ సెగ్మెంట్ సంబంధిత ఇంధన సామర్ధ్యం కలిగిన పెట్రోల్ సెడాన్ల జాబితా ను చూసినట్లయితే, మారుతి సుజుకి సియాజ్ (20.73 కెఎంపిఎల్ / 19.12 కెఎంపిఎల్ (ఏటి)) దీని ప్రకారం హోండా సిటీ మరియు టయోటా యారీస్ లు (17.10 కెఎంపిఎల్ / 17.80 కెఎంపిఎల్) (ఏటి)) అలాగే హ్యుండాయ్ వెర్నా 1.6 లీటర్ పెట్రోల్ (17.70 కెఎంపిఎల్ / 15.92 కెఎంపిఎల్ (ఏటి)) మైలేజ్ ను అందిస్తాయి.
సిఫార్సు చేయబడినవి: టొయోటా యారీస్ సివిటి వర్సెస్ హ్యుందాయ్ వెర్నా ఆటోమాటిక్: రియల్ వరల్డ్ మైలేజ్ పోలిక
మరింత చదవండి: సిటీ ఆన్ రోడ్ ధర