హోండా అసిమో - రోబోట్లు కోసం ఒక ఆధునిక అడుగు
ఫిబ్రవరి 06, 2016 06:02 pm bala subramaniam ద్వారా ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ రోజు హోండా ఆసిమో అనేది ఒక తెల్లని రోబో నెమ్మదిగా నడుస్తుంది, ఫుట్ బాల్ తో ఆడుతుంది, మీకు కావలసిన పనులు చేసి పెడుతుందని మీ అందరికీ తెలుసు. ఈ ఆసిమో అనేది మూడు దశాబ్ధాలుగా హోండా చేసిన పరిశోధన మరియు అభివృద్ధి ల కలయిక. మేము రోబోటిక్స్ లో మొదటి అడుగులు వేశాము, కాని అది ఇప్పుడు పెరిగి అందరు చూసి ఆశ్చర్యపడేలా చేసింది.
హోండా సంస్థకి మానవరూపంలో ఉన్న రోబోట్ లను తయారుచేయాలి అనే కోరిక 1980 లో ప్రారంభం కాగా అప్పుడు టూ లెగ్గెడ్ ప్రోటైప్ తయారుచేసింది. వీరి మొట్టమొదటి మోడల్ హోండా E సిరీస్ (E1, E2, E3), ఇది మానవుని నడకని సిమ్యులేట్ చేసే విధంగా ఉండే లెగ్స్ ని అభివృద్ధి చేయడం అయ్యింది. సంస్థ E4, E5 మరియు E6 ద్వారా నడక స్థిరీకరణ మరియు మెట్లు ఎక్కే దృష్టి సారించింది.
రోబోట్ కి మరింత బ్యాలెన్స్ మరియు ఫంక్ష్నాలిటీ అందించేందుకు, హోండా తరువాత వారి మొదటి మానవరూపంలో ఉన్న రోబోట్ ని తయారుచేసింది. అది 6 అడుగుల 2 అంగుళాలు పొడవు కలిగి ఉంది. పి సిరీస్, 1993 మరియు 1997 మధ్య నిర్మించబడింది మరియు స్నేహపూర్వక డిజైన్ తో ఫ్1 నమూనా అభివృద్ధి చేయబడింది. ఇంకా ఇది నడిచేలా, మెట్లు ఎక్కడం / మెట్లు దిగేలా, మరియు వైర్లెస్ ఆటోమేటిక్ కదలికలు వంటి అనేక పనులు చేసే విధంగా రూపొందించబడింది.
హోండా వారు అసిమో ని సృష్టించేందుకు E మరియు P సిరీస్ నుండి జ్ఞానం సేకరించారు. ఈ వినూత్న మొబిలిటీ అడ్వాన్స్డ్ రోబో 2000 లో బహిర్గతమైనది. ఈ ఆసిమో పరిగెత్తగలదు, అసమానమన ప్రదేశాలలో నడవగలదు, మెట్లు ఎక్కగలదు మరియు చిన్న చిన్న వాయిస్ కమాండులకి స్పందిస్తుంది.
దాని కెమెరా కళ్ళు ఉపయోగించి, ఆసిమో దానియొక్క పర్యావరణంలో ఉన్న వ్యక్తులను గుర్తించగలదు మరియు స్థిర వస్తువులు నమోదు చేసుకొని దాని దారిలో ఉండే అడ్డంకులను తొలగిస్తుంది.
హోండా ఆసిమో నుండి వ్యక్తిగత చైతన్యం, exoskeletons వంటి అనేక అనువర్తనాల కోసం జ్ఞానం సొంతం చేసుకోడానికి ఉపయోగించాలని ప్లాన్ చేస్తుంది. మానవులు చేయలేని చాలా పనులను రోబోట్ చేయగలదు.