2025 చివరి నాటికి విడుదల కానున్న అన్నీ Tata EVల వివరాలు
టాటా హారియర్ ఈవి కోసం sonny ద్వారా జనవరి 19, 2024 09:47 pm ప్రచురించబడింది
- 1.3K Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ అన్నీ మోడల్ؚలు కొత్త టాటా Acti.EV ప్యూర్ ఎలక్ట్రిక్ ప్లాట్ؚఫార్మ్ పై ఆధారపడనున్నాయి
టాటా సరికొత్త Acti.EV ప్యూర్-ఎలక్ట్రిక్ ఆర్చిటెక్చర్ పై ఆధారపడిన మొదటి మోడల్ అయిన టాటా పంచ్ EV ఇటీవల విడుదల అయ్యింది. టాటా పాసెంజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ. శైలేష్ చంద్రతో చేసిన సంభాషణలో, 2025 చివరి నాటికి Acti.EV ప్లాట్ؚఫార్మ్ పై ఆధారపడి మరొక నాలుగు EVలు విడుదల అవుతాయని తెలిసింది. తరువాత ఏ మోడల్‌లు రాబోతున్నదో చూద్దాం:
టాటా కర్వ్ EV
అంచనా విడుదల: 2024 మధ్య కాలంలో
అంచనా ధరలు: రూ. 20 లక్షల నుండి
2021 తరువాత టాటా అందిస్తున్న మొదటి సరికొత్త ఆఫరింగ్ కర్వ్ EV, ఇది కూపే-స్టైల్ కాంపాక్ట్ SUV. ఈ కారు తయారీదారు లైన్అప్ؚలో ఇది నెక్సాన్ మరియు హ్యారియర్ SUVల మధ్య ఉంటుంది. టాటా దీన్ని కాన్సెప్ట్ రూపంలో 2022లో ప్రదర్శించింది, ఇటీవలి నెలలలో దీని టెస్ట్ వాహనాలు పరీక్ష చేయబడుతూ అనేకసార్లు కెమెరాకు చిక్కాయి.
టాటా హ్యారియర్ EV
అంచనా విడుదల: 2024-చివరిలో
అంచనా ధరలు: రూ. 25 లక్షల నుండి
2024లో టాటా నుండి వస్తున్న భారీ కొత్త ఎలక్ట్రిక్ SUV, మిడ్-సైజ్ SUV హ్యారియర్ పూర్తి-ఎలక్ట్రిక్ వర్షన్ కావచ్చు. వీటి విక్రయాలు ప్రారంభం అయిన తరువాత, ఇది టాటా EV ఫ్లాగ్ؚషిప్ వాహనం కానుంది, కానీ హ్యారియర్ EV గురించి అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది ఆల్-వీల్-డ్రైవ్ పవర్ؚట్రెయిన్ؚతో కూడా అందించబడవచ్చు. ఇది ఆటో ఎక్స్ؚపో 2023లో కాన్సెప్ట్ రూపంలో ఆవిష్కరించబడింది మరియు కొత్త Acti.EV ప్లాట్ؚఫార్మ్ పై ఆధారపడిన అతి పెద్ద ఆఫరింగ్ؚలలో ఒకటి.
సంబంధించినది: టాటా హ్యారియర్ మరియు హ్యారియర్ EV కాన్సెప్ట్ؚల మధ్య డిజైన్ తేడాలను ఈ 12 చిత్రాలలో పరిశీలించండి
టాటా సియార్రా EV
అంచనా విడుదల: 2025-మధ్య కాలంలో
అంచనా ధరలు: రూ. 25 లక్షల నుండి
ఐకానిక్ టాటా సియార్రా పూర్తి-ఎలక్ట్రిక్ రూపంలో తిరిగి రాబోతున్నది. దీన్ని కూడా ఆటో ఎక్స్ؚపో 2023లో కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించారు. ఒరిజినల్ సియార్రా యొక్క ఐకానిక్ స్టైలింగ్ ఎలిమెంట్ؚలలో కొన్నిటీని నేటి కాలానికి తగినట్లుగా తీసుకొని వస్తుంది. కర్వ్ EV వంటి వాహనాలకు సియార్రా EV జీవనశైలి ప్రత్యామ్నాయం అవుతుంది.
టాటా ఆల్ట్రోజ్ EV
అంచనా ధర: 2025-చివరిలో
అంచనా ధరలు: రూ. 15 లక్షల నుండి
రానున్న టాటా EVల గురించి ఆశ్చర్యకరమైన ప్రకటన ఆల్ట్రోజ్ EV కూడా రానున్నది అనే విషయం. ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న కాన్సెప్ట్ ప్రదర్శన మరియు అనేక టెస్ట్ వాహనాలు కనిపించిన తరువాత 2021లో ఇది విడుదల అవుతుందని ఆశించారు, అయితే తరువాత టాటా EV ప్రణాళికలో ఈ ఎలక్ట్రిక్ ప్రీమియం హ్యాచ్ؚబ్యాక్ؚకు స్థానం లేదు అని భావించారు. Acti.EV ప్లాట్ؚఫార్మ్ పై ఆధారపడిన ఆల్ట్రోజ్ EV వచ్చే సంవత్సరం విడుదల అవుతుందని ఇప్పుడు నిర్ధారణ అయ్యింది. నవీకరించిన ఆల్ట్రోజ్ ICE (ఇంటర్నల్ కంబుషన్ ఇంజన్) మోడల్ పై ఇది ఆధారపడవచ్చు. ఆల్ట్రోజ్ ICE కొత్త డిజైన్ మరియు అనేక ఫీచర్ అప్ؚడేట్ؚలతో 2024లో విడుదల అవుతుందని అంచనా.
మీరు ఏ కొత్త టాటా EV గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు? క్రింది కామెంట్ సెక్షన్ؚలో మాకు తెలియజేయండి.