హ్యుందాయ్ ఎక్స్టర్ ఇంటీరియర్ మరియు ఫీచర్‌ల వివరణాత్మక వీక్షణ
హ్యుందాయ్ ఎక్స్టర్ కోసం tarun ద్వారా జూన్ 16, 2023 04:29 pm ప్రచురించబడింది
- 65 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
హ్యుందాయ్ ఎక్స్టర్ వెన్యూ కంటే దిగువ స్థానంలో నిలుస్తుంది మరియు టాటా పంచ్ؚతో పోటీ పడనుంది
-
ఎక్స్టర్ ఇంటీరియర్ సెమీ-లెదర్ సీట్‌లతో గ్రాండ్ i10 నియోస్‌ను తలపిస్తుంది.
-
8-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటో AC మరియు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి.
-
భారీ వీల్ؚబేస్‌ను కలిగి ఉంది: పొడవు 2450mm మరియు ఎత్తు 1631mm.
-
ఇంజన్ డ్యూటీలను 5-స్పీడ్‌ల MT మరియు AMTతో జోడించిన 83PS 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ నిర్వహిస్తుంది.
-
ధర సుమారు రూ.6 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉండవచ్చు.
హ్యుందాయ్ ఎక్స్టర్ ఎక్స్‌టీరియర్ డిజైన్ వివరాలు ఇదివరకే వెల్లడించగా, ప్రస్తుతం దీని ఇంటీరియర్ؚను కొన్ని ఫీచర్‌లతో సహా వెల్లడించారు. జులై 10 తేదీన రాబోతున్న ఎక్స్టర్ బుకింగ్ؚలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
ఇంటీరియర్ؚ గురుంచి తెలుసుకుందాం
హ్యుందాయ్ ఎక్స్టర్ ఇంటీరియర్ పూర్తిగా నలుపు రంగులో వస్తుంది, దీని సెంటర్ కన్సోల్ డిజైన్, డ్యాష్ؚబోర్డ్ డైమండ్ ప్యాటర్న్, టర్బైన్ ఆకారపు AC వెంట్ؚలు గ్రాండ్ i10 నియోస్ హ్యాచ్ؚబ్యాక్ؚను నుండి ప్రేరణ పొందినట్లు కనిపిస్తున్నాయి.
స్టీరింగ్ వీల్ హ్యాచ్ؚబ్యాక్ؚ మరియు దీని సెడాన్ కౌంటర్ పార్ట్ؚలో (ఆరా) ఉన్నట్లుగానే ఉంది కానీ లెదర్ అప్ؚహోల్ؚస్ట్రీతో కవర్ చేయబడింది. సీట్లు కూడా సెమీ-లెదర్ అప్ؚహోల్ؚస్ట్రీ ఫినిష్‌ను కలిగి ఉన్నాయి.
పూర్తిగా డిజిటైజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో, మధ్య భాగంలో 4.2-అంగుళాల TFT MIDతో ఇది వెన్యూలో ఉన్నట్లుగానే కనిపిస్తుంది. ధృవీకరించిన ఇతర ఫీచర్‌లలో 8-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, వైర్ؚలెస్ ఛార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమ్యాటిక్ AC, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, ఆటోమ్యాటిక్ హెడ్ؚల్యాంప్ؚలు, మరియు ప్రయాణీకులు అందరికి మూడు-పాయింట్‌ల సీట్ బెల్ట్ؚలు ఉన్నాయి. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ 60 వరకు బ్లూలింక్ కనెక్టెడ్ ఫీచర్‌లు, వాయిస్ కమాండ్ؚలు, బహుళ-భాషా ఇన్ఫోటైన్ؚమెంట్, హిందీ మరియు ఇంగ్లీష్‌లో అలెక్సా ద్వారా హోమ్-టు-కార్ వాయిస్ కమాండ్ ఫీచర్‌లకు మద్దతు ఇస్తుంది
ఇది కూడా చదవండి: హ్యుందాయ్ ఎక్స్టర్: దీని కోసం ఎదురుచూడాల లేదా పోటీదారులను ఎంచుకోవాలా?
కొలతలు
ఎక్స్టర్ వీల్ؚబేస్ 2450mm మరియు ఎత్తు 1631mmగా ఉంటుంది అని హ్యుందాయ్ ప్రకటించింది. ఈ వీల్ؚబేస్ నియోస్‌తో సమానంగా ఉంది, కానీ పొడవు 111mm ఎక్కువ.
ధృవీకరించిన ఇతర వివరాలు
ఎక్స్టర్‌ను ఐదు వేరియెంట్‌లలో అందిస్తున్నారు - EX, S, SX, SX (O) మరియు SX (O) కనెక్ట్. 83PS 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ దీనికి శక్తిని అందిస్తుంది, ఇది 5-స్పీడ్‌ల మాన్యువల్ మరియు AMT ట్రాన్స్ؚమిషన్‌తో జోడించబడింది. విడుదల సమయంలో మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో CNG ఎంపిక కూడా ఉంటుంది.
ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మరియు డ్యూయల్-కెమెరా డ్యాష్ؚక్యామ్ వంటి ఫీచర్‌లను హ్యుందాయ్ ఇదివరకే ధృవీకరించింది. భద్రత ఫీచర్‌లలో ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ESC, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రేర్ పార్కింగ్ కెమెరా, ISOFIX ప్రామాణిక చైల్డ్ సీట్ మౌంట్ؚలు ఉన్నాయి.
ఇది కూడా చూడండి: మొదటిసారి కెమెరాకు చిక్కిన నవీకరించిన హ్యుందాయ్ i20 N లైన్
ప్రయాణీకుల భద్రత విషయంలో, ఇది ఆరు ఎయిర్ బ్యాగ్ؚలను ప్రామాణికంగా పొందుతుంది. EBDతో ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), రేర్ పార్కింగ్ కెమెరా, ISOFIX చైల్డ్-సీట్ యాంకరేజ్ؚలు కూడా ఉన్నాయి.
ధర అంచనా మరియు పోటీదారులు
హ్యుందాయ్ ఎక్స్టర్ ధర సుమారు రూ.6 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉండవచ్చని అంచనా. టాటా పంచ్, సిట్రోయెన్ C3, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కైగర్ మరియు మారుతి ఫ్రాంక్స్ వంటి వాటితో పోటీ పడుతుంది.