ధరల పెంపు హెచ్చరిక ! ఆఫర్ గడిచి పోకముందే మారుతి కార్లను కొనుగోలు చేయండి
డిసెంబర్ 11, 2015 06:37 pm manish ద్వారా ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: రాబోయే సంవత్సరం మనం అనుకున్నంత సంతోషంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే మారుతి కంపెనీ నిర్ణయం మనకి వ్యతిరేకంగా మారొచ్చు. జనవరి 2016 నుండి దాని అన్ని మోడల్ లైనప్ ధరలు రూ. 20,000 పెరగనున్నాయి. అమెరికన్ డాలర్తో రూపాయి మారకం విలువ పతనాన్నిభర్తీ చేసేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని కంపెనీ వాదిస్తోంది. ద్రవ్యోల్బణం యొక్క సమతౌల్యాన్ని కొనసాగించేందుకు ఇది తప్పదని తెలిపింది. కంపెనీ వినియోగదారుల కొనుగోలు నిర్ణయాన్ని చైతన్యపరిచే లక్ష్యంతో ఉందని మాకు అనిపిస్తుంది. కాబట్టి వినియోగదారులు తాము కోరుకున్న విధంగా తమకు నచ్చిన కారును ఈ సంవత్సరం చివరిలోపు కొనుగోలు చేయడానికి మరియు డీలర్స్ ఖాతాలలో క్లియరెన్స్ అవకాశం పొందుటకు ఒక మంచి తరుణంగా పేర్కొంది.
మారుతి సుజుకి భారతదేశ ప్రతినిధులలో ఒకరు ," ధరల పెరుగుదలకు కారణాలను వివరిస్తూ డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడటం, ఖాతా ఖర్చులు పెరగడం, పరిపాలనా మరియు ఇతర ఖర్చులు పెరగడం వంటి అంశాల వలన ధరల పెంపు అవసర మైందని అన్నారు.
లాభాలు మరియు నష్టాలు ఏమిటి ?
అయితే, ఒకవేళ మీరు ఇప్పుడు కారును కొనుగోలు చేస్తే రూ.20,000 తో కారు వస్తుంది. కానీ కారు మాత్రం 2015 మోడల్ గానే రిజిస్టర్ అవుతుంది. సంవత్సరం పూర్తి అవడానికి ఇంకా ఒక నెల మాత్రమే ఉన్నా కూడా ఇది ఇలానే రిజిస్టర్ అవుతుంది. అదికూడా వెయిటింగ్ పీరియడ్ లేని కార్లకు మాత్రమే ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఎందుకంటే ఒకవేళ మీరు ఇప్పుడు కారు కొన్నారనుకోండి, అది 2016లో డెలివరీ అవుతుంది కాబట్టి అదనంగా రూ.20,000 ఖర్చవుతుంది. విచిత్రం ఏంటంటే ,ఇలా అయితే కారు 2016 మోడల్ గా రిజిస్టర్ అవుతుంది, కొంచెం ఎక్కువ ఖర్చుతో.
భారతదేశం యొక్క అతిపెద్ద వాహన తయారీదారు అయిన మారుతి రెండో అతిపెద్ద కార్ల తయారీదారు హ్యుందాయ్ అడుగుజాడల్లో అనుసరించాడు అని తెలుస్తోంది. కొరియన్ వాహన తయారీదారు అయిన హ్యుందాయ్ దాని వాహన ధరల పరిధిని పెంచుతామని ఇటీవల ప్రకటించింది. అదే దారిలో బి.ఎమ్.డబ్ల్యూ , మెర్సిడెస్ బెంజ్ మరియు టయోటా వంటి ఇతర వాహన పరిశ్రమలు కూడా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: