విడుదలకు సిద్ధంగా ఉన్న Mahindra BE 05 యొక్క గోప్యంగా అందించబడిన వివరాలు
BE 05 అనేది మహీంద్రా యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV, ఇది ICE వెర్షన్ లేకుండా 2025లో వస్తుంది.
-
మహీంద్రా BE 05 అవతార్ దాని కాన్సెప్ట్ రూపం నుండి పోలికలను కలిగి ఉంటుంది.
-
ఫిక్స్‌డ్ గ్లాస్ రూఫ్, ఫ్లష్ డోర్ హాండిల్స్, కనెక్టెడ్ LED టెయిల్ లైట్స్ వంటి అంశాలు అందించబడతాయి.
-
భవిష్యత్తుని తలపించే ఇంటిరీయర్‌లో డ్రైవర్స్ డిస్‌ప్లే మరియు టచ్ స్క్రీన్ సిస్టంలకు స్పోర్ట్ డ్యూయెల్ ఇంటిగ్రేటెడ్ స్క్రీన్స్ ఉంటాయి.
-
450 కిలోమీటర్ల పరిధిని అందించే 60kWh బ్యాటరీ ప్యాక్ లభించే అవకాశం ఉంది.
-
ధరలు దాదాపు రూ. 25 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉండవచ్చు; అక్టోబర్ 2025 నాటికి ప్రారంభించటానికి షెడ్యూల్ చేయబడింది.
మహీంద్రాలో ఛీఫ్ డిజైన్ ఆఫీసర్ ప్రతాప్ బోస్ గారు మహీంద్రా BE.05 యొక్క అవతార్ స్నీక్ పీక్‌ను అందించారు. దీని కాన్సెప్ట్ వెర్షన్ 2022 ఆగస్టులో ఆవిష్కరించబడింది, ఇది మహీంద్రా వారి మొట్టమొదటి ‘బార్న్ ఎలక్ట్రిక్’ మోడల్. ఇది 2025 అక్టోబర్ నాటికి అమ్మకాలకు అందుబాటులో ఉంటుంది.
టీజర్ బహిర్గతం అంటే ఏంటి?
View this post on Instagram
ఈ చిత్రంలో BE 05 ను టాప్ యాంగిల్ చూడవచ్చు, దీనితో మనకు ముందు వెనక డిజైనులు సరిగ్గా కనిపించవు. బానెట్ డిజైన్ కాన్సెప్ట్ వెర్షన్‌లో చూపించిన విధంగానే మందపాటి వంపులతో కొట్టొచ్చేలా కనిపిస్తుంటుంది. పూర్తి స్తాయి గ్లాస్ బ్లాక్ ఆప్లిక్ కలిగి ఉన్నట్టుగా కనిపిస్తుంది, దీనిలో పెద్ద LED DRLsలను పెట్టవచ్చు.
దాదాపు క్యాబిన్ భాగమంతా ఫిక్స్‌డ్ గ్లాస్ రూఫ్ కలిగి ఉన్న మహీంద్రా వారి మొట్టమొదటి వాహనం ఇదే అని చెప్పవచ్చు. BE 05 డోర్లు, XUV700 లాగానే ఫ్లష్ డోర్ హాండిల్స్‌ను కలిగి ఉంటాయి. ఆఖరిగా, బూట్ లిడ్ అనేది పూర్తి స్తాయిలో కనెక్టెడ్ C-ఆకార LED లైట్లతో మస్కులార్ ఆకర్షణను కలిగి ఉంటుంది.
లోపలి ఇంటిరీయర్‌ను ఇక్కడ మనం కొంచెం చూడవచ్చు, ఇది ఆధునిక ప్రీమియమ్ డ్యూయల్ ఇంటిగ్రెటేడ్ డిస్‌ప్లే స్క్రీన్లను కలిగి ఉంది. BE 05 ప్రొడక్షన్-స్పెక్ క్యాబిన్ కాన్సెప్ట్ వెర్షన్‌కు సారూప్యంగా ఉంటుందని ఆశించవచ్చు.
ఇది కూడా చూడండి: ఈ 15 వివరణాత్మక చిత్రాల ద్వారా మహీంద్రా థార్ EV చూడండి
ప్రస్తుతం తెలిసిన మరి కొన్ని వివరాలు
మహీంద్రా BE 05 అనేది SUV మేకర్ల EV-స్పెసిఫిక్ INGLO ప్లాట్‌ఫారం మీద ఆధారపడి ఉంది. దాదాపు 450 కిలోమీటర్ల పరిధిని అందుకొనేలా ఇది 60kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. మహీంద్రా వారు 175 kW వరకు త్వరిత చార్జింగ్‌ను ఇస్తుందని చెపుతున్నారు, దీని ప్రకారం EV కేవలం 30 నిముషాలలోనే 5 నుండి 80 శాతం చార్జ్ అయిపోతుంది.
INGLO ప్లాట్‌ఫారం ముందు, వెనక, అలాగే ఆల్ వీల్ డ్రైవ్ ట్రైనులను పొందుపరుచుకోగల సామర్థ్యం కలిగి ఉంటుంది. మహీంద్రా వారి ప్రకారం రీర్-వీల్-డ్రైవ్ మోటల్స్ 285PS వరకు పవర్ ను ఇవ్వగలవు, అదే AWD దాదాపు 394PS వరకు పవర్ ను ఉత్పత్తి చేయగలవు.
ఇది కూడా చూడండి: 10 చిత్రాలలో కొత్త మహీంద్రా గ్లోబల్ పిక్ అప్‌ని తనిఖీ చేయండి
అంచనా ధరలు మరియు పోటీదారులు
MG ZS EV కు పోటీగా BE 05 రీటైల్ ధర దాదాపు రూ. 25 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చని అనుకుంటున్నాము. అయితే, రానున్న హ్యుందాయ్ క్రెటా EV మరియు టాటా కర్వ్ EV ల నుండి ఇది గట్టి పోటీని ఎదుర్కోవచ్చు.