హోండా వారు తమ 9 వ తరం ఆకార్డ్డును 2016 ఆటో ఎక్స్పో కి తీసుకువచ్చారు
ఫిబ్రవరి 04, 2016 01:28 pm sumit ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
హోండా వారు తమ యొక్క ఫ్లాగ్షిప్ సెడాన్ అయిన 9 వ తరం అకార్డ్డు ను జరుగుతున్న 2016 ఆటో ఎక్స్పో లో బహిర్గతం చేశారు. ముందు 2015 జులై లో U.S లో జరుగిన ఆటో షో లో ప్రదర్శితం అయ్యింది. ఈ వాహనం టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ తో తలపడనుంది.
ఈ ఫేస్లిఫ్ట్ అకార్డ్డు ఒక కొత్త ఫేస్లిఫ్ట్ 7 అంగుళాల సమాచార వినోద వయవస్థను సంగీత ప్రియులకు అందిస్తుంది. ఈ వాహనం ఆపిల్ కార్ప్లే మరియు గూగుల్ ఆండ్రాయిడ్ లను సమర్ధించగలుగుతుంది. కారు బాహ్య మరియు అంతర్భాగాలలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తున్న్నయి. కారు ముందు భాగంలో ఒక ఘంభీరమైన గ్రిల్ మరియు వెనుక నవీకరించిన LED టెయిల్ ల్క్యాంప్స్ ని కలిగి ఉంటుంది. వీటిని మినహాయించి కారు పూర్వ రూపంలోనే ఉండబోతుంది.
ఈ కారు 2.0 లీటర్ i-VTEC 4 సిలెండర్ పెట్రోల్ మిల్ ని కలిగి 130BHPశక్తిని 6000rpm వద్ద మరియు 122Nm టార్క్ ని 3500 నుండి 6000Rpm వద్ద అందించగలుగుతుంది. ఈ వాహనం భారతదేశంలో 2013 లో తగ్గిన డిమాండు దృష్ట్యా నిలిపివేయడమైనది. ఉత్పాదక ఖరీదు పెరగడం వెనుక ఈ కారు యొక్క భాగాలను దిగుమతి చేసుకోవడం ఒక కారణంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఈ వాహనం భారతదేశంలో చోటుచేసుకుంటున్న అభివృద్ధి దృష్ట్యా తప్పక విజయం సాధింగలదు అని ప్రవేశపెడుతూ టాటా వారు తెలియజేశారు. విశ్లేషకుల బట్టి రానున్న సమయంలో భారతదేశం 7% వృద్ధి రేటుని ఇతర దేశాలతో పోలిస్తే నమోదు చేసుకుంటున్నట్టు కనిపిస్తున్నాయి. దీని ద్వారా హోండా వారు తమ యొక్క వాహన శ్రేణులను పెంచుకొనే ప్రయత్నంలో ఉన్నరు. ఈ విధంగా ఇప్పుడు ప్రవేశ్పెట్టబోయే వాహనం వాహన ప్రియులను ఆకర్షించి ప్రత్యర్ద్ధులతో పోటీలో నెగ్గగలదని సంస్థ వారు ఆశిస్తున్నారు.