• English
  • Login / Register

హోండా అసిమో మానవరూపంలో 2016 ఆటో ఎక్స్పోలో నిహాల్ ని కలిసింది

ఫిబ్రవరి 05, 2016 06:35 pm nabeel ద్వారా ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ హోండా యొక్క మానవరూపంలో అసిమో (వినూత్న మొబిలిటీ అడ్వాన్స్డ్ దశ), ఆటో ఎక్స్పో కి తీసుకు రానుంది. ఇది ప్రొగేరియ అనే అరుదైన వ్యాధితో బాదపడుతున్న నైహల్ యొక్క కోరిక తీర్చే క్రమంలో జరిగింది. ఈ సమయంలో, అసిమో నిహాల్ ని మరియు ఆయన కుటుంబాన్ని పలకరించింది మరియు "ఇండియా వాలే ..." అనే పాటకి డాన్స్ చేసింది. ఆసిమో భారతదేశానికి నిహాల్ యొక్క ప్రత్యేక కోరిక మేరకు 6 సంవత్సరాల తరువాత వచ్చింది. ఆసిమోని కలిసి అన్నందం పంచుకున్న తరువాత నిహాల్ ఈ విధంగా మాట్లాడారు "నాకు ఇష్టమైన రోబోట్ ని ఇలా కలవడం నా జీవితకాలపు అవకాశంగా ఆనందిస్తున్నాను. అతనితో మాట్లాడి ఇలా సమయం గడిపినందుకు నాకు నా కుటుంబానికి చాలా అద్భుతం గా ఉంది. నా జీవితంలో ఇటువంటి విలువైన క్షణాలు అందించినందుకు హోండా సంస్థకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను." అని తెలిపారు. 

ఈవెంట్ దగ్గర సమావేశమైన హోండా కార్స్ ఇండియా, అధ్యక్షుడు మరియు CEO, మిస్టర్ కత్సుషి ఇనోయూ మాట్లాడుతూ " మేము అసిమో ని తీసుకొచ్చి ఈ విధంగా నిహాల్ కోరికను తీర్చినందుకు ఆనందంగా ఉంది. నిహాల్ ఆసిమో ని కలిసినప్పుడు ఆయన కళ్ళలోని ఆనందం చూసినప్పుడు మా కృషికి సరైన ఫలితం దక్కింగ్ అని అనిపించింది. నిహాల్ యొక్క ఈ ఆనంద అనుభవం మనకు ఒక బహుమతి." అని తెలిపారు. 

హోండా చివరికి భారతదేశంలో కొనసాగుతున్న ఆటో ఎక్స్పోలో చాలా ఎదురుచూస్తున్న బిఆర్-వి ని తెచ్చింది. ఇది బిఆర్-వి ని ఒక యుటిలిటీ క్రాసోవర్ గా చెప్తుంది, కానీ ఈ 7-సీటర్ MPV క్రెటా మరియు డస్టర్ కి పోటీగా కాంపాక్ట్-ఎస్యూవీ స్పేస్ లో ప్రవేశించింది. ఇతర హ్యుండాయి ప్రదర్శనలు 2016 ఫిబ్రవరి 5 నుండి 9 వరకూ గ్రేటర్ నోయిడాలో జరగనున్న ఆటో ఎక్స్పో హాల్ No.9 లో చూడవచ్చు. 

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience